సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): జల్..జంగల్..జవీున్ అంటూ తమ హక్కుల సాధనకు ఉద్యమించిన అడవిబిడ్డలపై ఆనాటి సర్కారు తూటాల వర్షం కురిపించింది. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘటనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అనధికారికంగా ఎక్కువ మందే అసువులు బాసారు. ఈ నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు. ప్రత్యేక రాష్ట్రంలో 2015 నుంచి పలు ఆంక్షలు సడలించడంతో స్వేచ్ఛగా వందలాది మంది ఆదివాసీలు ఇంద్రవెల్లికి వచ్చి అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా.. ఆదివాసీ సంఘాల అభ్యర్థన మేర కు జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతి ఇవ్వడంతో రెండు గంటల పాటు నివాళులరి్పస్తున్నారు. ఈ సారి కరో నా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం ఐదుగురితోనే అమరులకు నివాళులరి్పస్తామని ఆది వాసీలు నిర్ణయించారు. (కరోనా టీకాకు నేను వ్యతిరేకం: జొకోవిచ్ )
అసలేం జరిగిందంటే..
స్వాతంత్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజనులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఉమ్మడి జిల్లా నలువైపులా నుంచి వచ్చిన గిరి పుత్రులతో ఇంద్రవెల్లి కిక్కిరిసిపోయింది. అప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా వినకుండా ర్యా లీగా ముందుకు సాగారు. వారిని అడ్డుకొని గిరిజన యువతితో ఓ పోలీస్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి సదరు పోలీస్‌పై దాడి చేయడంతో ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్ బాబు )
తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు పరుగులు తీశారు. పోలీసుల కాల్పులు జరుపగా ఎంతో మంది నేలకొరగగా.. 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో ఉంది. వైద్యం అందక సుమారు 60 మంది చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజ నిర్ధరణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీలు నేటికీ నేరవెరలేదు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంక్షలు..
కాల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. అమరులకు నివాళులరి్పంచేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఏటా ఘటన జరిగిన(ఏప్రిల్ 20) తేదీ కంటే రెండు రోజుల ముందే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడంతో పాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరి సరాల్లో 144 సెక్షన్ విధించేవారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. లాక్‌డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో అమరులకు నివాళులరి్పంచడానికి పోలీసులు అనుమతిచ్చారు. పోలీసుల బందోబస్తు లేకుండా సోమవారం స్తూపం వద్ద ముఖ్య నేతలు నివాళులరి్పంచనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు 30 పోలీసు యాక్టుతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్థానిక ఎస్సై గంగారం తెలిపారు.
అమలుకు నోచుకోని హామీలు..
ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, రాష్ట్రం ఏర్పడ్డక హరీశ్‌రావులు సైతం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో )
ఇళ్లలోనే నివాళులరి్పంచండి
జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అమరులైన వారికి నివాళులరి్పంచడానికి ఎవరూ ఇంద్రవెల్లి రావద్దు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆదివాసీలు తమ తమ ఇళ్లలోనే నివాళులరి్పంచాలి.
– సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ (అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా.. 10 వేల ఫాలోవర్స్)
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం
Comments
Please login to add a commentAdd a comment