martyrs memorial
-
అమరుల కుటుంబాలను గౌరవించాలి
సుభాష్‌నగర్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించు కోవడానికే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలను గౌరవించుకోవడం కోసమే కార్యక్రమం చేపట్టామన్నారు. ఉద్యమంలో జిల్లాలో 32 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి కు టుంబానికి రూ.10 లక్షల చొప్పున నగదు అందించామని, 30 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించా మన్నారు. మరో రెండు కుటుంబాలకు కూడా ఉ ద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 21 రోజుల పా టు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అండగా సీఎం కేసీఆర్ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు అన్నారు. 2001 నుంచి కేసీఆర్‌తో అడుగులో అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో తెలంగాణ సాధించి 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ అమరుల త్యాగంతోనే తెలంగాణ ఏర్పడిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలో 8 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు. వారి లోటు మరువలేనిదని, బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నగదు అందజేసి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవడం, వారి కుటుంబాలను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నాయకులను విస్మరించడం సరికాదని, కార్యక్రమ సమాచారం, ఆహ్వానం అందలేదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
Telangana: అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫొటోలు)
-
నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరిమీద జరిగి ఉండదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల బలిదానాలు బాగా కలిచి వేశాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో అమరుల ప్రాణ త్యాగాలకు వెలకట్టలేమని.. 600 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం సభావేదికపైకి చేరుకొని తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతోపాటు పలువురి అమరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటంలో హింస జరగకుండా తమ శక్తిమేర చూశామని చెప్పారు. తనపై జరిగిన దాడి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపై జరిగి ఉండదని.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని చెప్పుకొచ్చారు. చదవండి: అమరుల స్మారక చిహ్నం ప్రారంభం, ప్రత్యేకతలివే ‘నిరసనలతో ఢిల్లీ సర్కార్ దిగి వచ్చింది. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించాం. ఉద్యమంతోనే ఢిల్లీ నుంచి తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన వచ్చింది. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టే విధంగా దిగజారారు. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలున్నాయి. ఆ తరువాత 8 ఏళ్లకే ఇబ్బందులు మొదలయ్యాయి. టీఎన్జీవోలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తొలి, మలి ఉద్యమాల్లో విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. పోరాటంలో ఎప్పుడూ జయశంకర్ వెనకడగు వేయలే. ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాం. అమరజ్యోతి ఎల్లకాలం ఉండేలా నిర్మించుకున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. అందరి అంచనాలు తలకిందులు చేశాం. పంజాబ్‌ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌గా ట్యాంక్‌బండ్ తయారైంది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించారు. -
అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అమర వీరులకు నివాళిగా పోలీసులు గౌరవ వందనం చేశారు. 12 తుపాకులతో గన్ సెల్యూట్ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్, సీఎస్ శాంతాకుమారి, డీజీపీ అంజనీకుమార్ స్వీకరించారు. పిడికిలి ఎత్తి జై తెలంగాణ అంటూ నినదించిన సీఎం.. లోపల అమరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధా కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమరుల కుటుంబాలను సత్కరించిన సీఎం కేసీఆర్ అనంతరం సభావేదికపైకి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. అమరులకు నివాళిగా గేయాలను ఆలపించారు. సభలో 10 వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ సన్మానించారు. తరువాత లేజర్, 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించనున్నారు. చదవండి: మళ్లీ గెలిపిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తాం: సీఎం కేసీఆర్ అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. అమరుల స్థూపం ప్రత్యేకతలు ►హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్క్ వద్ద 3.29 ఎకరాల్లో అమర వీరుల స్మారక జ్యోతి నిర్మాణం ►రూ. . 177 కోట్లు, మొత్తం ఆరు ఫ్లోర్లతో నిర్మాణం ►26,800 చ.మీ. విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో స్మారక నిర్మాణం. ► ప్రజ్వలన దీపం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు, ►స్టెయిన్లెస్ స్టీల్‌తో అమరవీరుల స్థూపం తయారు. ►16 వందల టన్నుల స్టెయిన్ స్టీల్ వాడకం. ►మొదటి 2 బేస్మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు ►335 కార్లు 400 బైక్‌లకు పార్కింగ్ సదుపాయం. ►150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం ►మొదటి అంతస్తులో అమరుల ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్ ►రెండో అంతస్తులో 500 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ ►మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో అద్దాల పైకప్పు నిర్మాణం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈరోజు అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
-
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదు. పంజగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు రోటరీ వైపు వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలను షాదాన్ కళాశాల నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలకు రోటరీ చౌరస్తా వైపునకు అనుమతి ఉండదు. బుద్ధ భవన్ నుంచి వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌వైపు వెళ్లడానికి నల్లకుంట చౌరస్తా నుంచి మళ్లిస్తారు. లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపునకు వెళ్లడానికి అనుమతి లేదు. రాణీగంజ్, కవాడిగూడల నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. బడా గణేష్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు, మింట్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ బడా గణేష్ వద్ద నుంచి రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లింపు ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం దృష్ట్యా 22న ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీపార్క్ మూసి ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి ఎగువ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ప్రత్యామ్న్యాయ మార్గాల్లో వెళ్లాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: కాంగ్రెస్‌లో జోష్.. పొంగులేటి ఇంటికి రేవంత్‌రెడ్డి -
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఒడ్డున అమరవీరుల స్మారక చిహ్నం (ఫొటోలు)
-
పదేళ్ల తెలంగాణ.. ఆవిర్భావ వేడుకల ఫోటోలు
-
ఆ అవకాశం నాకు దక్కింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. గన్‌పార్క్‌లో స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. సచివాలయం వద్ద జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించి.. అక్కడి సభా వేదిక నుంచి ప్రసంగించారాయన. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానానికి పదేళ్లు పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం రక్తసిక్తమైంది. శాంతియుతంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయి. మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర సాధనలో అమరులైనవారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అరవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 🎤 తెలంగాణపథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మన సంక్షేమ మోడల్‌ను కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఏ పథకం తెచ్చినా అందులో మానవీయ కోణమే ఉంటుంది. 🎤 రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవా కానుకగా.. బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం. 🎤 పోడు భూముల శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నాం. పోడు భూములకు రైతు బంధు వర్తించేలా చర్యలు చేపట్టబోతున్నాం. 🎤 గొల్ల, కుర్మలకు భారీ ఎత్తున్న గొర్రెలను పంపిణీ చేయబోతున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో విడుత పంపిణీ చేయబోతున్నాం. 🎤 గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అర్హులైన వాళ్లకు ఇళ్ల స్థలాలు అందిస్తాం. గృహలక్ష్మి పథకం ఒక్కో ఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. 🎤 దళిత బంధు ద్వారా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇస్తున్నాం. హుజూరాబాద్‌లో వందకు వంద శాతం ఈ పథకం అమలు అయ్యింది. ఇప్పటివరకు మొత్తం 50 వేలమందికి దళిత బంధు లబ్ధి చేకూరింది. 🎤 మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించాం. చెరువుల కింద పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. 🎤 ఇవాళ తెలంగాణలో కరెంట్ కోతలు లేవు.. అన్నీ వరి కోతలే 🎤 గ్రామీణఆర్థిక వ్యవస్థను బలపరిచాం. మన పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డు వస్తున్నాయి. 🎤 ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్నో అవార్డులు మిషన్ భగీరథకు వచ్చాయి.స్వరాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ సమస్యలు లేవు. 🎤 నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశాం. కాళేశ్వరంను అతితక్కువ కాలంలో పూర్తి చేశాం. 🎤 రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా కళ్లు తెరిపించింది. 🎤 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. 🎤 పవర్ హాలీడేతో పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. మోదీ స్వరాష్ట్రంలోనూ పవర్ హాలీడే అమలు అవుతోంది. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. -
Hyderabad: తటాక తీరాన.. మణి మకుటాలు..
అటు చూస్తే తుది దశకు చేరిన నూతన సచివాలయ నిర్మాణం.. ఇటు చూస్తే పూర్తి కావస్తున్న అమర వీరుల స్మారకం. ఆ వంక రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహం. భాగ్యనగరి కీర్తి కిరీటంలో మణిమకుటాలుగా విరాజిల్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరానికి సరికొత్త సొబగులను అద్దనున్నాయి. నగరవాసులకు, పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. -
దుబాయ్ స్టీలు.. అంచనా పెంచేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అలాంటివి రెండే నిర్మాణాలున్నాయి.. మూడోది హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటోంది. అమెరికాలోని షికాగోలో 2006లో రూపొందిన ‘ది బీన్’శిల్పం మొదటిది కాగా, చైనాలోని జింగ్జియాన్ రీజియన్‌లో 2015లో ‘ది ఆయిల్ బబుల్’శిల్పం రెండోది. ఈ రెండింటి కంటే కొన్ని రెట్లు పెద్దదిగా ప్రమిద ఆకృతిలో రూపుదిద్దుకుంటున్నదే హైదరాబాద్‌లోని ‘అమరవీరుల స్మారక భవనం’. అద్దంలో కనిపించినట్టుగానే ఎదుటి ప్రాంతం ప్రతిబింబిస్తుంది. ఇది నునుపుగా ఉండే 60 వేల చదరపు అడుగుల స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో అతుకుల్లేని విధంగా స్టెయిన్లెస్ స్టీల్ ప్యానెల్స్‌ను అమరుస్తారు. దాదాపు 48 అడుగుల ఎత్తుతో ఉం డే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకుంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తెలంగాణ అమరవీరులను స్మరించుకునేలా.. వెలుగుతున్న ప్రమిద ఆకృతిలో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం దేశంలోనే ఆ తరహా కట్టడాల్లో మొదటిది. హైదరాబాద్ పర్యాటకులకు గొప్ప అనుభూతిని పంచేలా ఇది రూపొందుతోంది. అన్నీ కుదిరితే వచ్చే దసరా నాటికి ఇది ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు కట్టడం చుట్టూవాడే స్టెయిన్లెస్ స్టీలు ప్యానెల్స్ వ్యయాన్ని కంపెనీ భారీగా పెంచేసింది. రూ.140 కోట్లలోపు వ్యయంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రూ.177 కోట్లను దాటబోతోంది. అమెరికా తరహాలో చైనాలోని ఆకృతి ఇదీ సంగతి... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర అమరవీరులదే. అందుకే వారి స్మృత్య ర్థం ఓ స్మారకాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధా రణ నిర్మాణంగా కాకుండా ప్రత్యేకంగా ఉం డాలని భావించింది. దీంతో రకరకాల డిజైన్ల ను పరిశీలించి చివరకు వెలుగుతున్న ప్రమిద నమూనాను ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. అయితే ఆ డిజైన్‌కు అతుకుల్లేని విధంగా చుట్టూ స్టెయిన్లెస్ స్టీలు ప్యానెల్స్‌ను వినియోగించే విషయంలో డిజైన్ రూపొందించిన సంస్థ స్ట్రక్చరల్ ఇంజనీర్, పనులు నిర్వహించే యంత్రాంగానికి మధ్య సమన్వయం కొరవడింది. నిర్మాణం తర్వాత చుట్టూ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారని భావించి, దానికి రూ.5 కో ట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేసుకున్నారు. స్థానికంగానే దాన్ని రూపొందిస్తారని అధికారులు భావించారు. అయితే, అది అతుకుల్లేకుండా కనిపించేవిధంగా, వాతావరణ మార్పులకు వెలసిపోకుండా, పెద్ద పెద్ద పక్షు లు వాలినప్పుడుగానీ, ఇతర పరిస్థితుల్లోగానీ ఎలాంటి గీతలు పడకుండా, సొట్టలు పడ కుండా ఉండేటట్టు ప్రత్యేక రోబోటిక్ కటింగ్, లేజర్ బెండింగ్ పద్ధతిని అనుసరించాల్సి రావడంతో వ్యయం భారీగా పెరిగింది. దుబాయ్ కంపెనీతో ఒప్పందం చైనాలో ఆ విధమైన ఆధునిక పరిజ్ఞానం ఉందని అధికారులు మొదట గుర్తించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో ఒప్పందం చేసుకునే వీలు లేకపోవటంతో ఓ దుబాయ్ కంపెనీని సంప్రదించారు. ముఖ్యమంత్రి ఆ మోదం పొందిన డిజైన్ కావటంతో దానిలో మార్పులు చేసేందుకు అధికారులు జంకా రు. గ్లాస్ ప్యానెల్స్, అల్యూమినియం ప్యానెల్స్‌తో చేయిస్తే సాధారణ ఖర్చులోనే ముగిసేది. కానీ, ఈ స్తూపం నిర్మాణంలో ప్రత్యే కంగా 4 ఎంఎం గేజ్‌తో ప్రత్యేక స్టీల్‌నే వాడా ల్సి వచ్చింది. సంబంధిత దుబాయ్ కంపెనీతో మాట్లాడాక కంగుతినటం అధికారుల వంతైంది. దాదాపు రూ.40 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావటమే దానికి కారణం. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ కంపెనీతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం అంతమేర పెరిగిపోవాల్సి వచ్చింది. ఇప్పు డు ఆ స్టీల్‌ను అక్కడే ప్రమిద ఆకృతికి తగ్గట్టుగా పలు ప్యానెల్స్‌గా కట్ చేసి, వాటికి గీతలు, సొట్టలు పడని విధంగా ప్రత్యేక కంటెయినర్లలో ఉంచి దుబాయ్ నుంచి తెప్పిస్తున్నారు. మొత్తం 23 కంటెయినర్లలో ఐదు కంటెయినర్లు మన దేశానికి చేరుకున్నాయి. ఇందులో రెండు కంటెయినర్లు పనిజరుగుతున్న చోటికి రాగా, మిగతా మూడు డ్రైపోర్టులో ఉన్నాయి. మిగతావి మరో మూడు నెలల్లో ఇక్కడికి రానున్నాయి. -
ఆరు నెలల్లో స్మారకం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖులు ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడి మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి, నివాళులర్పించినట్లే హైదరాబాద్‌కు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు వచ్చిన సందర్భాల్లో తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించే సంప్రదాయం రావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మిస్తున్న స్మారకం పనులను శుక్రవారం అధికారులతో కలసి మంత్రి పరిశీలించారు. ఖర్చుకు వెనకాడకుండా దీన్ని అద్భుతంగా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లుంబినీ పార్కు సమీపంలో ఇది రూపుదిద్దుకుంటున్నందున భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 350 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మారకం మొదటి అంతస్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న తీరు అక్కడి ఛాయా చిత్ర ప్రదర్శన కళ్లకు కడుతుందని చెప్పారు. రెండో అంతస్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ ఉంటుందన్నారు. మూడో అంతస్తులో రెస్టారెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్మారక భవనం రూపుదిద్దుకుంటోందన్నారు. ఆరు నెలల్లో ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ పద్మనాభరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): జల్..జంగల్..జవీున్ అంటూ తమ హక్కుల సాధనకు ఉద్యమించిన అడవిబిడ్డలపై ఆనాటి సర్కారు తూటాల వర్షం కురిపించింది. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘటనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అనధికారికంగా ఎక్కువ మందే అసువులు బాసారు. ఈ నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు. ప్రత్యేక రాష్ట్రంలో 2015 నుంచి పలు ఆంక్షలు సడలించడంతో స్వేచ్ఛగా వందలాది మంది ఆదివాసీలు ఇంద్రవెల్లికి వచ్చి అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా.. ఆదివాసీ సంఘాల అభ్యర్థన మేర కు జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతి ఇవ్వడంతో రెండు గంటల పాటు నివాళులరి్పస్తున్నారు. ఈ సారి కరో నా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం ఐదుగురితోనే అమరులకు నివాళులరి్పస్తామని ఆది వాసీలు నిర్ణయించారు. (కరోనా టీకాకు నేను వ్యతిరేకం: జొకోవిచ్ ) అసలేం జరిగిందంటే.. స్వాతంత్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజనులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఉమ్మడి జిల్లా నలువైపులా నుంచి వచ్చిన గిరి పుత్రులతో ఇంద్రవెల్లి కిక్కిరిసిపోయింది. అప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా వినకుండా ర్యా లీగా ముందుకు సాగారు. వారిని అడ్డుకొని గిరిజన యువతితో ఓ పోలీస్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి సదరు పోలీస్‌పై దాడి చేయడంతో ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్ బాబు ) తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు పరుగులు తీశారు. పోలీసుల కాల్పులు జరుపగా ఎంతో మంది నేలకొరగగా.. 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో ఉంది. వైద్యం అందక సుమారు 60 మంది చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజ నిర్ధరణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీలు నేటికీ నేరవెరలేదు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంక్షలు.. కాల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. అమరులకు నివాళులరి్పంచేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఏటా ఘటన జరిగిన(ఏప్రిల్ 20) తేదీ కంటే రెండు రోజుల ముందే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడంతో పాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరి సరాల్లో 144 సెక్షన్ విధించేవారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో అమరులకు నివాళులరి్పంచడానికి పోలీసులు అనుమతిచ్చారు. పోలీసుల బందోబస్తు లేకుండా సోమవారం స్తూపం వద్ద ముఖ్య నేతలు నివాళులరి్పంచనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు 30 పోలీసు యాక్టుతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్థానిక ఎస్సై గంగారం తెలిపారు. అమలుకు నోచుకోని హామీలు.. ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, రాష్ట్రం ఏర్పడ్డక హరీశ్‌రావులు సైతం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో ) ఇళ్లలోనే నివాళులరి్పంచండి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అమరులైన వారికి నివాళులరి్పంచడానికి ఎవరూ ఇంద్రవెల్లి రావద్దు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆదివాసీలు తమ తమ ఇళ్లలోనే నివాళులరి్పంచాలి. – సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ (అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా.. 10 వేల ఫాలోవర్స్) ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం -
అమరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం జలాలతో అమరుల స్తూపానికి అభిషేకం చేశారు. డిసెంబర్ 9 ప్రకటనను గుర్తు చేసుకుంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో కలసి సోమవారం గోదావరిఖని నుంచి గోదావరి నీటితో భారీ ర్యాలీగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులతో కలసి అమరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. గోదావరి జలాలను తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అమరుల కల నెరవేరిందని ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. -
నల్లమలపై నిరంతర నిఘా!
సాక్షి, గుంటూరు: నల్లమలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనుండడంతో పల్నాడు ప్రాంతాన్ని అణువణువూ పరిశీలిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే జిల్లా వాసి కావడం, గతంలో బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, దుర్గి, కారంపూడి, గురజాల మండలాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంపై పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టుల ప్రభావం లేనప్పటికీ గుంటూరు జిల్లా అటవీ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా వాడుకునే అవకాశం ఉందనే కారణంగా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న విజయనగరం, విశాఖ ఏజెన్సీ, ఏవోబీ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెరిగిన సమయంలో గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతాన్ని గతంలో మావోలు షెల్టర్ జోన్‌గా వాడుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ విధించిన కారణంగా మళ్లీ జిల్లాను సేఫ్ జోన్‌గా వాడుకునే అవకాశం ఉన్నందున నిఘాను మరింతగా పెంచారు. మాజీ మావోయిస్టుల కదలికలపై ఆరా తీసే పనిలో పడ్డారు. పల్నాడు గ్రామాలపై నిఘా గతంలో మావోల ప్రభావం అధికంగా ఉన్న పల్నాడు గ్రామాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, దుర్గి, కారంపూడి, మాచవరం, గురజాల, పిడుగురాళ్ల రూరల్, రెంటచింతల మండలాల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు కొనసాగిస్తున్న వారి కదలికలను గమనిస్తున్నారు. గుత్తికొండ బిలంతో పాటుగా నల్లమల అటవీ ప్రాంతంలోని కొన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. గతంలో గుత్తికొండ బిలంలోని మజుందార్ స్మారక స్థూపం వద్ద మావోయిస్టులు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరిపిన కారణంగా ఆయా ప్రాంతాల్ని ఇప్పటికే పోలీసులు తరచూ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలసిన మాజీలలో కొందరు అనుమానితుల్ని నిఘా వర్గాలు విచారిస్తూ వివరాలను సేకరిస్తున్నాయి. అంతే కాకుండా ప్రజా సంఘాల ముసుగులో ఎవరైనా సానూభూతిపరులు ఉన్నారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. అగ్రనేత ఆర్కే జిల్లా వాసి కావడంతో.. అగ్రనేతగా ఉన్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తమృకోటకు చెందిన వ్యక్తి కావడంతో పోలీస్ యంత్రాంగం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆయా ప్రజాసంఘాల సీనియర్లతో ఆర్కేకు సత్సంబంధాలు ఉన్నాయనే కోణంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పల్నాడులోని రాజకీయ నేతలకు ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. -
అమరవీరుల స్టూపాన్ని పాలతో శుద్ధి చేసిన టీఆర్ఎస్ నేతలు
-
డప్పుకొట్టి మరీ ప్రచారం
హన్మకొండ (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలుపథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలో బహిరంగసభ నిర్వహించారు. అంతకుముందు సుబేదారిలోని అమరవీరుల స్థూపం నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే వినయభాస్కర్ తదితరులు హాజరై డప్పు వాయించారు.