సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అమర వీరులకు నివాళిగా పోలీసులు గౌరవ వందనం చేశారు. 12 తుపాకులతో గన్ సెల్యూట్ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్, సీఎస్ శాంతాకుమారి, డీజీపీ అంజనీకుమార్ స్వీకరించారు. పిడికిలి ఎత్తి జై తెలంగాణ అంటూ నినదించిన సీఎం.. లోపల అమరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధా కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అమరుల కుటుంబాలను సత్కరించిన సీఎం కేసీఆర్
అనంతరం సభావేదికపైకి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. అమరులకు నివాళిగా గేయాలను ఆలపించారు. సభలో 10 వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ సన్మానించారు. తరువాత లేజర్, 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించనున్నారు.
చదవండి: మళ్లీ గెలిపిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో పొడిగిస్తాం: సీఎం కేసీఆర్
అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు.
అమరుల స్థూపం ప్రత్యేకతలు
►హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్క్ వద్ద 3.29 ఎకరాల్లో అమర వీరుల స్మారక జ్యోతి నిర్మాణం
►రూ. . 177 కోట్లు, మొత్తం ఆరు ఫ్లోర్లతో నిర్మాణం
►26,800 చ.మీ. విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో స్మారక నిర్మాణం.
► ప్రజ్వలన దీపం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు,
►స్టెయిన్‌లెస్ స్టీల్‌తో అమరవీరుల స్థూపం తయారు.
►16 వందల టన్నుల స్టెయిన్ స్టీల్ వాడకం.
►మొదటి 2 బేస్‌మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు
►335 కార్లు 400 బైక్‌లకు పార్కింగ్ సదుపాయం.
►150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
►మొదటి అంతస్తులో అమరుల ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్
►రెండో అంతస్తులో 500 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్
►మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో అద్దాల పైకప్పు నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment