సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలు కాళేశ్వరం జలాలతో అమరుల స్తూపానికి అభిషేకం చేశారు. డిసెంబర్ 9 ప్రకటనను గుర్తు చేసుకుంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో కలసి సోమవారం గోదావరిఖని నుంచి గోదావరి నీటితో భారీ ర్యాలీగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకున్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులతో కలసి అమరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. గోదావరి జలాలను తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అమరుల కల నెరవేరిందని ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment