![Stray Dogs attack On 21 People at Indravalli Adilabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/19/dogs.jpg.webp?itok=0PsM_EgB)
సాక్షి, హైదరాబాద్: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో శనివారం ఏఎస్సై లక్ష్మణ్‌తోపాటు సుమారు 20 మందిని పిచ్చికుక్కలు కరిచి గాయపరిచాయి. మండలకేంద్రానికి చెందిన గాయక్‌వాడ్ నిర్గుణ, గౌతమి, లక్ష్మి, విక్రమ్, రాంజన్‌షేక్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి మండలకేంద్రానికి వచ్చిన వీరారెడ్డి, వినోద్, రామేశ్వర్, పరశురాంతోపాటు 20 మందిపైగా పిచ్చి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
స్థానికులు, కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించి వైద్యం అందించారు. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment