indravelli
-
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే..ప్రజలు ఊరుకోరు!
అలా చేస్తే ఊర్లలోకి రానిస్తరా? ‘‘ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నరు. మూడు నెలలు, ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. నీ అయ్యా.. ఎవడు పడగొట్టేటోడు.. మా యువకులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. పడగొడితే వారంతా చూస్తూ ఊరుకుంటరా? ఊర్లలోకి రానిస్తరా? ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే.. మీ ఊర్ల వేపచెట్టుకు కట్టేసి కొట్టండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇదేమైనా మీరు దోపిడీ చేసిన లక్ష కోట్ల కాళేశ్వరం కూలినట్టు అనుకున్నరా? ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరు’’ సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని, త్వరలోనే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని కొందరు మాట్లాడుతున్నారని.. ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంసం చేశారని.. తాము పునర్నిరి్మంచే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పదిహేను రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలను చేపడతామని ప్రకటించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించింది. సీఎం రేవంత్ ఇందులో పాల్గొని మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంస రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుల కోసమే తప్ప ఏనాడూ ప్రజల కోసం ఆలోచించలేదు. మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. నాడు ఇంద్రవెల్లి సాక్షిగా సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తున్నాం. మళ్లీ ఇదే ఇంద్రవెల్లి సాక్షిగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తాం. గత పదేళ్ల పాలనలో ఏనాడైనా అడవి బిడ్డల గురించి, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల గురించి ఆలోచించారా? గూడేలు, తండాలకు నిజంగా నీళ్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మేం రూ.65 కోట్లతో ఇంద్రవెల్లిలో పనులు మొదలుపెట్టాల్సి వచ్చేదా? ప్రగతిభవన్ వద్ద నాడు గద్దర్‌ను నిరీక్షించేలా చేసిన కేసీఆర్‌కు ఉసురు తగిలింది. మోదీ దగ్గర గులాంగిరీ.. దేశంలో రెండే కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ సీట్లను గెలిస్తే.. కేసీఆర్ వాటిని ఢిల్లీలో తాకట్టు పెట్టి మోదీ దగ్గర గులాంగిరీ చేశారు. ఇప్పుడు మోదీ, కేడీ ఒక్కటై ముందుకొస్తున్నారు. మతం పేరిట బీజేపీ, మద్యంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించాలి. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలి. నాటి ఘటనకు క్షమాపణ చెప్తున్నా.. 1981 ఏప్రిల్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రవెల్లి పోరాటకారులను కాల్చి చంపి, ఇప్పుడు నివాళులు అరి్పస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. నాటి సీమాంధ్ర పాలకుల కారణంగా ఆ ఘటన జరిగింది. దానిపట్ల నేను క్షమాపణ చెప్తున్నాను. ఆదివాసీలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ధరణితో కోల్పోయిన భూములను అప్పగిస్తాం: భట్టి అటవీప్రాంతాల్లోని గిరిజనులకు నీటి వనరులను అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ధరణి ద్వారా కోల్పోయిన భూములను గోండు గిరిజనులకు తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. సీఎం కార్యక్రమాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్, వివేక్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్, మల్లురవి, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. నాగోబాకు పూజలు చేసి.. మహిళలతో భేటీ.. ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు, నేతలు నివాళి అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్లస్థలాల పట్టాలు అందజేశారు. ఇక్కడి కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మెప్మా, వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాగోబా దర్బార్ హాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల స్కూల్ యూనిఫారాలు కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. -
ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటాం: రేవంత్ రెడ్డి
-
రేపు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్.. అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత ఇది ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే మొదటి సభ నిర్వహించారు. నాడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటినుంచే కాంగ్రెస్‌పై ప్రజల్లో మక్కువ పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం, రేవంత్‌రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి గడ్డ మీదనుంచే మొదలుపెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్ గెలువగా, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్‌గా తీసుకొని సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తంగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఈ గడ్డ మీద నుంచి సమరశంఖం పూరించనున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సీఎం సభ విజయవంతం చేయాలి.. : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 2న ఉద్యమాల గడ్డ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలాంలతో కలిసి కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా దర్బార్ హాల్లో సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన అమరుల జ్ఞానకార్థంగా కోటి రూపాయలతో నిర్మించే స్మృతివనం శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం మధ్యాహ్నం 1:30 గంటలకు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం దర్బార్‌హాల్‌లో 400మంది స్వయం సహాయక సంఘాల మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పిస్తారని వివరించారు. అలాగే సీఎం పర్యటన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. రేవంత్‌రెడ్డి మొదటి సభ, బట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారని వివరించారు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సభ ఇంద్రవెల్లిలోనే నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కట్టిన కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రొఫెసర్ కోదండరాంను వాడుకున్నారని, ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా కుట్రలు చేశారన్నారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని, కల్వకుంట్ల కుటుంబ పార్టీ అని ఆరోపించారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో పీడీ కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఉట్నూర్ ఆర్డీవో జివకర్రెడ్డి, డీఎల్పీవో బిక్షపతిగౌడ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం రేణుకనాగ్‌నాథ్, మెస్రం వంశం ఉద్యోగస్తులు మనోహర్, శేఖర్‌బాబు, సోనేరావ్ ఉన్నారు. ఇవి చదవండి: సీఎం సారూ.. సమస్యలివీ! ప్రజల వినతి.. -
ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ రణభేరి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే టీపీసీసీ చీఫ్‌గా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు కృషి చేస్తూనే, మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వారంలో మూడు రోజుల పాటు పార్టీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పిన రేవంత్.. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభతో ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించినప్పటికీ, లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఖానాపూర్‌లోనే విజయం సాధించింది. మిగతా ఆరింటిలో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూరులలో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ బోథ్, ఆసిఫాబాద్‌లలో విజయం సాధించింది. కాగా ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు అనూహ్య విజయాన్ని రేవంత్ అన్ని సభల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచే పార్లమెంటు ఎన్నికల రణభేరి మోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్కతో హైదరాబాద్‌లో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను ఈ భేటీకి ఆహ్వానించారు. ఇంద్రవెల్లి సభ తర్వాత కూడా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, చివరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ జరపాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఓటర్లను ఆకర్షించేలా మరో రెండు పథకాలు! ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా మరో రెండు గ్యారంటీల అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అందులో ఒకటి రూ.500కే గ్యాస్ సిలిండర్ కాగా, మరొకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అయితే సబ్సిడీపై సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఓ రోడ్‌మ్యాప్ తయారు చేసినట్లు సమాచారం. కాగా రూ.500కే సిలిండర్‌ను నేరుగా తెచ్చినప్పుడే ఇచ్చే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల రూ.500కే గ్యాస్ వచ్చిన భావన మహిళలకు కలుగుతుందని, ఇది ఎన్నికల్లో ఉపకరిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఇప్పటికే ఇది అమలవుతున్న కర్ణాటకలో అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. -
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో.. ఇంద్రవెల్లి స్తూపంపై ఫోకస్!
సాక్షి, ఆదిలాబాద్: గురువారం ఉదయం 11 గంటల సమయం.. కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులతో ఇంద్రవెల్లి స్తూపం వద్దకు చేరుకున్నారు. మొదట అమరవీరులకు నివాళులర్పించారు. స్తూపం సమీపంలో మొక్క నాటారు. ఆ తర్వాత గ్రామసభలో పాల్గొన్నారు. ఇక్కడ స్మృతివనం ఏర్పాటుకు గ్రామసభ తీర్మానం చేసింది. కలెక్టర్ స్మృతివనం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతో.. ఓ వైపు రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. గురువారం ఉదయమే కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఇంద్రవెల్లి స్తూపం వ ద్ద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ చ్చాయి. దీంతో వెంటనే కలెక్టర్ రంగంలోకి దిగి గ్రా మసభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. ఫోకస్ ఎందుకంటే..? సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి స్తూపం వద్ద అభివృద్ధిపై ప్రమాణ స్వీకారం రోజే దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రధానంగా 2021 జులైలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలో దళిత, గిరిజన దండోరా పేరిట సభలు తలపెట్టారు. ఇందులో భాగంగా 2021 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఇంద్రవెల్లిలో స్తూపం సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ రోజు రాష్ట్రంలో అందరి చూపు ఆసభ పైనే ఉంది. లక్ష మందికి తగ్గకుండా సభ నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు కారణం. అన్నట్లుగానే జనసమీకరణ జరగడం, ఇంద్రవెల్లి సభ సక్సెస్ కావడం కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపింది. ఆ రోజు అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించిన రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ఇక్కడ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రధానంగా ఆదివాసులను ఆకట్టుకుంది. 1981 ఏప్రిల్ 20న గిరిజనులు భూమిపై హక్కుల కోసం ఇంద్రవెల్లిలో సమావేశం నిర్వహించగా ప్రభుత్వ ఆంక్షల కారణంగా పోలీసులు వారిపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది మృత్యువాత పడ్డారు. అప్పటినుంచి ప్రతీ ఏడాది గిరిజనులు ఈ స్థలంలో అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగానే అప్పట్లో అక్కడ స్తూపం నిర్మించారు. అయితే గత పాలకులు ఇక్కడ అభివృద్ధి చేపడతామని చెప్పినప్పటికీ చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
కుక్కల స్వైర విహారం.. 21 మందికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో శనివారం ఏఎస్సై లక్ష్మణ్‌తోపాటు సుమారు 20 మందిని పిచ్చికుక్కలు కరిచి గాయపరిచాయి. మండలకేంద్రానికి చెందిన గాయక్వాడ్ నిర్గుణ, గౌతమి, లక్ష్మి, విక్రమ్, రాంజన్‌షేక్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి మండలకేంద్రానికి వచ్చిన వీరారెడ్డి, వినోద్, రామేశ్వర్, పరశురాంతోపాటు 20 మందిపైగా పిచ్చి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించి వైద్యం అందించారు. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఎన్నికలొస్తేనే పైసలు.. బిడ్డ బిర్లా .. కొడుకు టాటా
సాక్షి, ఆదిలాబాద్: ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలు యాదికొస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలున్న నియోజకవర్గాలకే పైసలిస్తారంటూ.. 119 నియోజకవర్గాల్లో ఎన్నికలొస్తేనే కేసీఆర్ అందరికీ పైసలిస్తా రని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా ఇస్తారా..? చస్తారా..? వారే తేల్చుకోవాలన్నారు. ‘లక్ష మందికి ఒక్క తల తక్కువగా ఉన్నా నా తల నరుక్కుంటా అన్నా.. లక్షకు ఒక తల తక్కువగా ఉన్నా తల వంచుతా.. ఇంద్రవెల్లిలో వచ్చిన ఈ లక్ష దండుతో కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తా..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచే సమర శంఖం ఊదాలని, దండోరా వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభ ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగింది. ముందుగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడారు. ఏడేళ్లలో ఏం చేశారు? ‘నీ ఫామ్ హౌస్‌లో జాగా అడిగినామా, చింతమడకలో గవ్వ అడిగినామా. చింతమడకలో రూ.15 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నీవు.. 10 పైసలు కూడా దళిత, గిరిజనులకు ఇచ్చినావా?’ అని రేవంత్ నిలదీశారు. 70 ఏళ్లలో దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదంటున్న కేసీఆర్ ఈ ఏడేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లతోనే దళితులు, గిరిజనులు అనేక రంగాల్లో అభ్యున్నతి సాధించారని, రాజకీయంగా ఉన్నత పదవులు పొందారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎండగట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కొక్కరి తల మీద లక్ష అప్పు మోపారని విమర్శించారు. బిడ్డ బిర్లా .. కొడుకు టాటా ‘నీ బిడ్డను బిర్లాను చేసినావ్. నీ అల్లుళ్ని అంబానీలుగా చేసినావ్..కొడుకును టాటా చేసినావ్..నీవు నరరూప రాక్షసుడిగా తయారై కుంభకర్ణుడిలా మద్యం తాగి ఫామ్ హౌస్‌లో పండుకుంటున్నావ్..’ అంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో 20 నెలలే పడుకునేదని, ఫామ్ హౌస్, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి చర్లపల్లి జైలుకు పంపిస్తానని, అక్కడ సేద తీరాల్సిందేనని అన్నారు. దండోరా సభకు వస్తున్న వేలాది మందిని ఉట్నూర్‌లో అడ్డుకున్నారని, దెబ్బకు దెబ్బ తీస్తామని, కేసీఆర్‌ను బొందపెట్టడం ఖాయమంటూ ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో రావణ రాజ్యం పోవాలని, దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలని అన్నారు. సోమవారం దళిత, గిరిజన దండోరా సభలో గుస్సాడి నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ అన్నీ డైరీలో రాస్తున్నాం కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, ఇతరుల భూములు గుంజుకోవడం, పార్టీ ఫిరాయింపులు అన్ని డైరీలో రాసుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. అసలు మిత్తితో సహా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇది కార్యకర్తల పార్టీ అని, గ్రామ, మండల, నియోజవర్గ స్థాయిలో కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ప్రజల కోసమే తానున్నానని, ‘నన్ను నమ్మండి.. ఆశీర్వదించండి.’ అంటూ కోరారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కాయని, మళ్లీ సోనియమ్మ రాజ్యం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. దండోరా తదుపరి కార్యక్రమం ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన బంధు అమలు చేయాలి: భట్టి జల్, జంగల్, జమీన్ కోసం పోరు సల్పిన గడ్డ నుంచి కాంగ్రెస్ పోరు ప్రారంభించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై దండోరా మోగివ్వడం కోసమే ఈ సభ అన్నారు. అడవి బిడ్డలను అక్కడినుంచి పంపించేస్తున్నారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటు అంబేడ్కర్ .. అటు కొమురం భీం దండోరా సభ వేదికకు ఇరువైపులా అంబేడ్కర్, కొమురం భీం భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో మొదట కొమురం భీం పోరాటాన్ని వివరించారు. రాంజీ గోండు పోరాట స్ఫూర్తితో కేసీఆర్‌కు గోల్కొండ కోట కింద ఘోరీ కడతామని అన్నారు. భీం రావ్, మడావి రాజు, మడావి తుకారాం, మరు మాస్టార్లు ఉన్నత స్థాయిలో రాణించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ, మల్లు రవి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, సంపత్, శ్రావణ్‌కుమార్, మహేష్‌కుమార్‌గౌడ్, జి.వినోద్ తదితరులు సభకు హాజరయ్యారు. సోమవారం ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన దండోరా సభలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే సీతక్క -
‘కేసీఆర్ పాలనలో ఆదివాసీలు జీవితాలు చితికి పోయాయి’
సాక్షి, ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆదివాసీల జీవితాలు చితికి పోయాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఇంద్రవెల్లిలో కాంగ్రెపార్టీ చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభ పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రవేల్లి గడ్డమీద అడగుపెడితే రక్తం సలసల కాగుతోందని, ఇంద్రవెల్లి ప్రాణాలను త్యాగం చేసిన గడ్డ అని అన్నారు. అదివాసీ హక్కులు, విముక్తి కోసం పోరాడి ప్రాంతమని గుర్తుచేశారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా స్మారక స్తూపం నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంకుశకు పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించామని పేర్కొన్నారు. ఒకప్పుడు అదిలాబాద్ అంటే గోదావరి, కడేం గుర్తుకు వచ్చేదని కానీ ఇప్పుడు కేసీఆర్‌కు భజన చేసే నేతలు గుర్తుకు వస్తున్నారని త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ గిరిజన ద్రోహి పార్టీ అని, వారు అమలు చేసేది దళిత బంధు కాదని టీఆర్ఎస్ రాబందు అని మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అడవి నుంచి గిరిజనులను బయటకు పంపుతున్నారని దుయ్యబట్టారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇంద్రవెల్లి సభకు రాలేను: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత వారం రోజులుగా తనకు జ్వరంగా ఉందని, అందుకే ఇంద్రవెల్లి దళిత, గిరి జన దండోరా సభకు తాను రాలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సభ విజయవంతం కోసం అన్ని ప్రయత్నాలు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. నాయకులందరినీ సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించిన తాను సభకు రానంత మాత్రాన చిలువలు పలువలు చేయొద్దని, కాంగ్రెస్ కేడర్ కూడా గందరగోళానికి గురికావద్దని వెల్లడించారు. తనకు జ్వరం వచ్చినందున కోర్టుకు కూడా వెళ్లలేకపోయానని, అందుకే వారంట్ కూడా జారీ అయిందని తెలిపారు. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి కోరారు. కాగా, ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇంద్రవెల్లి సభ విజయవంతంపై ఆయనతో చర్చించిన రేవంత్, సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌లో ‘పని విభజన’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పని విభజన జరిగింది. కొత్తగా నియమితులైన వర్కింగ్ప్రెసిడెంట్లకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు 3 నుంచి 4 ఎంపీ స్థానాలతోపాటు పలు అనుబంధ సంఘాలను పర్యవేక్షించి సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించారు. ఆయా నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటు నేతలను సమన్వయం చేసే బాధ్యతలు, అనుబంధ సంఘాలు, విభాగాల పర్యవేక్షణనూ వర్కింగ్ ప్రెసిడెంట్లకే అప్పగించారు. ఇందులో గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్‌కు మార్గౌడ్లకు మూడు లోక్‌సభ, అంజన్‌కుమార్, జగ్గారెడ్డిలకు 4 స్థానాల చొప్పున కేటాయించారు. మహిళా కాంగ్రెస్ పర్యవేక్షణ జగ్గారెడ్డికి, ఎన్ఎస్ యూఐ బాధ్యతలను గీతారెడ్డికి ఇచ్చారు. మహిళా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఏర్పాటు తెలంగాణ మహిళా కాంగ్రెస్ కొత్త కార్యవర్గాన్ని జాతీయ కమిటీ ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సునీతారావు నేతృత్వంలోని కొత్త టీమ్‌ను ప్రకటిస్తూ ఆలిండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి ఫాతిమా రోస్నా మంగళవారం ఉత్తర్వు లు జారీచేశారు. 14 మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 13 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 12 మందిని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. అలాగే 21 జిల్లాలకు అధ్యక్షురాళ్లనూ ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సదాలక్ష్మి(రంగారెడ్డి), జి.రేణుక, మార పల్లి నాగరాణి(నల్లగొండ), ఎ.చంద్రకళ (సిరిసిల్ల), ఎం.వరలక్ష్మి, ఎ.కల్పనారెడ్డి, దుర్గారాణి, జమీలాబేగం (మేడ్చల్), సి.పద్మాయాదవ్ (కరీంనగర్), ఎస్.లావణ్య (నిజామాబాద్), బి.రజిత (సిద్దిపేట), పి.విజయలక్ష్మి (కొత్తగూడెం), ఎస్తేర్‌రాణి, షమీమ్ ఆగా (హైదరాబాద్)ను నియమించారు. ‘ఇంద్రవెల్లి దండోరా’పై కాంగ్రెస్ నగారా పార్టీ నేతలతో జగ్గారెడ్డి ప్రత్యేక భేటీ ఇంద్రవెల్లి వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మోగించనున్న ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగసభ కోసం కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. 9న నిర్వహించే ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ నివాసంలో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఇంద్రవెల్లిలో 18 ఎకరాల స్థలం లీజుకు తీసుకుని సభాస్థలి ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన అతిపెద్ద సభగా ‘ఇంద్రవెల్లి దండోరా’ను విజయవంతం చేయాలని నిర్ణయించారు. జనసమీకరణపై చర్చించిన నేతలు ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్, ఖానాపూర్, కడెం, జెన్నారం, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ముధోల్, నిర్మల్ ప్రాంతాల నుంచి దళిత, గిరిజనులను తరలించాలని నిర్ణయించారు. -
ఆత్మగౌరవ దండోరా మోగిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దక్కించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి శంఖం పూరిస్తామని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రకటించింది. దళితులు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బయటపెడతామని పేర్కొంది. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఇంద్రవెల్లి సభపై చర్చ సందర్భంగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. తనకు సమాచారం లేకుండా ఇంద్రవెల్లి సభపై ఎలా నిర్ణయం తీసుకుంటారని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించగా.. పీసీసీ చీఫ్‌గా తనకు అధికారం ఉందని, అయినా అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వానివి అబద్ధాలు, అక్రమాలే.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమంతా అబద్ధాలు, అక్రమాలతోనే సాగుతోందని సమావేశంలో నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఐఏఎస్ ఉద్యోగం చేసే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావు ఇంటెలిజెన్స్‌లో ఉంటూ టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని.. ఈఎన్సీ మురళీధర్‌రావు రిటైరై ఏళ్లు గడుస్తున్నా కొనసాగించడం ఏమిటన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇక ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి సభకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాగా పేరు ఖరారు చేశారు. ఈ సభ నిర్వహణకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తారని ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై వచ్చే బుధవారం కరీంనగర్ నేతలతో సమావేశం అవుతానని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాగా.. పీసీసీ నూతన కార్యవర్గాన్ని మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సన్మానించారు. రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వారిని విద్య, ఉద్యోగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతానని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. -
ఇంద్రవెల్లి ఆదివాసీల పోరాటానికి నలభై ఏళ్ళు పూర్తి
-
ఇంద్రవెల్లి ఘటనకు 40 ఏళ్లు.. అసలు ఏం జరిగిందో తెలుసా?
ఇంద్రవెల్లి(ఖానాపూర్): జల్.. జంగల్.. జమీన్ నినాదంతో ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టిన ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ కాల్పుల్లో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసి అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడుతున్న ఆదివాసీ గిరిజనులు 20 ఏప్రిల్ 1981న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ పోరుపై పోలీసులు తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ కాల్పుల ఘటనలో దాదాపు 60 మంది వరకూ చనిపోయారు. కాని ఆదివాసీ సంఘల సర్వే ప్రకారం 20 మంది అమరుల వివరాలను సేకరించారు. కొందరు సంఘటన స్థలంలో.. కొందరు గాయాలతో ఇళ్లకు వెళ్లి అమరులయ్యారు. ఘటనకు 40 ఏళ్లు.. ఇంద్రవెల్లి ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. కా ల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లిలో స్తూపం నిర్మించారు. అయినా స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులరి్పంచని పరిస్థితి ఉంది. ఒకప్పు డు పోలీసుల బందుకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్ర అవతరణ అనంతరం 2015 నుంచి మొదటిసారిగా నామమాత్రపు ఆంక్షాలు వి ధించడంతో వందల మంది ఆదివాసీలు తరలివచ్చి నివాళులరి్పంచారు. గతేడాది, ప్రస్తుతం కరోనాతో నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించడం లేదు. గతంలో రెండు రోజుల ముందు నుంచే పోలీ సులు గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బందించి ఎవరూ రాకుండా చూసేవారు. అయితే 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపురావ్, గిరిజన నాయకులతో పాటు అప్పటి ఎంపీ మదుసుధన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 20కి బదులుగా 25న నివా ళులరి్పంచారు. అప్పటి నుంచి ఆదివాసీ గిరిజనులు ఏటా ఏప్రిల్ 25న సంప్రదాయం ప్రకారం నివాళులరి్పంచారు. 2015 నుంచి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షాలు సడలిస్తున్నారు. స్తూపం వద్ద నివాళులరి్పంచేందుకు రెండు గంటల సమయం ఇస్తున్నారు. దీంతో ఏప్పిల్ 20న నివాళులరి్పస్తున్నారు. అసలు ఏం జరిగింది.. ఆదివాసీల చట్టబద్దమైన హక్కుల కోసం పీపుల్స్వా ర్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కులీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీ సులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవా రం వారసంత కావడం... ఇటు సభ ఏర్పాటు చేయడంతో ఉదయం నుంచే నలువైపుల నుంచి భారీగా ఆదివాసీలు తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా గిరిజనులు ర్యాలీగా సభ స్థలానికి బయలుదేరారు. ర్యాలీలో ముందున్న ఓ గిరిజన యువతితో పోలీసులు అసభ్యకారంగా ప్రవర్తించారు. భరించలేని ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేసింది. దీంతో ఆ పోలీస్ అధికారి చనిపోయాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు తూటల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో ఉంది. కాని తూటాల గాయాలతో ఇళ్లకు వెళ్లి, పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మందికి పైగా ఆదివాసీ గిరిజనులు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆదివాసీ సంఘలు చేసిన సర్వేలో ప్రస్తుతం 20 మంది చనిపోయినట్లు రికార్డు ఉంది. సీఎం స్పందన.. కాల్పుల ఘటనతో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నేటికీ ఆ హామీలు నెరవేరలేదని ఆదివాసీలు పేర్కొంటారు. అలాగే అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైరాం రమేశ్ ఇంద్రవెల్లి స్తూపాన్ని సందర్శించారు. స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. ఈ హామీ కూడా నెరవేరలేదు. ప్రస్తుత సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు స్తూపం వద్ద నివాళులరి్పంచారు. అయినా అభివృద్ధికి నోచడం లేదని గిరిజనులు పేర్కొంటున్నారు. స్మారక స్తూపం నిర్మాణం.. కాల్పుల ఘటనలో మరణించిన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనామెట్లతో పేల్చారు. గిరిజనులు ఆందోళన చేయడంతో 1987లో రెండోసారి నిర్మించారు. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడు జరిగిన సభకు నేను కూడా వెళ్లిన. అక్కడ పోలీసుల బందూకులతో అనేక మంది నా ముందే చనిపోయారు. పారిపోతుంటే మాపై కుడా పోలీసులు కాల్పులు చేశారు. దేవుడి దయతో బతికి బయటపడ్డా. అప్పటి నుంచి ఏప్రిల్ 20న ఇంద్రవెల్లికి వెళ్లాలంటే భయమేస్తోంది. – ఆత్రం శేఖు, పాడికిగూడ పటేల్ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి అమరవీరుల స్తూపం అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చే స్తున్నాయి. కేంద్ర మంత్రి జైరాం రమేశ్, కేటీఆర్, హరీశ్‌రావ్ స్తూపాన్ని సందర్శించిన సమయంలో అభివృద్ధికి హామీలిచ్చి మర్చిపోయారు. ప్రతి సంవత్సరం సమస్యల మధ్య అమరులకు నివాళులు అర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. – పుర్క బాపురావ్, అమరవీరుల ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు పని చేయలేకపోతున్న.. ఆ రోజు నా భర్త శంభుతో కలిసి అంగడికి వెళ్లిన. భర్త శంభు పోలీసుల కాల్పుల గాయాలతో ఇంటికొచ్చి అనారోగ్యంతో సంవత్సరానికే చనిపోయాడు. అక్కడ జరిగిన పోలీసుల కాల్పులతో నా కుడి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయమైంది. ఆ గాయంతో ఇప్పటికీ ఎలాంటి పనులు చేయలేకపోతున్నా. – మాడవి జంగుబాయి, కాల్పుల ఘటనలో గాయపడ్డ మహిళ -
‘పాటగూడ మాకొద్దు, అక్కడకు వెళ్లం.. ఇక్కడే ఉంటాం’
ఇంద్రవెల్లి: మూఢ నమ్మకాల ఊబిలో చిక్కుకుని కొంతమంది గిరిజనులు గ్రామాన్ని వదిలి మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ(కే) గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని పాటగూడ(కే) గ్రామంలో కోలం గిరిజన తెగకు చెందిన 85 కుటుంబాలు ఉన్నాయి. పాటగూడలో తమకు ఎలాంటి శుభకార్యాలు జరగడం లేదని, ఏదో రకంగా కీడు జరుగుతోందని, తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నామని కుమ్ర వంశానికి చెందిన 10 కుటుంబాలు, కోడప, ఆత్రం వంశానికి చెందిన మరో రెండు కుటుంబాలు.. ఆ గ్రామాన్ని వదిలి కొద్ది దూరంలో మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12, 13న పాటగూడ గ్రామస్తులు ఒక పెళ్లి నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఆ 12 కుటుంబాలు పక్కనే ఉన్న కుమ్ర జంగు వ్యవసాయ చేనులో గుడిసెలు నిర్మించుకున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ సీఐ నరేష్కుమార్, స్థానిక ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ మంగళవారం పాటగూడ గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాలతో మాట్లాడారు. మూఢ నమ్మకాలకు దూరంగా కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి గొడవలూ చేయొద్దని సూచించగా, గ్రామాన్ని వదిలివెళ్లిన ఆ కుటుంబాలు వినిపించుకోలేదు. తమ కుటుంబసభ్యులు ఆ గ్రామంలో ఉంటే తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, అందుకే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పాటగూడ గ్రామస్తులతో తమకు ఎలాంటి గొడవలూ లేవని వారు తేల్చి చెప్పడంతో పోలీసు అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. చదవండి: ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! -
నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): జల్..జంగల్..జవీున్ అంటూ తమ హక్కుల సాధనకు ఉద్యమించిన అడవిబిడ్డలపై ఆనాటి సర్కారు తూటాల వర్షం కురిపించింది. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘటనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అనధికారికంగా ఎక్కువ మందే అసువులు బాసారు. ఈ నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు. ప్రత్యేక రాష్ట్రంలో 2015 నుంచి పలు ఆంక్షలు సడలించడంతో స్వేచ్ఛగా వందలాది మంది ఆదివాసీలు ఇంద్రవెల్లికి వచ్చి అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా.. ఆదివాసీ సంఘాల అభ్యర్థన మేర కు జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతి ఇవ్వడంతో రెండు గంటల పాటు నివాళులరి్పస్తున్నారు. ఈ సారి కరో నా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం ఐదుగురితోనే అమరులకు నివాళులరి్పస్తామని ఆది వాసీలు నిర్ణయించారు. (కరోనా టీకాకు నేను వ్యతిరేకం: జొకోవిచ్ ) అసలేం జరిగిందంటే.. స్వాతంత్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజనులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఉమ్మడి జిల్లా నలువైపులా నుంచి వచ్చిన గిరి పుత్రులతో ఇంద్రవెల్లి కిక్కిరిసిపోయింది. అప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా వినకుండా ర్యా లీగా ముందుకు సాగారు. వారిని అడ్డుకొని గిరిజన యువతితో ఓ పోలీస్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి సదరు పోలీస్‌పై దాడి చేయడంతో ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్ బాబు ) తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు పరుగులు తీశారు. పోలీసుల కాల్పులు జరుపగా ఎంతో మంది నేలకొరగగా.. 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో ఉంది. వైద్యం అందక సుమారు 60 మంది చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజ నిర్ధరణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీలు నేటికీ నేరవెరలేదు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంక్షలు.. కాల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. అమరులకు నివాళులరి్పంచేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఏటా ఘటన జరిగిన(ఏప్రిల్ 20) తేదీ కంటే రెండు రోజుల ముందే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడంతో పాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరి సరాల్లో 144 సెక్షన్ విధించేవారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో అమరులకు నివాళులరి్పంచడానికి పోలీసులు అనుమతిచ్చారు. పోలీసుల బందోబస్తు లేకుండా సోమవారం స్తూపం వద్ద ముఖ్య నేతలు నివాళులరి్పంచనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు 30 పోలీసు యాక్టుతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్థానిక ఎస్సై గంగారం తెలిపారు. అమలుకు నోచుకోని హామీలు.. ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, రాష్ట్రం ఏర్పడ్డక హరీశ్‌రావులు సైతం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో ) ఇళ్లలోనే నివాళులరి్పంచండి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అమరులైన వారికి నివాళులరి్పంచడానికి ఎవరూ ఇంద్రవెల్లి రావద్దు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆదివాసీలు తమ తమ ఇళ్లలోనే నివాళులరి్పంచాలి. – సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ (అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా.. 10 వేల ఫాలోవర్స్) ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం -
ఇంద్రవెల్లి ఘటనకు 38 ఏళ్లు
ఇంద్రవెల్లి(ఖానాపూర్): 1981 ఏప్రిల్.. 20న ‘జల్.. జంగల్.. జమీన్’ కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 38 ఏళ్లు. ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏప్రిల్ 20న ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. గతం లోనైతే పోలీసుల బందూకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరం నుంచి నామమాత్రపు ఆంక్షలు విధిస్తుండడంతో ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులర్పిస్తున్నారు. 33 ఏళ్లుగా నివాళులకు దూరం ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు 33 ఏళ్లు అమరులకు నివాళులు అర్పించడానికి నాటి ప్రభుత్వం అనుమతిని వ్వలేదు. 20 ఏప్రిల్‌కు రెండు రోజుల ముందు నుంచే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్భందం చేయడంతోపాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరిసరా ల్లో 19వ తేదీ ఉదయం నుంచి 25 వరకు 144 సెక్షన్ విధించేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్, ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్ 20కి బదులు 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు 25న వారి సంప్రదాయ ప్రకారం నివాళులర్పిస్తున్నారు. 2015న ఏప్రిల్‌లో ప్రత్యేక రాష్ట్రం లో ఆదివాసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూ పం వద్ద నివాళులర్పించడానికి రెండు గంటల సమయం ఇస్తోంది. ఈసారి కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసు భద్రతతో కూడిన అనుమ తిని ఇవ్వడంతో ఏప్రిల్ 20న శనివారం స్తూపాన్ని చేరు కోవడానికి ఆదివాసులు సిద్ధమయ్యారు. అప్పుడేం జరిగిందంటే.. స్వాతంత్య్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీల సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. చట్టబద్ధమైన హక్కు ల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్ 20న గిరిజన రైతు కులీ సంఘం పేరిట ఇంద్రవెల్లి గిరిజనులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతివ్వకపోయిన ఆ రోజు సోమవారం వారసంత కావడం.. ఇటు సభ ఏర్పాటు చేయడంతో ఉదయం నుం చే నలువైపులా నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చా రు. మధ్యాహ్నం మూడు గంటలకే ఇంద్రవెల్లి గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గిరిజనులు వినకుండా ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతోపాటు ముందున్న గిరిజన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేసి చంపేసింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. ఈ కాల్పుల్లో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వం రికార్డులో ఉంది. కానీ, సుమారు 60 మంది చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. ఆదివాసీ సంఘాలు చేసిన సర్వేలో ప్రస్తుతం 20 మంది చనిపోయినట్లు ఉంది. ఈ ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య పిట్టబొంగరంను సందర్శించి బాధితులను ఆదుకుం టామని హామీ ఇచ్చిన నేటికీ నెరవేరలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. నేడు 144 సెక్షన్.. మండలంలో 19న సాయంత్రం నుంచి 20 వరకు 30 యాక్టుతోపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ డేవిడ్ తెలిపారు. ఆదివాసీలు ప్రశాంత వాతావరణంలో నివాళులర్పించాలనీ, తాము 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
పులకించిన పోరుగడ్డ
ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి పోరుగడ్డ పులకరించింది. 37 ఏళ్ల తర్వాత ఆదివాసీలు మొదటిసారిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో అమరులకు నివాళులర్పించారు. 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 లేకుండా స్వేచ్ఛగా అమరుల స్తూపం వద్ద శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. 1981 ఏప్రిల్ 20న జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి బంధు వులు, ఆదివాసీలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా, పోలీసుల భద్రతతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు ఇంద్రవెల్లిలోని అమరుల స్తూపం వద్దకు చేరుకుని పూజలు చేసి నివాళులు అర్పించారు. -
ఘనంగా నాగోబా జాతర పూజలు
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో జాతర వైభవంగా సాగుతోంది. గురువారం మెస్రం వంశీయులు నాగోబా ఆలయం వెనుక భాన్‌దేవత, పెర్సపేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు, మెస్రం వంశం కోడళ్లు మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి భాన్‌దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు కుల పెద్ద దేవత పెర్సపేన్ పూజలను ఘనంగా నిర్వహించారు. కటోడ మెస్రం హనుమంత్‌రావ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు. తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. నాగోబా యూత్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంస్కృతి క్రీడలను కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రారంభించారు. -
భగ్గుమన్న ఏజెన్సీ
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్/ఉట్నూర్‌రూరల్/నార్నూర్/ఆసిఫాబాద్: ఆదివాసీలు, లంబాడీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారింది. ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న ఆదివాసీలు.. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో కుమురం భీం విగ్రహం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఈ విషయం వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందడంతో ఏజెన్సీ అట్టుడికిపోయింది. నార్నూర్ మండలం తాడిహత్నూర్‌లో ఇరువర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలు మూయించివేశారు. మరోవైపు గంగాపూర్, నార్నూర్, భీంపూర్ తదితర గ్రామాల్లో ఇరువర్గాల వారు కర్రలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. బేతాల్‌గూడ ఘటనను నిరసిస్తూ ఆదివాసీలు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సేవాలాల్ జెండాలు ధ్వంసం చేశారు. అటు నార్నూర్ ఎక్స్‌రోడ్డులో ఉన్న ఆదివాసీ జెండాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. హస్నాపూర్‌లో బీభత్సం ఉట్నూర్ మండలం హస్నాపూర్‌లో ఆదివాసీలు ధర్నా చేస్తుండగా.. అక్కడికి లంబాడీలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆదివాసీలు సోయం జుగాదిరావు, చాకటి బాపురావులకు గాయాలయ్యాయి. దీంతో గొడవలు మరింత ముదిరి ఇరువర్గాలు బీభత్సం సృష్టించాయి. ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు వద్ద పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు హస్నాపూర్‌లోని మద్యం దుకాణానికి నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా ఇరువర్గాల వారు కర్రలు చేతపట్టుకుని ప్రధాన రహదారుల వెంట బీభత్సం సృష్టించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ ఆదివాసీలు ఆందోళనలు నిర్వహించారు. ఉద్రిక్తంగానే పరిస్థితి.. ఇరువర్గాల మధ్య గొడవల సెగ శుక్రవారం రాత్రి సమయానికి మారుమూల గ్రామాలకు కూడా పాకింది. సిర్పూర్ (యూ) మండల కేంద్రంలో లంబాడీలకు చెందిన రామారావు మహరాజ్ విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. మండలకేంద్రంలోని లంబాడీలకు చెందిన పలు ఇళ్లపై దాడి చేశారు. దీంతో ఏజెన్సీలో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఓ గిరిజన తండాకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెస్తుండగానే.. మరో తండాలో గొడవలు మొదలయ్యాయన్న సమాచారంతో పోలీసు బలగాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. పోలీసు దిగ్బంధంలో ఏజెన్సీ ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణ, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు.. కరీంనగర్ డీఐజీ సి.రవివర్మ శుక్రవారం సాయంత్రం ఉట్నూర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్వీ కర్ణన్, రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనర్లు విక్రంజిత్ దుగ్గల్, కమలాసన్‌రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలు కూడా ఉట్నూర్‌కు చేరుకుని భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గుడిపేట 13వ బెటాలియన్, డిచ్పల్లి 7వ బెటాలియన్ బలగాలు ఉట్నూర్‌కు చేరుకున్నాయి. నిర్మల్, మంచిర్యాల, డిచ్పల్లి, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని రప్పించారు. శుక్రవారం రాత్రికే 600 మందికిపైగా పోలీసు బలగాలు మొహరించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. మూడు రోజుల పాటు 144 సెక్షన్ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో మూడు రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆదివాసీలు, లంబాడీలు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. ఘర్షణలో ప్రమాదం.. ఇద్దరు మృతి హస్నాపూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్న సమయంలో రహదారిపై వెళుతున్న ఓ వాహనం నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో హస్నాపూర్‌కు చెందిన లంబాడీ యువకుడు రాథోడ్ జితేందర్ (28), జ్ఞానేశ్వర్, జాదవ్మోహన్లతోపాటు ఉట్నూర్‌కు చెందిన ఎస్కే.ఫారూక్ (45) గాయపడ్డారు. వారిని పోలీసులు వెంటనే ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా.. రాథోడ్ జితేందర్, ఎస్కే.ఫారూక్ మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించలేదు. అయితే రాథోడ్ జితేందర్‌ను ఆదివాసీలే రాళ్లతో కొట్టి చంపారంటూ లంబాడీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నేడు బంద్‌కు ఆదివాసీ సంఘాల పిలుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం జిల్లాల పరిధిలో శనివారం బంద్‌కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. కుమురం భీం విగ్రహాన్ని అవమానించడాన్ని ఆదివాసీ హక్కుల పొరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్ తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వదంతులను నమ్మొద్దు: డీఐజీ రవివర్మ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఎవరూ చనిపోలేదని డీఐజీ రవివర్మ పేర్కొన్నారు. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. దాడులు, మరణాల వదంతులు నమ్మవద్దని, పరిస్థితి చక్కబడేదాకా ఇళ్లు విడిచి బయటికి రావొద్దని గిరిజనులకు సూచించారు. పరిస్థితి అదుపులోనే ఉంది: డీజీపీ సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, భారీగా బలగాలను రంగంలోకి దింపామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను ఆ ప్రాంతాలకు తరలించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు డీఎస్ చౌహాన్, అనిల్‌కుమార్, వై నాగారెడ్డిలను పంపించామన్నారు. ప్రజాప్రతినిధులు కూడా నిగ్రహం పాటించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణల్లో పలువురు చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ ఘటనల్లో ఎవరూ మృతి చెందలేదని, నార్నూర్ మండలం హస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం ఇద్దరు మాత్రం చనిపోయారని వివరించారు. -
ఉట్నూరు, ఇంద్రవెల్లిల్లో 144 సెక్షన్
-
అనుమానాస్పదస్థితిలో గర్భిణీ మృతి
ఇంద్రవెల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఇంద్రవెల్లి మండలంలోని బుర్సన్‌పటార్ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి ఉషాతారు(25) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తమ కూతురిని అత్తింటివారు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లుడు బాలేరావ్ రాహుల్ వివాహేతర సంబంధమే కారణమని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బుర్సన్పటాల్ గ్రామానికి చెందిన బాలేరావ్ గోవింద్‌రావ్, నర్మద దంపతుల కుమారుడు బాలేరావ్ రాహుల్‌కు జైనూర్ మండలం కొండిభగూడ గ్రామానికి చెందిన బోడ్కే పాండురంగ్, జయబాయి దంపతుల కూతురు ఉషాతారుకి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదే గ్రామంలోని ఓ యువతితో రాహుల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యను వేధించేవాడు. ఉషాతారు ఏడు నెలల గర్భిణి కావడంతో 15 రోజుల క్రితం ఆమె తండ్రి వచ్చి కొండిభగూడకు తీసుకెళ్లాడు. నాలుగు రోజుల క్రితం ఉషాతారు తిరిగి బుర్సన్‌పటార్ గ్రామానికి రాగా భర్త, అత్తామామలు గొడవపడి చిత్రహింసలకు గురిచేశారు. గురువారం రాత్రి కూడా ఉషాతారుతో భర్త గొడవ పడ్డాడు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో దూలానికి తాడుతో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శుక్రవారం విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు బుర్సన్‌పటార్ గ్రామానికి చేరుకున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె భర్త, అత్తామామలు, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువతి కలిసి కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఉషాతారు తల్లిదండ్రులు ఆరోపించారు. హత్య చేయకపోతే రాహుల్ ఎందుకు పారిపోయూడని, వెంటనే అతడిని అరెస్టు చేయూలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ డీఎస్పీ మల్లారెడ్డి, ఉట్నూర్ ఇన్చార్జి సీఐ రవికుమార్, ఎస్సైలు రాణాప్రతాప్, మంగిలాల్, ఏఎస్సై జీవన్‌రావు గ్రామానికి చేరుకుని ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త రాహుల్, అత్త నర్మద, మామ గోవింద్రావు, యువతి యమునబాయిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంద్రవెల్లి నుంచి బస్తర్ దాకా
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన పోలీసు కాల్పుల్లో 60 మంది ఆదివాసులు అమరులయ్యారు. అయితే 13 శవాలు మాత్రమే దొరికి వారి వివరాలు తెలిశాయి. ఆ మారణకాండ ఆ ఒక్కరోజే జరిగినట్లు కనిపిం చినా ఇరువైపులా దానికి పూర్వరంగం ఉంది. ఇంద్రవెల్లి కాల్పులు జరిగి 35 ఏళ్లయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సారి కేవలం రెండు వందల మంది ఆదివాసులను, వాళ్ల ఎంఎల్ఏను మాత్రమే స్థూపం దగ్గరికి వెళ్లి స్మరించుకోవడానికి అనుమతించింది. ఈ సందర్భంలో పేరు చెప్పడా నికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి, ‘ఆ రోజు ఏపీ స్పెషల్ పోలీసు బెటాలియన్‌కు చెందిన మహమ్మద్ గౌస్‌ను ఆదివాసీలు చంపి ఉండకపోతే అంతటి మారణకాండ జరిగి ఉండేది కాదు’ అన్నాడు. కానీ ఆ ఘటనపై పీయూడీఆర్ నాయకుడు మనోరంజన్ మహంతి నేతృత్వంలో నిజనిర్ధారణ బృందం ప్రకటించిన నివేదికలో ‘పోలీసుల నిష్కా రణ కవ్వింపు చర్యల ఫలితంగా ఉద్రిక్తులైన జనా నికి, పోలీసులకు మధ్యన జరిగిన దొమ్మీలో ఒక పేద కానిస్టేబుల్ ప్రాణాలు పోగొట్టుకోవడం దుర దృష్టకరం’ అని పేర్కొన్నారు. అసలు ఆరోజు ఏం జరిగిందో తెలుసుకుంటే దీనికి మూలం అర్థమవుతుంది. ఆదివాసులు పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరలివ్వాలని గిరిజన రైతుకూలి సంఘం పెట్టుకున్న సభకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు 1980 ఏప్రిల్ 19 సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష జరిపి అనుమతి రద్దు చేసి 144 సెక్షన్ విధించారు. దూర ప్రాంతాల నుంచి కాలినడకన బయలుదేరిన ఆదివాసులకు 144వ సెక్షన్ అంటే ఏమిటో తెలీదు. ఒక విధంగా వాళ్లు పక్షులను పట్టడానికి పన్నిన వలలో అవి చిక్కు కున్నట్లుగా వచ్చి కాల్పులకు గురయ్యారు. ఇంద్రవెల్లి ఆవల ఇంత కథ ఉంటే గత 35 ఏళ్ల కాలంలో దండకారణ్యం అంతటా విప్లవోద్యమం జల్, జంగిల్, జమీన్లతోపాటు ఇజ్జత్, సత్తా (అధి కారం) కోసం కూడా పోరాటంగా ప్రజాయుద్ధంగా గుణాత్మకంగానే పరిణతి చెందింది. అప్పుడు కానీ, నేడు కానీ ఆదివాసీలపై మారణకాండ, స్త్రీలపై పోలీ సులు సామూహిక లైంగిక అత్యాచారాలు వంటి వాటిని తటస్థంగా ఉంటూనే రిపోర్టు చేస్తున్న సంద ర్భంలో జర్నలిస్టులపై త్రీవ దాడులు జరుగుతు న్నాయి. సంతోష్ యాదవ్, సోమార్ నాగు, ప్రభా త్సింగ్తో పాటు మాలినీ సుబ్రహ్మణ్యంను బస్తర్ నుంచి వెళ్లగొట్టడమే కాకుండా వీరిని నక్సల్స్ సాను భూతి పరులని చిత్రీకరిస్తున్నారు. బీబీసీ కరస్పాం డెంట్ అలోక్ పుతుల్ ఐజీ కల్లూరితో మాట్లాడాలని ప్రయత్నిస్తే ‘నాకు దేశద్రోహులైన రిపోర్టర్లతో మాట్లాడేందుకు సమయం లేద’ని నిరాకరించాడు. హిందూ, బీబీసీ రిపోర్టర్లయినా సరే కోల్‌కతా నుంచి బస్తర్ వెళ్లి రిపోర్టు చేయాల్సిందే తప్ప బస్త ర్లో తిరిగి రిపోర్టు చేసే పరిస్థితి లేదు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లి రిపోర్టు చేసే పరిస్థితి కూడా తమకు లేదని జగదల్పూర్ పత్రికా సంఘం అధ్య క్షుడు కరీముద్దీన్ చెప్పారు. పోలీసుల అధికార ప్రక టనలను మాత్రమే ప్రకటించి నోరుమూసుకో కుండా స్వతంత్రంగా వ్యవహరిస్తే వారిని మావో యిస్టు సానుభూతిపరులుగా చిత్రీకరించి వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తున్నారు. ఇక సోనీ సోరీ అక్కడి సమాజంలో భాగమై పోరాటం చేస్తు న్నందువల్ల ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపుతా మని ఐజీ కల్లూరి నియోగించిన మాఫియా బెదిరి స్తోంది. దాని ఫలితమే ఆమెపై ఆసిడ్ దాడి. ఇండియా టుడే బృందం వెళ్లి చేసిన పరిశోధనలో, సామాజిక ఏక్తా మంచ్ పేరుతో పనిచేస్తున్న సంస్థ సల్వాజుడుం రెండో రూపమని, అది ఐజీ కల్లూరి ఏర్పాటు చేసిందేనని బయటపడటంతో దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పోలీసు ఆధికారులే ఒప్పుకున్నా రు. బస్తర్ మాడ్‌లో ఉన్న ప్రకృతి సంపదను, ఖనిజా లను ఎంఎన్సీలకు, మైనింగ్ మాఫియాకు కట్టబెట్ట డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ రహిత విమానంలో క్షిపణి దాడులు కూడా చేస్తున్నట్లు తేలుతున్న నేపధ్యంలో మీడియా తన సమస్త పరిమితులను అధిగమించి నిష్పాక్షిక రిపోర్టింగ్ ఇవ్వడమే క్షేత్రస్థాయిలో వారెదుర్కొంటున్న ముఖ్య మైన సమస్యగా ఉంటోంది. (నేడు కో-ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ సదస్సు సందర్భంగా) వ్యాసకర్త: వరవరరావు (విరసం వ్యవస్థాపక సభ్యులు) -
అమరులారా.. వందనం
► ఇంద్రవెల్లి స్తూపం వద్ద ఘన నివాళులు ► ఏ సెక్షన్లు, యూక్టులు లేకుండా.. స్వేచ్ఛగా.. ► దాదాపు 35 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇలా.. ► తరలివచ్చిన పలువురు నేతలు, గిరిజనులు ఇంద్రవెల్లి ఘటన జరిగి 35 ఏళ్లు అయ్యింది.. ఇన్నేళ్ల తర్వాత ఆ అమరవీరులకు స్వేచ్ఛగా నివాళి అర్పించే అవకాశం లభించిం ది. ఎప్పుడూ పోలీసుల బూట్ల చప్పుడు.. మచ్చుకైనా కనిపించ ని ప్రజానీకం.. ఇదీ ఏటా ఇంద్రవెల్లి స్తూపం వద్ద సాక్షాత్కారమ య్యే పరిస్థితి. కానీ.. ఈసారి 144 సెక్షన్, పోలీసు యాక్టు లేకుండాపోయింది ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి పోరుగడ్డ పులకరించింది. 35 ఏళ్ల తర్వాత, స్వరాష్ట్రంలో మొదటిసారిగా 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 లేకుండా బధవారం స్వేచ్ఛగా అమరవీరులకు ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు. అమరులారా వందనమంటూ ప్రణమిల్లారు. 1981 ఏప్రిల్ 20న జల్...జంగల్...జమీన్ పేరిటి నినాదించి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి బంధువులు, జిల్లా ఆదివాసీలు 34 ఏళ్లుగా ఎదురు చూసినా ఇంత వరకు ఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గతేడాది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చినా ఆంక్షలు విధించింది. దీంతో ఆదివాసీలు మౌనంగా నివాళులర్పించారు. ఈ ఏడాది ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో, పోలీసుల భద్రతతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు అత్యంత ఉత్సాహంగా బుధవారం ఉదయం మండంకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఏళ్ల తర్వాత స్తూపానికి రంగులు ముందుగా 1983లో స్తూపానికి పూర్తిస్థాయిలో ఎర్ర రంగు వేసినా, 1986లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్తూపాన్ని పేల్చివేయడంతో 1987లో ప్రభుత్వ నిధులతో నిర్మించినా రంగులు వేయకుండా వదిలేశారు. పదేళ్ల క్రితం అజ్ఞాత వ్యక్తులు స్తూపానికి కొంత మేరకు రంగులు వేసినా అది అర్ధంతరంగానే మిగిలి ఉంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని గుర్తించి ఆదివాసీలకు నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చినా సమయం సరిపోకపోవడంతో స్తూపానికి పూర్తిస్థాయిలో రంగులు వేయడం వీలు కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఆంక్షలు విధించకపోవడంతో ఆదివాసీ గిరిజనులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉత్సవంగా స్తూపానికి ఎర్ర రంగులు వేశారు. సంప్రదాయ రీతిలో నివాళులు. అమరవీరులకు నివాళులర్పించడానికి మండలంలోని వారి కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీ గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆనాటి సభకు సారథ్యం వహించిన ఉద్యమ సారధి తుమ్మగూడకు చెందిన తొడసం ఖట్టి స్మారకార్థం సమక్క కూడలి వద్ద ఏర్పాటు చేసిన జెండా గద్దె వద్ద జెండాను ఆవిష్కరించారు. సంప్రదాయ పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అక్కడి నుంచి మండలకేంద్రంలోని ఆదివాసీల ఆరద్యాదైవం ఇంద్రాదేవి ఆలయానికి చేరుకోని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని సంప్రదాయ వాయిద్యాలైన డోల్, పేప్రే, కాళీకోమ్, తుడుంల మోతల మధ్య అత్యంత వైభవంగా అమరవీరుల పేరిట జెండాను ఆవిష్కరించారు. సంప్రదాయ నృత్యం చేశారు. ఇంద్రవెల్లి సర్పంచ్ మెస్రం గాంధారి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రాయిసెంటర్ జిల్లా సార్మెడి మెస్ర దుర్గు, రాయిసెంటర్ సార్మెడిలు తుమ్రం జుగాదిరావ్, మెస్రం వెంకట్రావ్, మావన హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావ్, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర శంకర్‌నాయక్, ఆదివాసీ గిరిజన నాయకులు కనక తుకారం, కనక లక్కేరావ్, కనక యాదవ్రావ్, వెడ్మ బొజ్జు, ఆత్రం సుగుణ, సెడ్మాకీ సీతారాం, కనక వెంకట్రావ్, సిడాం గంగాధర్, తొడసం నాగోరావ్, సర్పంచ్‌లు మెస్రం నాగ్నాథ్, జాదవ్ జమునాయక్, మడావి సుంగు పాల్గొన్నారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఉట్నూర్ డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 మంది డీఎస్పీ మల్లారెడ్డి, ఉట్నూర్, జైనూర్ సీఐలు స్వామి, రవికుమార్, 9 మంది ఎస్సైలతో కూడిన 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది అధికారికంగా.. : ఎమ్మెల్యే వచ్చే ఏడాది ఏప్రిల్ 20న అమరవీరులకు అధికారికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నివాళులర్పించేందుకు కృషి చేస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హామీ ఇచ్చారు. బుధవారం ముందుగా అమరవీరుల స్తూపం వద్ద చేరుకుని నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పరంగా నివాళులు అర్పించడానికి త్వరలోనే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి ఎంపీ గోడం నగేశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
ఆడపిల్లలను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇంద్రవెల్లి (ఆదిలాబాద్ జిల్లా) : గిరిజన ఆడపిల్లలను విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రవెల్లి మండలానికి చెందిన నర్సింగ్ అనే వ్యక్తి గిరిజన ఆడపిల్లలను పలు ప్రాంతాల్లో విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఏడు నెలల క్రితం ఉట్లూరు మండలానికి చెందిన ఒక గిరిజన ఆడపిల్లను రాజస్థాన్‌లో విక్రయించాడు. కాగా శనివారం ఆ అమ్మాయి అక్కడి నుంచి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింగ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇప్పటి వరకు 10 మంది ఆడపిల్లలను విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉన్న ఆ అమ్మాయిని స్వగ్రామానికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.