ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి పోరుగడ్డ పులకరించింది. 37 ఏళ్ల తర్వాత ఆదివాసీలు మొదటిసారిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో అమరులకు నివాళులర్పించారు. 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 లేకుండా స్వేచ్ఛగా అమరుల స్తూపం వద్ద శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. 1981 ఏప్రిల్ 20న జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి బంధు వులు, ఆదివాసీలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా, పోలీసుల భద్రతతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు ఇంద్రవెల్లిలోని అమరుల స్తూపం వద్దకు చేరుకుని పూజలు చేసి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment