ఇంద్రవెల్లి : విధినిర్వహణలో ఉన్న వీఆర్‌ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దేవపూర్ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి వీఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న గణేష్(27) తన బావ మరిది విష్ణు ప్రసాద్(22)తో కలిసి మంగళవారం ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్‌కు బైక్ పై బయలుదేరారు. దేవపూర్ సమీపంలో బైక్ వెనుక నుంచి వేగంగా వచ్చిన జీప్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి గుంటలో పడింది. బైక్ పై ఉన్న గణేష్, విష్ణు అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.