ఇంద్రవెల్లి(ఖానాపూర్): జల్.. జంగల్.. జమీన్ నినాదంతో ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టిన ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ కాల్పుల్లో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసి అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడుతున్న ఆదివాసీ గిరిజనులు 20 ఏప్రిల్ 1981న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ పోరుపై పోలీసులు తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ కాల్పుల ఘటనలో దాదాపు 60 మంది వరకూ చనిపోయారు. కాని ఆదివాసీ సంఘల సర్వే ప్రకారం 20 మంది అమరుల వివరాలను సేకరించారు. కొందరు సంఘటన స్థలంలో.. కొందరు గాయాలతో ఇళ్లకు వెళ్లి అమరులయ్యారు.
ఘటనకు 40 ఏళ్లు..
ఇంద్రవెల్లి ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. కా ల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లిలో స్తూపం నిర్మించారు. అయినా స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులరి్పంచని పరిస్థితి ఉంది. ఒకప్పు డు పోలీసుల బందుకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్ర అవతరణ అనంతరం 2015 నుంచి మొదటిసారిగా నామమాత్రపు ఆంక్షాలు వి ధించడంతో వందల మంది ఆదివాసీలు తరలివచ్చి నివాళులరి్పంచారు. గతేడాది, ప్రస్తుతం కరోనాతో నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించడం లేదు. గతంలో రెండు రోజుల ముందు నుంచే పోలీ సులు గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బందించి ఎవరూ రాకుండా చూసేవారు.
అయితే 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపురావ్, గిరిజన నాయకులతో పాటు అప్పటి ఎంపీ మదుసుధన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్ 20కి బదులుగా 25న నివా ళులరి్పంచారు. అప్పటి నుంచి ఆదివాసీ గిరిజనులు ఏటా ఏప్రిల్ 25న సంప్రదాయం ప్రకారం నివాళులరి్పంచారు. 2015 నుంచి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షాలు సడలిస్తున్నారు. స్తూపం వద్ద నివాళులరి్పంచేందుకు రెండు గంటల సమయం ఇస్తున్నారు. దీంతో ఏప్పిల్ 20న నివాళులరి్పస్తున్నారు.
అసలు ఏం జరిగింది..
ఆదివాసీల చట్టబద్దమైన హక్కుల కోసం పీపుల్స్‌వా ర్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కులీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీ సులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవా రం వారసంత కావడం... ఇటు సభ ఏర్పాటు చేయడంతో ఉదయం నుంచే నలువైపుల నుంచి భారీగా ఆదివాసీలు తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా గిరిజనులు ర్యాలీగా సభ స్థలానికి బయలుదేరారు. ర్యాలీలో ముందున్న ఓ గిరిజన యువతితో పోలీసులు అసభ్యకారంగా ప్రవర్తించారు. భరించలేని ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేసింది.
దీంతో ఆ పోలీస్ అధికారి చనిపోయాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు తూటల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో ఉంది. కాని తూటాల గాయాలతో ఇళ్లకు వెళ్లి, పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మందికి పైగా ఆదివాసీ గిరిజనులు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆదివాసీ సంఘలు చేసిన సర్వేలో ప్రస్తుతం 20 మంది చనిపోయినట్లు రికార్డు ఉంది.
సీఎం స్పందన..
కాల్పుల ఘటనతో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నేటికీ ఆ హామీలు నెరవేరలేదని ఆదివాసీలు పేర్కొంటారు. అలాగే అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైరాం రమేశ్ ఇంద్రవెల్లి స్తూపాన్ని సందర్శించారు. స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. ఈ హామీ కూడా నెరవేరలేదు. ప్రస్తుత సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు స్తూపం వద్ద నివాళులరి్పంచారు. అయినా అభివృద్ధికి నోచడం లేదని గిరిజనులు పేర్కొంటున్నారు.
స్మారక స్తూపం నిర్మాణం..
కాల్పుల ఘటనలో మరణించిన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనామెట్లతో పేల్చారు. గిరిజనులు ఆందోళన చేయడంతో 1987లో రెండోసారి నిర్మించారు.
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి
అప్పుడు జరిగిన సభకు నేను కూడా వెళ్లిన. అక్కడ పోలీసుల బందూకులతో అనేక మంది నా ముందే చనిపోయారు. పారిపోతుంటే మాపై కుడా పోలీసులు కాల్పులు చేశారు. దేవుడి దయతో బతికి బయటపడ్డా. అప్పటి నుంచి ఏప్రిల్ 20న ఇంద్రవెల్లికి వెళ్లాలంటే భయమేస్తోంది.
– ఆత్రం శేఖు, పాడికిగూడ పటేల్
స్తూపాన్ని అభివృద్ధి చేయాలి
అమరవీరుల స్తూపం అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చే స్తున్నాయి. కేంద్ర మంత్రి జైరాం రమేశ్, కేటీఆర్, హరీశ్‌రావ్ స్తూపాన్ని సందర్శించిన సమయంలో అభివృద్ధికి హామీలిచ్చి మర్చిపోయారు. ప్రతి సంవత్సరం సమస్యల మధ్య అమరులకు నివాళులు అర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. – పుర్క బాపురావ్, అమరవీరుల ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు
పని చేయలేకపోతున్న..
ఆ రోజు నా భర్త శంభుతో కలిసి అంగడికి వెళ్లిన. భర్త శంభు పోలీసుల కాల్పుల గాయాలతో ఇంటికొచ్చి అనారోగ్యంతో సంవత్సరానికే చనిపోయాడు. అక్కడ జరిగిన పోలీసుల కాల్పులతో నా కుడి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయమైంది. ఆ గాయంతో ఇప్పటికీ ఎలాంటి పనులు చేయలేకపోతున్నా. – మాడవి జంగుబాయి, కాల్పుల ఘటనలో గాయపడ్డ మహిళ
Comments
Please login to add a commentAdd a comment