సాక్షి, ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆదివాసీల జీవితాలు చితికి పోయాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఇంద్రవెల్లిలో కాంగ్రెపార్టీ చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభ పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రవేల్లి గడ్డమీద అడగుపెడితే రక్తం సలసల కాగుతోందని, ఇంద్రవెల్లి ప్రాణాలను త్యాగం చేసిన గడ్డ అని అన్నారు. అదివాసీ హక్కులు, విముక్తి కోసం పోరాడి ప్రాంతమని గుర్తుచేశారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా స్మారక స్తూపం నిర్మిస్తామని తెలిపారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంకుశకు పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించామని పేర్కొన్నారు. ఒకప్పుడు అదిలాబాద్ అంటే గోదావరి, కడేం గుర్తుకు వచ్చేదని కానీ ఇప్పుడు కేసీఆర్‌కు భజన చేసే నేతలు గుర్తుకు వస్తున్నారని త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ గిరిజన ద్రోహి పార్టీ అని, వారు అమలు చేసేది దళిత బంధు కాదని టీఆర్ఎస్ రాబందు అని మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అడవి నుంచి గిరిజనులను బయటకు పంపుతున్నారని దుయ్యబట్టారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment