పోలవరం ముంపు మండలాల ఉపాధ్యాయుల ధర్నా | Polavaram Plain Zones Teachers stage dharna for Transfers | Sakshi
Sakshi News home page

పోలవరం ముంపు మండలాల ఉపాధ్యాయుల ధర్నా

Published Thu, Jun 18 2015 3:27 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Polavaram Plain Zones Teachers stage dharna for Transfers

ఖమ్మం (భద్రాచలం) : తెలంగాణ స్థానికత కలిగిన ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం ప్రదర్శిస్తోందని ముంపు మండలాల ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పోలవరం ఏడు ముంపు మండలాల్లోని ఉపాధ్యాయులు గురువారం విధులకు గైర్హాజరై మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం కాలాయాపన చేయడంతో గిరిజన విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 19వ తేదీన ఖమ్మం జిల్లా డీఈఓ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముంపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement