మద్య నిషేధాన్ని అమలు చేయాలి
వీహెచ్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హను మంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లా డుతూ.. ఖజానా నింపుకోవడానికి విచ్చల విడిగా మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆరోపించారు. మద్యం అమ్మకాలు పెరగడం వల్ల తాగుబోతులతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు.
మద్యం వల్ల యువత పక్కదారి పడుతోందన్నారు. బిహార్ తరహాలో మద్యపాన నిషేధంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని వీహెచ్ కోరారు. మద్యపాన నిషేధంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీని కోరుతానని వీహెచ్ చెప్పారు.