అమెరికా చెప్పిందే వేదం! | US gridlock is an attempt to scuttle new health-care law | Sakshi
Sakshi News home page

అమెరికా చెప్పిందే వేదం!

Published Thu, Oct 17 2013 2:50 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

అమెరికా చెప్పిందే వేదం! - Sakshi

అమెరికా చెప్పిందే వేదం!

విశ్లేషణ: ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి రక్షణశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2005లోనే అమెరికా వెళ్లి ఈ శాఖ గురించి ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత అమెరికా మన దేశం మెడకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. గగనతలం, భూఉపరితలం మీద, సమ్రుదంపై సంయుక్తంగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా నుంచి ఆ శాఖ సీనియర్ అధికారులు వచ్చి మన దేశ ప్రధాని మెడలువంచుతూనే ఉన్నారు.         
 
 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అమెరికా పర్యటన ముగించు కుని తిరిగి వచ్చారో లేదో, ఆ దేశం కొంప కొల్లేరయింది. మన్మోహన్‌ది ఐరన్‌లెగ్గా? లేదా, మన దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొని వెళ్లి అక్కడ కలరా వ్యాధిలా అంటించి వచ్చారా? ఈ రెండూ కాదు. మరేమిటి?
 
 పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఒక్కరోజైనా చర్చించకుండా, చివరి రోజు, ఆఖరు నిమి షంలో ఆమోదముద్ర పడిందనిపించారు. కానీ, అమెరికా వారు మన పార్లమెంటు సభ్యులకన్నా రెండాకులు ఎక్కువే చదువుకొన్నట్లున్నారు. వాళ్లు ససేమీరా, మేము వ్యతిరేకి స్తాం, నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు. బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతో వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఉన్నాయి. కింది సభలో ఒబామాకు మెజారిటీ ఉంది. పైసభలో పెత్తనం రిపబ్లిక్ పార్టీదే. ఇంతకు లడాయి ఎందుకు ఏర్పడిందంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఒక బిల్లు పెట్టి, దానికి నిధులు కేటాయించి బడ్జెట్ తయారు చేయగా దానిని రైటిస్టులైన రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. అలాగని ఒబామా లెఫ్టిస్టు ఏమీ కారు. రెండు పార్టీలూ పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థించేవే. మన దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌లోనే (వైఎస్ జమానాలో తప్ప) కొట్టుకు చావటం లేదూ? అయినా ఈ వ్యాస పరిమితుల్లో రిపబ్లికన్లదే ఐరన్ లెగ్.
 
 భారత్‌పై నిఘా నేత్రం
 ప్రధాని అమెరికా పర్యటనకు ముందు కొద్ది మాసాల క్రితమే ఆ దేశ నిఘా నేత్రం మన దేశం మీద పడిందని, అటు అమెరికాలో భారతదేశ కార్యాలయం నుంచి మన విదేశీ శాఖకు మధ్య, అలాగే ఉభయ దేశాల వ్యాపార సంస్థల మధ్య, రాజకీయ నాయకుల మధ్య జరిగే సంభా షణలు, ఇ-మెయిల్స్ లాంటివన్నింటినీ అమెరికా గూఢ చారి సంస్థ రహస్యంగా వింటున్నదని ఆ నిఘా వ్యవస్థలో పనిచేసిన స్నోడెన్ బాంబు పేల్చాడు. ఆ సమాచారంలో రక్షణశాఖ గురించి కూడా వివరాలున్నాయి. అంటే మన దేశ రక్షణ రహస్య సమాచారమంతా అమెరికా గుప్పిట్లో ఉందన్నమాట. బడ్జెట్ సమయంలో ఈ శాఖ మీద చర్చ నిషిద్ధం. స్వతంత్రం వచ్చినప్పుడు, రక్షణ, విదేశాంగ, కరెన్సీ సంబంధిత విషయాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనూ, మిగతా శాఖలన్నీ రాష్ట్రాల పరిధిలోనూ ఉం టాయని ప్రకటించారు.
 
 ఇప్పుడు మన రక్షణశాఖ రహ స్యాలన్నీ అమెరికాలో గూఢచారిశాఖ చేతికి చేరాక అది రహస్యమెలా అవుతుంది? మన దేశ రక్షణ గురించి మన కు తెలియదు, ఇతర దేశాలకు తెలుసు. అమెరికా పాకి స్థాన్‌ను పరోక్షంగా సమర్థిస్తూ వచ్చినప్పుడు, రహస్యాలు పాకిస్థాన్‌కు చేరవేయలేదని, లేదా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సయోధ్య ఏర్పడకుండా ఆ సమాచారాన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నదనేది తిరుగులేని సత్యం. ఇదేమీ రహస్యం కాదు. ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి రక్షణశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2005లోనే అమెరికా వెళ్లి ఈ శాఖ గురించి ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత అమెరికా మన దేశం మెడకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. గగన తలం, భూఉపరితలం మీద, సమ్రుదంపై సంయుక్తంగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా నుంచి ఆ శాఖ సీనియర్ అధికారులు వచ్చి మన దేశ ప్రధాని మెడ లువంచుతూనే ఉన్నారు. మొన్న మొన్ననే ప్రధాని అమె రికా వెళ్లి, కొత్త రక్షణ ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు. రక్షణశాఖల సమాచారాన్ని సేకరించడంలో మరో ముఖ్యై మెన కోణం భారత్-చైనా సంబంధాలు. అమెరికాకు చైనా కొరకురాని కొయ్య. ప్రపంచాధిపత్యం కోసం అది కంటు న్న కల నిజం కావాలంటే చైనాను దెబ్బతీయాలి.
 
 అమెరికా కనుసన్నల్లోనే...
 1999లో ఆర్థిక సంస్కరణల పేరుతో దేశంలో ప్రవేశిం చినా, అది కేంద్ర ప్రభుత్వం వరకే పరిమితమైంది. రాష్ట్రా ల్లోకి ప్రవేశం లభించలేదు. దుర్భిణీ వేసిచూస్తే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించగా గాలం వేసి పట్టుకున్నారు. తన సమస్య పరిష్కారం అవుతుందని బ్యాంకును గట్టిగా వాటే సుకున్నారు. రాష్ట్రాల్లో ప్రవేశించడానికి అమెరికాకు (ప్రపం చ బ్యాంకు సృష్టే) అవకాశం లభించింది. కేంద్రం మీద ఉడుంపట్టును సాధించిన తర్వాత చంద్రబాబును బుట్టలో వేసుకోవడంతో, త్వరత్వరగా రాష్ట్రాలు ఆ వలలో చిక్కుకొనిపోయాయి. అప్పు చేస్తేనే అభివృద్ధి అనే పరి స్థితిని సృష్టించగా, ప్రస్తుతం దేశం, రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి.
 
  ప్రస్తుతం ఇండియా జుట్టు అమెరికా చేతుల్లో చిక్కుకొనిపోవడమే కాకుండా, పరిపా లనా యంత్రాంగాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇప్పు డు గ్రామంలో చెరువు తవ్వాలన్నా, హైదరాబాద్ నగరం లో కొన్ని బస్సులు తిరగాలన్నా కూడా ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పుతోనే సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మా దేశంలో ఇలా అంతర్గత విషయాల్లో తలదూర్చటం భావ్యమా అని ఒబామాను ప్రశ్నించే దమ్ము మాట అటుం చి, మన ప్రధాని కనీసం ఆ ప్రస్తావనైనా చేశారా? ఎందు కంటే సంస్కరణలు ప్రవేశపెట్టింది ఆయనే. ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన ఆంధ్రుడే. ఆయనే పీవీ నర సింహారావు. ఫలితంగా దేశం ఇవాళ ఇంతగా దిగజారడా నికి కారణం ఈ ప్రధానే. ప్రధాని భారతీయుడే కాని ఆలో చనలు, ఆచరణ అమెరికావి.
 
 ఏమి సాధించారు?
 అమెరికా వెళ్లి మన ప్రధాని ఒబామాతో ఏమి చర్చిం చారు? (గుసగుసలాడారంటే వాస్తవానికి దగ్గరగా ఉం టుంది) ఆ చర్చలతో దేశానికి ఏమి సాధించారని చూడ బోతే- ఒకటి కొత్త రక్షణ ఒప్పందం, రెండు గుజరాత్‌లో అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు. తన కల నిజం కావాలంటే చైనాను దెబ్బతీయాలి. ఇండియాను బుజ్జగించి అమెరికా సైనికస్థావరాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసుకుంటే, చైనా అడ్డు తొలగించుకోవచ్చుననే తన వ్యూహంలో భాగంగా అది ఇండియాను దువ్వు తోంది. చైనా-భారత్ సరిహద్దులో చెదురుమదురుగా జరిగే సంఘటనలను ఆసరా చేసుకుని భారత్-చైనా సంబంధాలను చెడగొట్ట డానికి అమెరికా వేసుకున్న వ్యూహంలో భాగంగానే భారత్‌తో కొత్తగా రక్షణ ఒప్పం దం చేసుకుంది. కానీ ఇటీవల ఏర్పాటైన బ్రిక్స్‌లో ఇటు మనదేశం, అటు చైనా సభ్యులు కావటం అమెరికాకు మింగుడుపడటం లేదు.
 
 ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోతుందని ఈ శతాబ్దం ప్రారంభంలో ఆర్థిక శాస్త్ర వేత్తలు ప్రకటించారు. ప్రపం చంలో జరుగుతున్న పరిణా మాలు చూస్తే అది నిజం కాబోతుందనే నమ్మకం కలుగు తుంది. కాగా మన రక్షణ శాఖను అమెరికా నిఘా నేత్రం నుంచి తప్పించడానికి తగు చర్యలుతీసుకోకపోగా, దేశాల మధ్య అలాంటివి జరగటం మామూలేనని మన రక్షణ శాఖ మంత్రి స్పందించటం దేశ రక్షణ పట్ల ప్రభుత్వం ఎంత నిష్పూచీగా, నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. ఇంత ప్రమాదకర పరిస్థితిలో దేశం ఉండగా, ప్రధాని అమెరికాతో ఒప్పందం చేసుకొని రావటం దేశానికి వెన్నుపోటు పొడవడమే. స్నోడెన్ వెల్లడించిన విషయం నిజమా! నిజమైతే అది మంచిది కాదు అనైనా అడక్కపోవడం క్షంతవ్యం కాదు.
 
 ‘బహుళ’ ప్రయోజనమే మిన్న
 అమెరికా-భారత్ సంబంధాల్లో రక్షణ రంగం ఒక్కటే కాదు. ప్రపంచ బ్యాంకు విండో ద్వారా, అమెరికా చొరబ డని మంత్రిత్వశాఖ, రాష్ట్రంగాని లేవే. ఈ గొడవలన్నీ ప్రజ లకు పట్టవు. కొన్నేళ్ల క్రితం రష్యాలో జరిగిన అణు విస్ఫో టనం తర్వాత, అమెరికాలో ఈ యంత్రాలను తయారు చేసే బహుళజాతి సంస్థలకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో పాటు జపాన్ విస్ఫోటనం కూడా వర్దమాన దేశాల్లో భయం పుట్టించింది. ఫలితంగా అణు విద్యుత్ కేంద్రా లను తయారు చేసే అమెరికా కార్పొరేట్ సంస్థల్లో గుబులు ప్రారంభమైంది. తమకు మార్కెట్ కల్పించాలని ఆ సం స్థలు అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తేగా, ఆ ప్రభుత్వం భారతదేశం మీద తన రాజకీయార్థిక పెత్తనాన్ని ఉపయో గించి సూత్రప్రాయంగా అంగీకరింపచేసింది.
 
 అయితే ఒక వేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే నష్టాన్ని యంత్రాలు తయారు చేసే కంపెనీలు భరించాలనే వాదన ప్రారంభ మైంది. మేము ఇంతే ఇస్తాం అని వాళ్లు, పూర్తిగా భరించాలని మన దేశం పట్టుపట్టారు. ఆ విషయమైనా ప్రధాని ఒబామాతో చర్చించారా? ప్రధాని అసలే మిత భాషి. ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన చేయక పోగా, గుజరాత్‌లో అణు కేంద్రం ఏర్పాటుకు అంగీకరిం చారంటే, ఆయనకు దేశ రక్షణకన్నా, బహుళ జాతి సంస్థల లాభనష్టాలు గురించే ఎక్కువ పట్టింపు. ఈయనను మళ్లీ ప్రధానిగానూ, ఆయన ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌నూ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారో, ఓడిస్తారో మీ ఇష్టం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement