
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా నెక్ట్స్ సంస్థ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 ఏడాదికిగానూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రదానం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్‌కు అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. ‘దేశంలోకి దిగుమతులను ప్రోత్సహించడంతోపాటు, అనుమతుల్లో తీవ్ర జాప్యం(లైసెన్స్ పర్మిట్ రాజ్)ను పీవీ రూపుమాపారు. స్వతంత్ర భారతావనిలో ఆర్థిక సంస్కరణల విషయంలో పీవీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంక్లిష్ట సమయాల్లో కఠినమైన ఆర్థిక, విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో పీవీ నాకు ఎంతగానో సాయపడ్డారు’అని అవార్డును అందుకున్న సందర్భంగా మన్మోహన్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment