P V Narasimha Rao
-
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
PV Narasimha Rao: విదేశాంగ విధానంలో వాస్తవికత తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: భారత విదేశాంగ విధానంలో వాస్తవికతను తెరపైకి తెచ్చిన ఘనత పీవీ నర్సింహారావుకు దక్కుతుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కొనియాడారు. ఇరుగు, పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన విశేష కృషి చేశారని ప్రశంసించారు. దేశ ప్రజల వాస్తవిక పరిస్థితులు, ప్రత్యేక స్వభావం, వారి ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, పేదలు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ సోమవారం గాంధీభవన్ నుంచి వర్చువల్ విధానంలో జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రులు మల్లికా ర్జున ఖర్గే, పల్లంరాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. పీపీ సంస్కరణలతో సుదీర్ఘ కాలం మేలు ముఖ్య అతిథిగా హాజరైన మన్మోహన్సింగ్ మాట్లాడుతూ పీవీ నాయకత్వంలోనే ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలక మార్పులు, సంస్కరణలు వచ్చాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలితాలు సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రజలకు మేలు చేయనున్నాయని పేర్కొన్నారు. భారతదేశాన్ని తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో కలిపే విధంగా ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని పీవీ తీసుకువచ్చారని చెప్పారు. ఆయన హయాంలోనే ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, బాలిస్టిక్ క్షిపణిల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, దార్శనికతతో శాస్త్ర, సాంకేతిక రంగాలను సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించిన ఘనుడు పీవీ అని కొనియాడారు. ఈ సందర్భంగా పీవీ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ కె.శ్రీనాథరెడ్డికి అందజేశారు. వైద్య రంగంలో శ్రీనాథరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు ఇవ్వడం సముచితమని మన్మోహన్ పేర్కొన్నారు. పీవీ సోదరుడు మనోహర్‌రావుకు కూడా ఈ అవార్డును అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, వినోద్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఎ.మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ నేతలు వేణుగోపాల్, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నిరంజన్, బొల్లు కిష న్, నగేశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి -
మన్మోహన్‌కు పీవీ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా నెక్ట్స్ సంస్థ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 ఏడాదికిగానూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రదానం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్‌కు అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. ‘దేశంలోకి దిగుమతులను ప్రోత్సహించడంతోపాటు, అనుమతుల్లో తీవ్ర జాప్యం(లైసెన్స్ పర్మిట్ రాజ్)ను పీవీ రూపుమాపారు. స్వతంత్ర భారతావనిలో ఆర్థిక సంస్కరణల విషయంలో పీవీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంక్లిష్ట సమయాల్లో కఠినమైన ఆర్థిక, విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో పీవీ నాకు ఎంతగానో సాయపడ్డారు’అని అవార్డును అందుకున్న సందర్భంగా మన్మోహన్ కొనియాడారు. -
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిల్బాగ్ సింగ్ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్‌లఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్‌లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్‌కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్‌లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కుంభకోణం కేసేంటి? ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్‌ఎఫ్‌ఎల్‌ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్ ఎన్ఎఫ్ఎల్కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్ లిమిటెడ్ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్ 2, 1995న అలంకుస్కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్ కంపెనీ అకౌంట్లోకి 1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ఎఫ్ఎల్కు యూరియాను పంపలేదు. కుంభకోణం నేపథ్యం.. 1995,సెప్టెంబర్: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం 1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్కు రూ.133 కోట్ల చెల్లింపు 1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం 1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి పీవీ కొడుకు ప్రభాకర్ రావు పేరు 1998 నవంబర్: ప్రభాకర్ రావు అరెస్టు -
పీవీ రాజేశ్వరరావు కన్నుమూత
-
పీవీ రాజేశ్వరరావు కన్నుమూత..నేడు అంత్యక్రియలు
- తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో తుదిశ్వాస - నేటి మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు - మాజీ ప్రధాని మన్మోహన్, కేసీఆర్ తదితరుల సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావు తనయుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు పీవీ రాజేశ్వరరావు(70) సోమ వారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావు ఈ నెల 5న సోమాజిగూడ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే తీవ్ర అస్వస్థతకు లోనై తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని ఆదర్శ నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. రాజేశ్వరరావు మరణవార్త తెలియగానే పీవీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు భారీగా చేరుకున్నారు. వివిధ పార్టీల నేతలు నివాళి అర్పించారు. అమెరికాలో ఉన్న పీవీ కుటుంబీ కులు మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విష్పర్ వ్యాలీలో మహా ప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజేశ్వరరావుకు భార్య రాధిక, కుమారుడు రాఘవేంద్ర కశ్యప్ ఉన్నారు. కశ్యప్ రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రాజేశ్వరరావు మృతిపట్ల మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాపం తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా.. రాజేశ్వరరావు 1996లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 2,14,358 ఓట్ల మెజారిటీతో విజయం సా«ధించారు. అంతకుముందు రాజేశ్వరరావు భాగ్యనగర ఖాదీ సమితి వైస్ చైర్మన్‌గా, ఆలిండియా రేడి యో, దూరదర్శన్‌లో లైట్ మ్యూజిక్ సింగర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. పీవీ నర్సింహారావుకు రాజేశ్వరరావంటే అమిత మైన ప్రేమ. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వీరిలో మాజీ మంత్రి పీవీ రంగారావు పెద్ద. తరువాత శారదాదేవి, రాజేశ్వరరావు, సరస్వతి, వాణిదేవి, ప్రభాకర రావు, జయ, విజయలున్నారు. రాజేశ్వరరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన యుడు, సికింద్రా బాద్ లోక్‌సభ మాజీ సభ్యుడు పీవీ రాజేశ్వరరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజ కీయ, సాహిత్య, సంగీత రంగాల్లో అభి రుచి, ఆసక్తి గల రాజేశ్వరరావుతో తన కున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. రాజేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్ జగన్ సంతాపం పీవీ రాజేశ్వరరావు మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. సాహితీ, సాంస్కృతిక రంగాల్లో రాజేశ్వరరావు చురుకైన పాత్ర పోషించారని కొనియా డారు. రాజేశ్వరరావుకు నివాళుల ర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. పలువురు ప్రముఖుల సంతాపం రాజేశ్వరరావు మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సంతాపం ప్రక టించారు. పీవీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
పీవీకి భారతరత్న ప్రకటించాలి: కుటుంబ సభ్యులు
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించాలని ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో పీవీ నరసింహరావు 94వ జయంతి వేడుకలు నెక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి జ్ఞానభూమి వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీవీకి ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు పీవీకి భారతరత్న ప్రకటించాలన్నారు. పీవీ మరణించిన 12 ఏళ్ల తర్వాత ఆయనను తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు నిచ్చిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
'పీవీ నర్సింహారావుకు భారతరత్నఇవ్వాలి'
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దేశానికి ప్రధానిగా సేవ చేసిన పీవీని దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. పీవీ 10 వ వర్థంతి కార్యక్రమానికి హాజరైన సుబ్రహ్మణ్య స్వామి.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన పీవీ భారతరత్న అవార్డుకు అన్ని విధాలా అర్హుడని స్పష్టం చేశారు. 2004 వ సంవత్సరం, డిసెంబర్ 23 మృతి చెందిన పీవీ.. 1991 నుంచి 1996 కాలంలో దేశ ప్రధానిగా పని చేశారు.