పీవీకి భారతరత్న ప్రకటించాలి: కుటుంబ సభ్యులు
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించాలని ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో పీవీ నరసింహరావు 94వ జయంతి వేడుకలు నెక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి జ్ఞానభూమి వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీవీకి ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు పీవీకి భారతరత్న ప్రకటించాలన్నారు. పీవీ మరణించిన 12 ఏళ్ల తర్వాత ఆయనను తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు నిచ్చిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.