న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన కృషిని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. మన్మోహన్ కేబినెట్‌లో 2004–12 మధ్య ప్రణబ్ పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం తెల్సిందే. మణప్పురం ఫైనాన్స్ సంస్థ నెలకొల్పిన వీసీ పద్మనాభన్ స్మారక జీవితకాల సాఫల్య పురస్కారాన్ని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడారు. మన్మోహన్ హయాంలో ప్రవేశపెట్టిన చారిత్రక సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాన్ని ప్రస్తావించారు. 1990 తొలి నాళ్లలో భారత్ అంతర్జాతీయ సమాజంలో విశ్వాసం కోల్పోయినప్పుడు మన్మోహన్ తన తెలివితేటలతో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పదేళ్లు సమర్థంగా నడిపి రాజకీయ అస్థిరతకు ముగింపు పలికారని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment