lifetime achivement award
-
చుక్కా రామయ్యకు జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందచేశారు. శుక్రవారం శ్రీత్యాగరాయ గాన సభలోని కళా దీక్షితులు కళావేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ చుక్కా రామయ్య గణితశాస్త్రానికే ప్రతిరూపం లాంటి వారని, ఆయన తెలుగు రాష్ట్రాలలో ఐఐటీని ఇంటింటికీ తీసుకెళ్లారని కొనియాడారు. అవార్డుల స్థాయి కన్నా ఎత్తుకు ఎదిగిన రామయ్య నుంచి లెక్కలు మాత్రమే కాదు..జీవితం సక్రమంగా నడిచే లెక్కలు కూడా నేర్చుకోవాలన్నారు. త్వరిత గణిత విధానంలో రికార్డు సాధించిన సాయి కిరణ్ సారథ్యంలో ఉన్నత ప్రతిభ చూపిన చంద్రయ్య, నరసింహారావులకు గణిత రత్న అవార్డు బహూకరించారు. బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ అధ్యక్షత వహించారు. -
నటుడు, డైరెక్టర్ భాగ్యరాజ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్‌ను జీవిత సాఫల్య పురస్కారం వరించింది. వివరాలు.. జాతీయ సినిమా చాంబర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి ఎస్. కె.కృష్ణన్ ముఖ్యఅతిథిగా ఈ అవార్డును అందజేశారు. జాతీయ సినిమా చాంబర్ అధ్యక్షుడు అన్బు చంద్రం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు జ్ఞాన రాజశేఖరన్ అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ నటుడు అవార్డును ఆకాష్‌కు, ఉత్తమ విలన్ అవార్డును ఆర్యన్‌కు.. ప్రత్యేక అవార్డులను నటుడు రమేష్ కన్నా, బాబుగణేశ్, రిషీకాంత్, నటి ఇనియ, అనూకృష్ణకు అందించారు. ఉత్తమ చిత్ర నిర్మాణ సంస్థ అవార్డును సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధి మనోజ్ దాస్, ఉత్తమ కథా చిత్రాల అవార్డును వి.శేఖర్, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు దీనా, ఉత్తమ ఎడిటర్ అవార్డు కె.ఎస్.ప్రవీణ్, ఉత్తమ ఛాయాగ్రహకుడి అవార్డు కేఎస్ సెల్వరాజ్‌కు దక్కింది. సీనియర్ పాత్రికేయుడు, కలైమామణి అవార్డు గ్రహీత నెల్లై సుందరరాజన్ స్వాగతోపన్యాసం చేశారు. -
వైఎస్సార్ అవార్డుల ఎంపికకు కమిటీ
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ప్రజా సేవా కార్యక్రమాలు చేసేవారికి అవార్డుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులుగా సలహాదారులు దేవుపల్లి అమర్, కె.రామచంద్రమూర్తి, జీవీడీ కృష్ణమోహన్, ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, కె.దమయంతి, ఉషారాణి, కోన శశిధర్, జేవీ మురళి, ఐఐఎస్ అధికారి టి.విజయకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26వ తేదీన వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. -
‘మీ వల్లే ఆర్థిక, రాజకీయ స్థిరత్వం’
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన కృషిని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. మన్మోహన్ కేబినెట్లో 2004–12 మధ్య ప్రణబ్ పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం తెల్సిందే. మణప్పురం ఫైనాన్స్ సంస్థ నెలకొల్పిన వీసీ పద్మనాభన్ స్మారక జీవితకాల సాఫల్య పురస్కారాన్ని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడారు. మన్మోహన్ హయాంలో ప్రవేశపెట్టిన చారిత్రక సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాన్ని ప్రస్తావించారు. 1990 తొలి నాళ్లలో భారత్ అంతర్జాతీయ సమాజంలో విశ్వాసం కోల్పోయినప్పుడు మన్మోహన్ తన తెలివితేటలతో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పదేళ్లు సమర్థంగా నడిపి రాజకీయ అస్థిరతకు ముగింపు పలికారని ప్రశంసించారు. -
లైఫ్ మళ్లీ స్టార్ట్ చేసినట్లు ఉంది
‘‘ఈ తరం కథానాయకుల సినిమాల్లో కూడా నా కోసం పాత్రలు రాయడం నాకు తెలిసిన అచీవ్మెంట్ అనుకుంటున్నాను. నేను ఇంకా సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నానని ‘మహానటి’ సినిమా సక్సెస్‌తో నాకు నమ్మకం వచ్చింది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న తర్వాత...మళ్లీ నేను నా ఫిల్మ్ ఇండస్ట్రీ మొదటిరోజులకు వెళ్లిపోయాను. మళ్లీ లైఫ్‌ను స్టార్ట్ చేసినట్లు ఉంది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. నటుడిగా దాదాపు 240 సినిమాల్లో చేసిన రాజేంద్రప్రసాద్ సినీ ప్రస్థానం ఆదర్శనీయం. ఆయన ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. అమెరికా ప్రభుత్వం రాజేంద్రప్రసాద్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ–‘‘రేలంగి నరసింహారావుగారు తప్ప స్టేజ్‌పై ఉన్న అందరూ నా బిడ్డలే. సెన్సిటివ్ అయిన నేను..ఇవాళ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు వింటుంటే..ఇక చనిపోయినా పర్లేదు. నేనూ హీరోగా ఉన్న రోజుల్లో సెన్సిటివ్‌గా ఎలా బతకాలో తెలీదు. కోపం అంటే కోపమే. ప్రేమంటే ప్రేమే. అలాంటి వాటన్నింటిని భరించిన నా దర్శకులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. నా చేత అద్భుతంగా పనిచేయించుకుంటున్నారు. నా కెరీర్ ఎదుగుదలలో మీడియా సహకారం ఉంది. నేను తీసుకున్న అవార్డు ఇండస్ట్రీకి అంకితం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, దర్శకుడు నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి, నందిని రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం
సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని’ రాష్ట్ర హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు. శనివారం ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) టాటా (తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్) సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాయి. ‘‘కృష్ణకు ఆటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేయడం తెలుగు జాతికి గర్వకారణం’’ అని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాకు జీవితంలో అనేక అవార్డులు వచ్చాయి. ప్రతిసారీ నాకు హీరోగా అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలను గుర్తుకు చేసుకుంటాను. హీరోగా తొలి పరిచయం చేసిన అదుర్తి సుబ్బారావుకు కతజ్ఞతలు’’ అని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు జి.వివేక్, ఆటా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి, టాటా అధ్యక్షులు జాన్సీరెడ్డితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, ఆదిశేషగిరిరావు, నటి విజయనిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
కళా తపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
ఎన్నో కళాత్మక చిత్రాలతో తెలుగు వెండితెరను సుసంపన్నం చేసిన సీనియర్ దర్శకులు కళాతపస్పి కె.విశ్వనాథ్ గారిని విజయవాడ నగరంలో ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం.సి.దాస్, రోటరీ పౌరసంబంధాల విభాగం చైర్మన్ పులిపాక కృష్ణాజీ లతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలో కె.విశ్వనాథ్ చిత్రాల్లో కొన్ని నృత్య సన్ని వేశాలను, పాటలను ప్రదర్శిస్తారని తెలిపారు. -
సన్నీకి జీవిత సాఫల్య పురస్కారం
ముంబై: క్రికెట్ లెజెండ్ సునీల్ మనోహర్ గవాస్కర్ కి జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నట్లు ముంబై జర్నలిస్టు క్రీడల సంఘం(ఎస్ జేఏఎమ్) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 11న ఎస్ జేఏఎమ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల పురస్కారానికి సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ చివరి రోజున వాంఖడే స్టేడియంలో సన్నీకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు చెప్పింది. 2013 సెప్టెంబర్ లో బాడ్మింటన్ లెజెండ్ నందూ నటేకర్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని మొదటిసారి ఎస్ జేఏఎమ్ ప్రధానం చేసింది. గవాస్కర్ కు భారత క్రికెట్ తో 50ఏళ్ల అనుబంధం ఉంది. 1966లో సన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా వజీర్ సుల్తాన్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగారు. 1970లో బొంబాయి తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. 1970-71 మధ్య వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన సన్నీ సిరీస్ లో 774 పరుగులు చేశారు. టెస్టు క్రికెట్ లో 10వేల పరుగుల క్లబ్ లో చేరిన తొలి క్రికెటర్ సునీల్ గవాస్కర్. 1983 వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో సన్నీ కూడా ఉన్నారు. కెరీర్ లో 125 టెస్టు మ్యాచ్ లు ఆడిన సన్నీ 34 సెంచరీలతో 10,122 పరుగులు చేశారు. 108 వన్డే మ్యాచ్ ల్లో 3 వేల పరుగులు సాధించారు. 1987లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అప్పటినుంచి బీసీసీఐ టెక్నికల్ కమిటీ, ఐసీసీ క్రికెట్ కమిటీలకు చైర్మన్ గాను, ఐసీసీ మ్యాచ్ రిఫరీగాను, ముంబై క్రికెట్ సంఘానికి చైర్మన్ గాను, క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలోనూ, భారత క్రికెట్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గాను సేవలందించారు. 2014లో భారత్, యూఏఈల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా సుప్రీంకోర్టు సన్నీని నామినేట్ చేసింది.