
సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్‌ను జీవిత సాఫల్య పురస్కారం వరించింది. వివరాలు.. జాతీయ సినిమా చాంబర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి ఎస్. కె.కృష్ణన్ ముఖ్యఅతిథిగా ఈ అవార్డును అందజేశారు. జాతీయ సినిమా చాంబర్ అధ్యక్షుడు అన్బు చంద్రం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు జ్ఞాన రాజశేఖరన్ అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ నటుడు అవార్డును ఆకాష్‌కు, ఉత్తమ విలన్ అవార్డును ఆర్యన్‌కు..
ప్రత్యేక అవార్డులను నటుడు రమేష్ కన్నా, బాబుగణేశ్, రిషీకాంత్, నటి ఇనియ, అనూకృష్ణకు అందించారు. ఉత్తమ చిత్ర నిర్మాణ సంస్థ అవార్డును సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రతినిధి మనోజ్ దాస్, ఉత్తమ కథా చిత్రాల అవార్డును వి.శేఖర్, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు దీనా, ఉత్తమ ఎడిటర్ అవార్డు కె.ఎస్.ప్రవీణ్, ఉత్తమ ఛాయాగ్రహకుడి అవార్డు కేఎస్ సెల్వరాజ్‌కు దక్కింది. సీనియర్ పాత్రికేయుడు, కలైమామణి అవార్డు గ్రహీత నెల్లై సుందరరాజన్ స్వాగతోపన్యాసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment