మహిళా సమస్యల నేపథ్యంలో అరియన్‌ | Director K Bhagyaraj Launched Ariyavan Movie Trailer in Chennai | Sakshi
Sakshi News home page

K Bhagyaraj: మహిళా సమస్యల నేపథ్యంలో అరియన్‌

Feb 24 2023 8:41 AM | Updated on Feb 24 2023 8:41 AM

Director K Bhagyaraj Launched Ariyavan Movie Trailer in Chennai - Sakshi

తమిళ సినిమా: ఎంజీపీ మాస్‌ మీడియా పతాకంపై నవీన్‌ నిర్మించిన చిత్రం అరియవన్‌. యారడి నీ మోహిని, తిరుచిట్రంఫలం వంటి విజయవంతమైన చిత్రాలు దర్శకుడు మిత్రన్‌ ఆర్‌.జవహర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ఇది. నవ జంట ఇషాన్, ప్రణాలి జంటగా నటించిన ఇందులో నటుడు డానియల్‌ బాలాజీ, సత్యన్, కల్కి రాజా, రమ రమేష్‌ చక్రవర్తి, కావ్య, సూపర్‌ గుడ్‌ సుబ్రహ్మణి, రామన్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. వీవీ టీమ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దర్శకుడు జేమ్స్‌ వసంతన్‌ రూపొందించడం విశేషం.

కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని సత్యం సినిమాస్‌ థియేటర్లో నిర్వహించారు. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కథానాయకుడిగా పరిచయమైన ఇషాన్‌ మాట్లాడుతూ.. ఇంత పెద్ద చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నాను. దర్శకుడు మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ చిత్రాల్లో మంచి సందేశంతో కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయన్నారు.

ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌ ఎనర్జీతో బయటికి వస్తారన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు కె. భాగ్యరాజ్‌ మాట్లాడుతూ అరియవన్‌ చిత్ర ట్రైలర్‌ బాగుందని.. అందుకు చిత్ర యూనిట్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు మిత్రన్‌ ఆర్‌. జవహార్‌ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ఉత్తమ పుత్తిరన్‌ చిత్రంలో తాను నటించానని, ఆయన చాలా శాంత స్వభావుడు అని పేర్కొన్నారు. నూతన జంటతో చిత్రం చేస్తున్నారంటే అది కచ్చితంగా మంచి కథాచిత్రమే అయ్యి ఉంటుందన్నారు. కొత్తవారితో చిత్రాన్ని చేసిన నిర్మాత నవీన్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర హీరో కళ్లల్లో జీవం ఉందని, ఈయన మంచి కథను ఎంచుకొని నటించి విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement