20 మంది మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో సినిమా | Director Perarasu Talk About Polama Oorgolam Movie | Sakshi
Sakshi News home page

20 మంది మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో సినిమా

Published Sat, May 7 2022 8:40 AM | Last Updated on Sat, May 7 2022 8:44 AM

Director Perarasu Talk About Polama Oorgolam Movie - Sakshi

తమిళసినిమా: సమాజంలో సంఘీభావం చాలా అవసరమని దర్శకుడు పేరరసు పేర్కొన్నారు. 20 మంది మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘పోలామా ఊర్గోళం’. గజసింహ మేకర్స్‌ పతాకంపై ప్రభుజిత్‌ నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగరాజ్‌ బాయ్‌ దురైలింగం దర్శకుడు. మదుసూదన్‌ మరో హీరోగా నటిస్తున్న ఇందులో శక్తి మహేంద్ర నాయకిగా నటిస్తున్నా రు.

కాగా ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. సమాజంలో ఏం మాట్లాడినా కొందరు వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్‌బాల్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement