
నేటి కాలంలో కొత్తవారు అవకాశాలను రాబట్టుకోవడం కంటే సెలబ్రిటీస్ వారసులు వాటిని రాబట్టుకోవడం కష్టతరం. అందుకే యూట్యూబ్, వాణిజ్య ప్రకటనలు ప్రైవేట్ ఆల్బమ్ నటిస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను అని సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్ వారసుడు శాంతను భాగ్యరాజ్ పేర్కొన్నారు. ఈయన తాజాగా గుండు మల్లి అని ప్రైవేట్ ఆల్బమ్‌లో నటించారు.
నటి మహి మా నంబియార్ మౌఖిక నటించిన వీడియో ఆల్బమ్ నటుడు ఆదవ్ కన్నదాసన్ దర్శకత్వంలో ఎంకేఆర్‌పీ ప్రొడక్షన్స్ పతాకంపై రాంప్రసాద్, చరణ్ నిర్మించారు. జోరార్డ్ ఫెలిక్స్ సంగీతాన్ని అందించిన ఈ వీడియోకు గాయ త్రి రఘురామ్ నృత్య దర్శకత్వం వహించారు. వివాహ నిశ్చితార్థం నేపథ్యంలో సాగే అందమైన మెలోడీతో కూడిన గుండు మల్లి వీడియో సోమవారం నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment