దర్శకుడు కె. భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 3.6.9. కేవలం 81 నిమిషాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సాధించిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శివ మాదవ్ ఈ చిత్ర షూటింగ్‌ను 24 కెమెరాలతో 81 నిమిషాల్లో పూర్తి చేశారు. నటుడు పీజీఎస్ ప్రతి నాయకుడిగా నటించిన ఇందులో బ్లాక్ శాండీ, అంగయర్ కన్నన్, సుకై ల్ ప్రభు, కార్తీక్, గోవిందరరాజన్, సుభిక్ష, నిఖితా, బబ్లూ సహా 60 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు.
వీరితో పాటు విదేశానికి చెందిన వారు సైతం నటించడం విశేషం. మారీశ్వరన్ ఛాయాగ్రహణం, కార్తీక్ హర్ష సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. 600 మంది సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా షూటింగ్‌ను నాలెడ్జ్ ఇంజినీరింగ్ అనే సంస్థకు చెందిన హరిభా హనీప్ సమక్షంలో చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.
కాగా అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్లు తెలిపారు. సైన్స్ ఇతివృతంగా రూపొందిన ఈ చిత్రం గురించి నటుడు కె.భాగ్యరాజ్ వివరిస్తూ.. 81 నిమిషాల్లో రూపొంది ప్రపంచ రికార్డు సాధించిన 3.6.9 చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడు శివ మాధవ్, నిర్మాత పీజీఎస్‌ను అభినందిస్తున్నానన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నానని భాగ్యరాజ్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment