
తమిళంలో రచయితగా, నటుడిగా, దర్శకనిర్మాతగా పా. విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆరుద్ర’. కె.భాగ్యరాజా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని అదే పేరుతో కె. వాసుదేవరావు తెలుగులో అనువదిస్తున్నారు. సామాజిక ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రం తెలుగులో సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు ‘ఆరుద్ర’ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ అందించడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. కీలకఘట్టమైన సెన్సార్ పూర్తి కావడంతో ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
‘ఆరుద్ర’ సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్మాత కె. వాసుదేవరావు మాట్లాడుతూ.. ‘తమిళంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో చైల్డ్ అబ్యూస్‌మెంట్ పై రూపొందిన చిత్రమిది. ఇందులో పిల్లలకు , పేరెంట్స్‌కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు చూపించారు. వీటితో పాటు లవ్, కామెడీ మరియు ఎమోషన్స్ ఇలా అన్ని వర్గాలకు నచ్చే అంశాలున్నాయి. తమిళంలో ఇటీవల విడుదలై క్రిటిక్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి తెలుగులోకి అనువదిస్తున్నాం’ అని అన్నారు. విద్యాసాగర్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment