PA VIJAY
-
మంచీ చెడు
రచయిత, నటుడు, దర్శక–నిర్మాత పా. విజయ్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరుద్ర’. మరో ప్రముఖ నటుడు కె. భాగ్యరాజా కీలక పాత్ర పోషించారు. మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని జె.ఎల్.కె. ఎంటర్ప్రైజెస్ అధినేత కె.వాసుదేవరావు అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. క్లీ¯Œ యు సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. కె.వాసుదేవరావు మాట్లాడుతూ– ‘‘సామాజిక ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. తల్లిదండ్రులు, పిల్లలకు మంచి సందేశం ఇచ్చారు. ఆడ పిల్లలపై జరుగుతున్న అమానుష చర్యలకు ప్రతీకార దిశగా ఈ చిత్రం ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా చక్కగా చూపించారు. తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో తెలుగులోకి అనువదిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వరకాంతం సునీల్ రెడ్డి. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆరుద్ర’
తమిళంలో రచయితగా, నటుడిగా, దర్శకనిర్మాతగా పా. విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆరుద్ర’. కె.భాగ్యరాజా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని అదే పేరుతో కె. వాసుదేవరావు తెలుగులో అనువదిస్తున్నారు. సామాజిక ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రం తెలుగులో సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు ‘ఆరుద్ర’ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ అందించడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. కీలకఘట్టమైన సెన్సార్ పూర్తి కావడంతో ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ‘ఆరుద్ర’ సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్మాత కె. వాసుదేవరావు మాట్లాడుతూ.. ‘తమిళంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో చైల్డ్ అబ్యూస్‌మెంట్ పై రూపొందిన చిత్రమిది. ఇందులో పిల్లలకు , పేరెంట్స్‌కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు చూపించారు. వీటితో పాటు లవ్, కామెడీ మరియు ఎమోషన్స్ ఇలా అన్ని వర్గాలకు నచ్చే అంశాలున్నాయి. తమిళంలో ఇటీవల విడుదలై క్రిటిక్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి తెలుగులోకి అనువదిస్తున్నాం’ అని అన్నారు. విద్యాసాగర్ సంగీతమందించారు. -
మరోసారి గొంతు సవరించిన సిద్ధార్థ
హైదరాబాద్ : ప్రముఖ నటుడు సిద్ధార్థ మరోసారి గొంతు సవరించుకున్నాడు. సినీ గేయ రచయిత నుంచి నటుడుగా మారిన అతడి స్నేహితుడు పీ ఏ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్ట్రాబెర్రీ చిత్రంలో సిద్ధార్థ ఓ గీతాన్ని ఆలపించాడు. సిద్ధార్థతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా పీఏ విజయ్ మంగళవారం విలేకర్లతో పంచుకున్నారు. సిద్ధార్థ తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని తెలిపారు. పాట పాడతావా అని అడగటమే ఆలస్యం... సిద్ధార్థ వెంటనే ఒప్పేసుకున్నాడు.... ఆ పాట సిద్ధార్థ పాడటం... రికార్డు చేయడం అంతా కేవలం ఆరు గంటల్లో అయిపోయిందని విజయ్ వెల్లడించారు. సిద్ధార్థ గొప్ప నటుడే కాదు... మంచి సింగర్ కూడా అంటూ కితాబ్ ఇచ్చారు. స్ట్రాబెర్రీ కథను గతంలో ఎప్పుడో రాశానని ... అయితే కంపోజర్ తాజ్ నూర్, తాను మంచి స్నేహితులమని చెప్పారు. ఓ రోజు తాను ఈ చిత్ర కథపై అనుకోకుండా తాజ్‌తో చర్చించానని గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అతడు పాటలు కంపోజ్ చేయడానికి సిద్ధమై పోయాడని చెప్పారు. అలా చిత్రంలోని పాటలు కంపోజింగ్ చిత్ర షూటింగ్ కంటే ముందే ప్రారంభమైందన్నారు. ఇంతకు ముందు వచ్చిన తన చిత్రంలోని అన్ని పాటలు బాగున్నాయన్నారు. అయితే ఈ చిత్రంలోని పాటలు చాలా డిఫరేంట్‌గా ఉండాలని తాజ్ నూర్ తాను అనుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఇచ్చాడని... ఒక్కటి మాత్రమే ఇప్పటికి పూర్తయిందని తెలిపారు. ఈ థ్రిల్లర్ కామెడి చిత్రంలో విజయ్, అవని మోదీ, సముద్రఖణి, తంబి రామయ్య కీలక పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. -
స్ట్రాబెరీ సింగర్‌గా సిద్దార్ధ్