‘‘ఈ తరం కథానాయకుల సినిమాల్లో కూడా నా కోసం పాత్రలు రాయడం నాకు తెలిసిన అచీవ్‌మెంట్ అనుకుంటున్నాను. నేను ఇంకా సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నానని ‘మహానటి’ సినిమా సక్సెస్‌తో నాకు నమ్మకం వచ్చింది. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు తీసుకున్న తర్వాత...మళ్లీ నేను నా ఫిల్మ్ ఇండస్ట్రీ మొదటిరోజులకు వెళ్లిపోయాను. మళ్లీ లైఫ్‌ను స్టార్ట్ చేసినట్లు ఉంది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. నటుడిగా దాదాపు 240 సినిమాల్లో చేసిన రాజేంద్రప్రసాద్ సినీ ప్రస్థానం ఆదర్శనీయం. ఆయన ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. అమెరికా ప్రభుత్వం రాజేంద్రప్రసాద్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ–‘‘రేలంగి నరసింహారావుగారు తప్ప స్టేజ్‌పై ఉన్న అందరూ నా బిడ్డలే. సెన్సిటివ్ అయిన నేను..ఇవాళ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు వింటుంటే..ఇక చనిపోయినా పర్లేదు. నేనూ హీరోగా ఉన్న రోజుల్లో సెన్సిటివ్‌గా ఎలా బతకాలో తెలీదు. కోపం అంటే కోపమే. ప్రేమంటే ప్రేమే. అలాంటి వాటన్నింటిని భరించిన నా దర్శకులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. నా చేత అద్భుతంగా పనిచేయించుకుంటున్నారు. నా కెరీర్ ఎదుగుదలలో మీడియా సహకారం ఉంది. నేను తీసుకున్న అవార్డు ఇండస్ట్రీకి అంకితం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, దర్శకుడు నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి, నందిని రెడ్డి, సతీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment