సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని’ రాష్ట్ర హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు. శనివారం ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) టాటా (తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్) సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాయి. ‘‘కృష్ణకు ఆటా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేయడం తెలుగు జాతికి గర్వకారణం’’ అని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాకు జీవితంలో అనేక అవార్డులు వచ్చాయి.
ప్రతిసారీ నాకు హీరోగా అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలను గుర్తుకు చేసుకుంటాను. హీరోగా తొలి పరిచయం చేసిన అదుర్తి సుబ్బారావుకు కతజ్ఞతలు’’ అని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు జి.వివేక్, ఆటా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి, టాటా అధ్యక్షులు జాన్సీరెడ్డితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, ఆదిశేషగిరిరావు, నటి విజయనిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం
Published Sun, Dec 24 2017 12:59 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment