ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ అని ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ అని ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో చంద్రబాబు వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రజల్లోకి వెళ్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దేవాలయాలు తిరగడం మానేసి రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధాని హైదరాబాద్ నగరంలో హార్స్ రేసింగ్ క్లబ్ లను మూయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.