కంటికి రెప్ప ఎంత ముఖ్యమో...
మనిషి కంటికి రెప్ప ఎంత ముఖ్యమో ప్రతి ఇంటికి మొక్క అంత ముఖ్యమని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నారాయణగూడలోని కేశవమెమోరియల్ విద్యాసంస్థల్లో సోమవారం స్థానిక కార్పొరేటర్ జడల హేమలత సమక్షంలో హరితహారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విచ్చేసి మొక్కలు నాటారు. అనంతరం వారు విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ దేశం మనకు ఏం చేసిందనేది కాకుండా మనం దేశానికి ఏం చేశామన్నది ప్రాముఖ్యమన్నారు. అమెరికా, కెనడా దేశాల్లో ప్రతి విద్యార్థి 4వేల మొక్కలు నాటుతున్నారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మీరంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులను కోరారు.