
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో మంగళవారం సినీనటి జీవిత రాజశేఖర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవిత హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. ఓఎస్డీతో సమావేశం అనంతరం జీవిత మీడియాతో మాట్లాడారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని తెలిపారు.
జులై 1 న తమ కూతురు శివాని పుట్టినరోజు సందర్భంగా హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నామన్నారు. తమ కుటుంబ సభ్యులమంతా హరితహారంలో భాగస్వాములం అవుతామని ఆమె స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment