kalogy health university
-
అర్హత లేకున్నా‘యునానీ’ అడ్మిషన్లు!
సాక్షి హైదరాబాద్: యాజమాన్య కోటా కింద యునానీ వైద్యసీట్ల భర్తీలో గందరగోళం నెల కొంది. నీట్లో అర్హత లేకున్నా కొంతమందికి సీట్లు ఇచ్చారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్లు ఇచ్చామని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. పాతబస్తీ బండ్లగూడలోని అల్ ఆరీఫ్ యునానీ మెడికల్ కాలేజ్‌లో బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ(బీయూఎంఎస్)కు 100 సీట్లున్నాయి. అల్ అజీజియా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కాలేజి కాళోజీ వర్సిటీ పరిధిలో ఉంది. 2017–18 సంవత్సరానికిగాను నీట్ అర్హత పొందిన 50 మందికి కౌన్సెలింగ్ పద్ధతి లో అడ్మిషన్లు ఇచ్చారు. మిగతా 50 సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ ఎహ్సానుల్ హక్ పత్రికా ప్రకటన ఇచ్చి అడ్మిషన్లు స్వీకరించారు. అయితే, మేనేజ్మెంట్ ద్వారా అడ్మిషన్లు తీసు కున్నవారు నీట్లో అర్హత పొందలేదని, ఇవి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం) నిబంధనలకు విరుద్ధమని వర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు మార్చిలో వర్సిటీ రిజిస్ట్రార్ 50 మంది అడ్మిషన్లను రద్దు చేశారు. తిరిగి జూలైలో ఆడ్మిషన్లు.. గతంలో అడ్మిషన్లు రద్దు చేసిన 50 మందిలో నుంచి 19 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఇటీవల వర్సిటీ అధికారులు కాలేజ్‌కు ఉత్తరం పంపా రు. ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని, అక్రమంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి కాలేజ్ యాజమా న్యం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిం దని అడ్మిషన్లు లభించని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీసీఐఎం నిబంధనల ప్రకారం అడ్మిష న్ పొందాలంటే నీట్లో కనీసం 131 మార్కులు సాధించాలి. అడ్మిషన్లు పొందిన వారికి నీట్లో 20 మార్కులే వచ్చాయని ఆరోపిస్తున్నారు. దీనిపై మిగతా విద్యార్థులు సీసీఐఎంను సంప్రదించగా నీట్ అర్హత లేకుండా అడ్మిషన్లు ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు.. గతంలో విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయానికి సమర్పించకపోవడంతో అడ్మిషన్లు రద్దు చేశాం. తిరిగి ఆ విద్యార్థుల పూర్తి వివరాలను కాలేజ్ అందజేయడంతో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు ఇచ్చాం. మిగతా విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇస్తాం. –డాక్టర్ బి.కరుణాకర్‌రెడ్డి,కాళోజీ హెల్త్ వర్సిటీ, వైస్ చాన్స్‌లర్ -
ప్రధానిచే హెల్త్ వర్సిటీ భవనానికి శంకుస్థాపన
కేఎన్ఆర్ యూనివర్సిటీ కార్యకలాపాల్లో పురోగతి హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి ఎంజీఎం : దేశంలో ఎక్కడా లేని విధంగా అ త్యాధునిక హంగులతో రూ.130 కోట్లు వెచ్చిం చి ఓరుగల్లులోని కేంద్ర కారాగారం ప్రాÆ తంలో చేపట్టబోయే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి ఆది వారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. శని వారం కేఎంసీ ప్రాంగణంలోని యూనివర్సిటీ తాత్కాలిక భవనంలో రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో.. కేంద్ర కారాగారం ప్రాంతంలో హెల్త్ యూనివర్సిటీతో పాటు ఎంజీఎం ట్విన్ టవర్స్‌ను ని ర్మించే విషయమై వేగంగా పురోగతిని సాధిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ జైలుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో లక్ష చదరపు అ డుగులతో రూ.45 కోట్లతో మొదట పరిపాలన భవనాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. నా రాయణరావు యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లోని అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా 2016–17 బ్యాచ్ పీజీ సీట్ల అడ్మిషన్లను ఏప్రిల్ మాసంలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. కౌన్సెలింగ్ ఆలస్యమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం ఎంసీఐ నిబంధనల ప్రకారం ఈ నెల 31వ తేదీలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, అయితే ఎంసెట్–3 నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ అలస్యం కానుందని వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ ఎంట్రన్స్ పరీక్ష కూడా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు సమయంపై ఎంసీఐ వెసులుబాటు ఇస్తుందని తాము భావిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 30 లోగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ మొదటి దశ కౌన్సిలింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తి అవుతుందని, రెండవ, మూడో దశల కౌన్సెలింగ్ ఆలస్యం కానున్న నేపథ్యంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కోర్టు అనుమతి తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
నగర శివారుకు సెంట్రల్ జైలు
జైలు ఆవరణలో యూనివర్సిటీ భవనం 70 ఎకరాల విస్తీర్ణంలో ఎంజీఎం ట్విన్ టవర్స్ 2000 పడకలకు విస్తరించనున్న ఎంజీఎం మామునూరుకు తరలనున్న సెంట్రల్ జైలు సాక్షి, హన్మకొండ : నగరం నడిబొడ్డున ఉన్న వరంగల్ కేంద్ర కారాగారం శివారుకు తరలిపోనుంది. సెంట్రల్ జైలు విస్తరించి ఉన్న 70 ఎకరాల స్థలంలో ఎంజీఎం ఆస్పత్రి ట్విన్ టవర్స్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన యూనివర్సిటీకి కేటాయించనున్నారు. ఈ అంశం ఇప్పటి వరకు ప్రతిపాదనలన దశలో ఉండగా బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆర్యోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శాఖాపరమైన వ్యవహారాలపై దృష్టిసారించారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రస్తుతం 70 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇందులో 35 ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ హెల్త్ వర్సిటీకి కేటాయించాలని నిర్ణయించారు. కాళోజీ వర్సిటికి సంబంధించిన పరిపాలన భవన నిర్మాణం, ఇతర సదుపాయాలకు ఈ స్థలాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం రీజనల్ ఆస్పత్రిగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి స్థాయిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వేయి పడకల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించింది. ఈ రెండు వేల పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఆధునిక హంగులతో ట్విన్ టవర్స్‌గా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కొనసాగుతాయి. మల్టీ స్పెషాలిటీ విభాగంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పాథాలజీ, ఈఎన్టీ (చెవి,ముక్కు,గొంతు), మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోమెడికల్, శస్త్ర చికిత్స విభాగాలు కొనసాగుతాయి. సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, అంకాలజీ(క్యాన్సర్), గ్యాస్ట్రో (జీర్ణకోశ), ఎండ్రోకైనాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్ లతో పాటు ఇంటెన్సివ్ కార్డియోథోరియాసిక్ యూనిట్, కార్డియో థోరియాసిక్ సర్జన్ విభాగాలు కొనసాగుతాయి. మాతాశిశు ఆస్పత్రిగా.. అధునాత ఎంజీఎం ఆస్పత్రి ట్విన్ టవర్స్‌లోకి మారితే, ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహె^Œ , మెటర్నల్ చైల్డ్ హెల్త్) గా మారుస్తారు. ఇందులో గైనకాలజీ ( స్త్రీల సంబంధిత ఆరోగ్య సమస్యల విభాగం) పీడియాట్రిక్ (పిల్లలు) విభాగాలు కొనసాగుతాయి. పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ (నవజాత శిశువు) యూనిట్లు ఉంటాయి. అంతేకాకుండా వేర్వేరుగా వంద పడకల సామర్థ్యం కలిగిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం (చందా కాంతాయ్య మెమోరియల్) ఆస్పత్రులను ఎంజీఎం భవనాల్లోకి మారుస్తారు. 500 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఎంజీఎం హాస్పిటల్లో ప్రాంతీయ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి పనిచేస్తుంది. అనంతరం హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రులు జనరల్ ఆస్పత్రులగా మారుతాయి. మామునూరుకు .. నగరం మధ్యలో ఉన్న సెంట్రల్ జైలును మామునూరుకు తరలిస్తారు. నాలుగో పోలీస్ బెటాలియన్ సమీపంలో సెంట్రల్ జైలును ఏర్పాటు చే సేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది జైలు తరలింపు అంశంపై క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. -
హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి
ఎంజీఎం : హారితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, గిరి జన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ పిలుపునిచ్చా రు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కళాశాలలతోపాటు డెంటల్, నర్సింగ్, ఆయుర్వేద కళాశాలల్లో ఒకే రోజు 10వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షిం చే బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన జిల్లా క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు కిమోథెరపీ మెరుగైనా సేవలు అందడంతోపాటు వారి పేరు క్యాన్సర్ రిజిస్ట్రీలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఇక నుంచి క్యాన్సర్ విభాగానికి కేంద్రం నుంచి నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగాన్ని సందర్శించి అధునాతనపడకలను పరిశీలించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వార్డును సైతం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ కరుణ, ఏజేసీ ప్రశాంత్‌పాటిల్, హెల్త్యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు, కేఎంసీ ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖర్, ఆర్ఎంఓ హేమంత్, శివకుమార్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ లీలావతి, టీజీడీఏ ప్రధానకార్యదర్శి మోహన్, వైద్యులు రాంకుమార్‌రెడ్డి, బాలాజీ, టీఎన్జీవోస్ నాయకులు రాజేశ్, రాంకిషన్ పాల్గొన్నారు.