నర్సింగ్ కళాశాల ప్రారంభించిన మంత్రి
Published Thu, Oct 6 2016 10:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలో నర్సింగ్ కళాశాలను గురువారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ఇతోధిక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement