Somajiguda
-
రంగీలా రాస్ అదిరేటి స్టెప్పులు.. వినసొంపైన గీతాలు (ఫోటోలు)
-
కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు..
బంజారాహిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్‌తో పాటు మరో 5 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోర్జరీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–70లోని అశ్వని లేఅవుట్, ప్రశాసన్‌నగర్‌లో నివసించే జి.అరి్మతారెడ్డి అప్పటి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆమెకు హౌసింగ్ లోన్ మంజూరయ్యే సమయానికి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో విలీనమైంది. తనకు రుణం మంజూరైందని సమాచారంఅందడంతో ఆమె కోటక్ మహేంద్రబ్యాంక్ సోమాజీగూడ బ్రాంచ్‌ను ఆశ్రయించగా అక్కడి బ్యాంక్ అధికారులు ఆమె నుంచి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో వడ్డీ రేటు ఒక రకంగా చెప్పి ఆ తర్వాత అదనపు వడ్డీ రేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు తెలియకుండా వేశారు. ఉద్దేశపూర్వకంగా పోర్జరీ డాక్యుమెంట్లతో ఒప్పందాలను ఉల్లంఘించి తనను మోసం చేశారంటూ బాధితురాలు 2020 జనవరి 7న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె 17వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజి్రస్టేట్ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్, సోమాజీగూడ బ్రాంచ్ మేనేజర్ జే ప్రదీప్‌కుమార్, హిమాయత్‌నగర్ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రశాంత్‌కుమార్, సోమాజీగూడ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్రన్, బ్యాంక్ అధికారి సుదీర్, ఉద్యోగి గుత్తా ఈశ్వర్లపై కేసు నమోదు చేశారు. తాను ఈ లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తన నుంచి ఖాళీ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు. తన నుంచి బౌన్స్ చార్జెస్ అక్రమంగా వసూలు చేశారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించిందని సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తెలిపారు. సోమాజిగూడ మలబార్ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్ గ్రూప్ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్ గ్లోబల్ టర్నోవర్ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్ పేర్కొన్నారు. -
KCR: దయచేసి ఆస్పత్రికి రావొద్దు: కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రిలోనే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆస్ప్రతి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో కేసీఆర్.. బీఆర్ఎస్.. కేటీఆర్ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ విజ్ఞప్తి.. మరోవైపు ఆస్పత్రి బయట పరిస్థితులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. దీంతో బీఆర్ఎస్ కేడర్‌ను, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. ‘‘నేను కోలుకుంటున్నా.. త్వరలో మీ ముందుకు వస్తా. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దు. నాతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు సహకరించాలి. నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు: తెలంగాణ మంత్రులు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలంగాణ మంత్రులు అన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన్ని ఇవాళ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరామర్శించేందుకు వచ్చాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారేమో’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పగా.. ‘‘కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాం. త్వరగా సభకు వచ్చి వారికున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అందించాలని కోరాం. అందరూ నాయకులను కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాం. స్పీకర్ ఎన్నికలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేవిధంగా సహకరించాలని అడిగాం’’ అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. -
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పొన్నం
-
కాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
-
మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ సక్సెస్
-
నేడు కేసీఆర్ కాలుకి శస్త్ర చికిత్స చేయనున్న వైద్యులు
-
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్
-
వ్యాపారానికి అద్వితీయం.. జాబితాలో ద్వితీయం..
సాక్షి, హైదరాబాద్: ఫుడ్‌కోర్టులు, షాపింగ్‌మాల్స్, గేమింగ్ జోన్స్, రిటైల్ షాపులు, మల్టీప్లెక్స్‌లు ఇలా అన్నీ గుదిగుచ్చి ఓ వ్యాపారకూడలిగా మారే ప్రాంతాలను హైస్ట్రీట్స్గా పిలుస్తున్నారు. కాస్మోపాలిటన్ సిటీలకు ఈ హైస్ట్రీట్సే ఆకర్షణ. పగలు అందమైన ఆకాశహర్మ్యాలు, రాత్రిళ్లు నియాన్‌లైట్ల వెలుగుజిలుగులతో మెరిసిపోయే ఈ హైస్ట్రీట్స్‌కు వెళ్తే ‘‘ఎంతహాయి ఈ నగరమోయి..ఎంత అందమోయి ఈ నగరమోయి’’అని పాడుకోవాల్సిందే మరి. నగరంలో ఎక్కడ్నుంచైనా ఈ హైస్ట్రీట్స్‌కు రవాణా సౌకర్యం, ఆధునిక వసతులు, పార్కింగ్, వినోద, విహార సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ హైస్ట్రీట్లలో ప్రతి చదరపు అడుగుల ఆదాయం షాపింగ్ మాల్స్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది. హైస్ట్రీట్‌లో చదరపు అడుగుల ఆదాయం ఏడాదికి సుమారు రూ.36.42 లక్షలు కాగా..షాపింగ్ మాల్స్‌లో రూ.11.31 లక్షలుగా ఉంటుంది. ఖరీదైన ప్రాంతంగా జూబ్లీహిల్స్ నగరంలోని ఐదు ప్రాంతాలలో రిటైల్ అద్దెల పరంగా అతి ఖరీదైనప్రాంతం మాత్రం జూబ్లీహిల్సే. ఇక్కడ చదరపు అడుగు రిటైల్ స్పేస్ సగటు అద్దె నెలకు రూ.200–225 కాగా, దాని తర్వాత బంజారాహిల్స్ (రూ.190–230), సోమాజిగూడ (రూ.150–175), అమీర్‌పేట (రూ.110–130), గచ్చిబౌలి ప్రాంతాలు రూ.140గా ఉన్నాయి. హైస్ట్రీట్స్ జాబితాలో రెండోస్థానంగా సోమాజిగూడ... కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లపై ‘ఇండియా రియల్ ఎస్టేట్ విజన్–2047’పేరుతో నరెడ్కో–నైట్‌ఫ్రాంక్ ఇండియా నిర్వహించిన ఓ అధ్యయన నివేదికలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ హైస్ట్రీట్ రెండో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇక ఈ నివేదికలో బెంగళూరులోని ఎంజీ రోడ్ తొలిస్థానంలో నిలిచింది. దేశంలోని టాప్ 20 హైస్ట్రీట్స్ జాబితాలో హైదరాబాద్ నుంచి సోమాజిగూడతోపాటు ఐదు ప్రాంతాలున్నాయి. ఇందులో గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్‌పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి. ఆధునిక రిటైల్ హైస్ట్రీట్స్ లో ఎన్సీఆర్దే అగ్రస్థానం దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 30 హైస్ట్రీట్స్ ఉండగా...ఈ హైస్ట్రీట్స్ 1.32 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 52 లక్షల చదరపు అడుగుల స్థలంతో ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతంలోని ఎన్సీఆర్ తొలిస్థానంలో ఉండగా..18 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ మలిస్థానంలో నిలిచింది. ఇక అహ్మదాబాద్, బెంగళూరు ఒక్కో నగరంలో 15 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. ఆధునిక రిటైల్ స్పేస్ పరంగా చూస్తే...ఎనిమిది ప్రధాన నగరాలలో 57 లక్షల చదరపు అడుగుల వాటా ఉండగా..14 లక్షల చదరపు అడుగులతో ఎన్సీఆర్ అగ్రస్థానంలో, 11 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. -
జె ఎన్ జె హెచ్ ఎస్ మహిళా సభ్యుల సమావేశం
-
టాప్ 10 మార్కెట్లలో నాలుగు బెంగళూరులోనే.. ఎక్కడెక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సోమాజిగూడ దేశంలోని ప్రముఖ 30 ప్రాంతాల్లో (ప్రముఖ మార్కెట్ ప్రాంతాలు) రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డు మొదటి స్థానంలో నిలవగా, ముంబై లింకింగ్ రోడ్డు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ (పార్ట్ 1, 2) ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు లభించే మెరుగైన అనుభవం ఆధారంగా ఈ స్థానాలను కేటాయించారు. కస్టమర్లకు మెరుగైన ప్రాంతాలు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి. టాప్–10లో నాలుగు ఈ నగరం నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లోని ప్రాంతాలను టాప్–30 కోసం నైట్ ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 – హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. కొల్కతా పార్క్ స్ట్రీట్ అండ్ కామెక్ స్ట్రీట్ ఐదో స్థానంలో ఉంటే.. చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, చర్చి రోడ్ టాప్ 10లో ఉన్నాయి. వీటిని ప్రముఖ ప్రాంతాలుగా చెప్పడానికి అక్కడ పార్కింగ్ సౌకర్యాలు, అక్కడకు వెళ్లి రావడంలో ఉండే సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 8 పట్టణాల్లోని ప్రముఖ మార్కెట్ ప్రాంతాల్లో 13.2 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఇందులో 5.7 మిలియన్ చదరపు అడుగులు ఆధునిక రిటైల్ వసతులకు సంబంధించినది. ఈ టాప్–30 మార్కెట్లలో 2023–24లో 2 బిలియన్ డాలర్ల వినియోగం నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. -
సోమాజిగూడ విల్లామేరీలో ఫ్రెషర్స్ డే వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్: సోమాజీగూడలో లలిత జ్యువలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
-
యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సతీమణి శోభకు యశోద వైద్యులు మోకాళ్ల సర్జరీ చేశారు. కేసీఆర్ తన సతీమణి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ సతీమణి ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేసుకున్న సీఎం సతీమణిని పలువురు తెలంగాణ మంత్రులు, నేతలు పరామర్శించారు. చదవండి: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ఘాటు లేఖ -
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై బండి సంజయ్ స్పందన
-
ఆసుపత్రిలో సీఎం కేసీఆర్.. బండి సంజయ్ స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను యశోద ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా.. ఆస్పత్రిలో కేసీఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ టెస్టులు పూర్తి అయినట్లు, గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని యశోద వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్ టెస్టులు నార్మల్‌గానే వచ్చాయని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. ఈ సందర్భంలోనే సీఎం కేసీఆర్‌కు ప్రతీ ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం స్టేబుల్‌గా ఉందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం: సీఎం వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు pic.twitter.com/WUxlaFwo7J — Telangana CMO (@TelanganaCMO) March 11, 2022 కేసీఆర్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, రాజకీయాల్లో వీరిద్దరూ బద్ద శత్రువులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తూ మొట్టమొదటి సారిగా బండి సంజయ్ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.@TelanganaCMO — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 11, 2022 -
తరాష్ ఎగ్జిబిషన్లో జిగేలుమన్న భామలు
-
నవంబర్ 15న బంజారాహిల్స్‌తోపాటు ఈ ప్రాంతాలకు నీళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న సోమవారం పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పంజగుట్ట శ్మశాన వాటిక ఎదురుగా రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అక్కడున్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌ను మరోచోటకు మార్చాల్సిన నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని తెలిపింది. నిర్వహణ డివిజన్ 6లో ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, వెంకటగిరి సెక్షన్ల పరిధిలోని ప్రాంతాల్లో, నిర్వహణ డివిజన్ 9లో మూసాపేట సెక్షన్ పరిధిలోని పాండురంగానగర్, కబీర్‌నగర్ ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు. నిమ్స్‌కు నీటి సరఫరా బంద్ నిమ్స్‌కు 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి శుక్రవారం నిమ్స్ యాజమన్యానికి సర్కులర్ జారీ చేసింది. ఈ నెల 15వ తేది సాయంత్రం నుంచి 16వ తేది రాత్రి వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 24 గంటల పాటు శ్రస్త చికిత్సలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. -
‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే!
సాక్షి, పంజగుట్ట: సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. తీరా శ్వాస తీసుకోవడం గమనించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించింది. వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు సనత్‌నగర్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతన్ని మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం అడ్మిట్ చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలు చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు రోధిస్తూ వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని గమనించి వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగిని చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి మహేందర్‌ను తిరిగి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. చదవండి: Hyderabad Rains: మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే! -
యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు చేపట్టారు. 20కి పైగా ఐటీ శాఖ బృందాలు.. మూడు బ్రాంచ్‌లకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఇళ్లల్లోపాటు(సురేందర్ రావు-సోమాజిగూడ, రవీందర్ రావు-సికింద్రాబాద్, దేవేందర్ రావు-మలక్‌పేట), నాగార్జున హిల్స్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం. వీరి నుంచి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఆదాయపు పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ? -
కరోనా వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యమైంది
-
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పండి: మంత్రి కేటీఆర్
-
కరోనా కోసం నా స్టయిల్ మార్చుకోలేదు
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంత కాదు. వర్మను విమర్శించే వాళ్లు ఎంతమంది ఉంటారో.. అంతకు మించి ఆరాధించే వారు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంచలన దర్శకుడిని ఇష్టపడే యువ రచయిత రేఖ పర్వతాల అతనిపై ఓ పుస్తకాన్ని సైతం లిఖించి.. తన అభిమానాన్ని చాటుకున్నారు. రచయిత్రి రేఖ పర్వతాల రచించిన ‘వర్మ మన ఖర్మ’ పుస్తకాన్ని సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయిరాలు స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ .. చిన్న వయస్సులోనే రేఖ పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. తన గూర్చి ఏం రాశావు అని ఎప్పుడూ అడగలేదని, ఆమె ఫ్యాషన్ ఆమెను పూర్తిచేసుకోమ్మన్నానని తెలిపారు. తాను రచయిత్రి స్థానంలో ఉంటే అంకితం నాకు ఆయనకు అని పెట్టకుండా నాకు వాడికి అని పెట్టేవాడినన్నారు. తాను ఎప్పుడూ ఒకే ఫిలాసఫీ ఫాలో అవ్వనని, నా కన్వినెంట్ ప్రకారం అవి మారుస్తుంటానన్నారు. ప్రతీ మనిషిలో ఒక మృగం, రాక్షసుడు దాగి ఉంటారని దాన్ని బయటకు తీయడం తప్పు అని అందరూ అంటారని, కాని మృగాన్ని బయటకు తీసి మనం చేయాలనుకున్నది చేయాలని తాను చెపుతానన్నారు. సమస్యలగూర్చి ఎప్పుడూ పట్టించుకోనని, ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, కాని భాధపడితే లాభం ఉండదన్నారు. బర్నింగ్ టాపిక్స్‌పై తాను సినిమాలు తీయనని, మంటలు ఆరాక సినిమాలు తీస్తానన్నారు. తాను ఇప్పటివరకు మాస్క్ ధరించలేదని, సానిటైజర్ వాడలేదని, భౌతికదూరం పాటించలేదని కరోనా కోసం తన లైఫ్‌స్టైల్‌ను మార్చుకోనని, తాను తనలాగే బతుకుతానని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. రచయిత్రి రేఖ పర్వతాల మాట్లాడుతూ .. ఆర్జీవీ అంటే తానకు చాలా ఇష్టమని, ఆయన నాకు గురువు లాంటివారన్నారు. నాకు కూడా ఆర్జీవీలా స్వతంత్రంగా బతకడం ఇష్టమన్నారు. కార్యక్రమంలో వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ, రచయిత్రి తల్లి సుమతి, తండ్రి రత్నయ్య, సైకాలజిస్ట్ విషేశ్ పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. -
143 మంది అత్యాచారం చేశారు
పంజగుట్ట: రాష్ట్ర పోలీసు చరిత్రలో అత్యంత అరుదైన కేసు రికార్డులకు ఎక్కింది. గతంలో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు, దేశంలోనే రెండో బెస్ట్ ఠాణా రికార్డుల్ని సొంతం చేసుకున్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గురువారం నమోదైన ఈ కేసు వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. గడిచిన 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ సోమాజిగూడలో నివసిస్తున్న ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 42 పేజీలతో ఇది జారీ కావడం గమనార్హం. ఇందులో యువతి పేర్కొన్న ప్రకారం.. 138 మంది ప్రముఖు లు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు రిజిస్టర్ చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన బాధితురాలికి (25) 2009లోనే వివాహమైంది. ఆమె మైనర్‌గా ఉండగానే మిర్యాలగూడకు చెందిన కె.రమేశ్‌తో పెళ్లి జరిగింది. ఆమె భర్త, ఆడపడుచు, అత్త, మామ, సోదరులతో పాటు వారి బంధువులు దాదాపు 20 మంది శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని బాధితురాలు 9 నెలల తర్వాత తన తల్లికి చెప్పింది. 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్న యువతి పుట్టింటికి చేరుకుని తన చదువు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఈమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించాడు. ఇతనితోపాటు గడిచిన 11 ఏళ్లలో అనేక మంది నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లారని, వారితోపాటు స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 5 వేల సార్లు అత్యాచారం.. ఇప్పటివరకు 5 వేల సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు తెలిపింది. వీరిలో 138 మంది పేర్లు తన ఫిర్యాదులో పొందుపరిచిన బాధితురాలు గుర్తుతెలియని మరో ఐదుగురు ఉన్నట్లు వెల్లడించింది. వీళ్లంతా తన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో పెడతానని భయపెట్టేవారని, బలవంతంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారని పోలీసుల వద్ద వాపోయింది. తాము చెప్పినట్లు వినకపోతే గన్‌తో కాల్చేస్తామని, ముఖంపై యాసిడ్ పోస్తామని కొందరు బెదిరించేవారని, తనతో కూడా బలవంతంగా మద్యం తాగించేవారని, కొన్ని సందర్భాల్లో తాను గర్భవతిని అయ్యానని, ఆ దుండగులే బలవంతంగా గర్భం తీయించారని తెలిపింది. దళితురాలినైన తనను కులం పేరుతో దూషించేవారని, వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకుని మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ బాధలు భరించలేకపోయిన తాను గాడ్ పవర్ ఫౌండేషన్ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ దురాగతాలకు పాల్పడిన వారిలో కొందరు తనపై హత్యాయత్నం చేశారని, ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. బాధితురాలు ఫిర్యాదు అందించేందుకు బురఖా ధరించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించిన పంజగుట్ట అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేశారు. -
విల్లామేరి విద్యార్థినుల ఆటా పాట
-
టీన్స్.. డిజైన్ ట్రెండ్స్...
-
లఖోటియా : ఫ్రెషర్స్ హుషార్
-
మెరిసిపోయారు: విల్లామేరీ ఫ్రెషర్స్ డే
-
చాక్లెట్ బ్యూటీస్
-
జుంబారే... జంబోరీ విల్లా మేరి
-
బతుకమ్మ వేడుకలు
-
జోరు..హుషారు..!
-
నగదు విత్‌డ్రా కోసం వచ్చి, ఏకంగా ఏటీఎంనే..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సోమాజీగూడ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో విచిత్ర సంఘటన జరిగింది. నగదు విత్‌డ్రా కోసం వచ్చిన వ్యక్తి ఎవరూ లేరు అనుకొని ఏకంగా ఏటీఎం చోరీ చేయడానికి యత్నించాడు. అయితే సెక్యూరిటీ అలారం మోగడంతో దుండగుడు వెనక్కి తగ్గాడు. నగదు డ్రా చేసుకొని వెళ్లిపోయాడు. ఈ దృష్యాలన్నీ సీసీ కెమరాలో నమోదయ్యాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
వైఫై ఆఫ్ చేసిందన్న కోపంతో భార్యను...
-
హైదరాబాద్‌లో దారుణం.. వైఫై కోసం భార్యను...
సాక్షి, హైదరాబాద్ : వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై పడి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుల్తానాను ఆమె తల్లి గురువారం ఉదయం ఆస్పత్రిలో చేర్చింది. సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. -
రంగ్ తరంగ్
-
విల్లామేరీసెన్
-
లలితా జ్యువెల్లర్స్లో మరో చోరీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నగల దుకాణం లలితా జ్యువెల్లర్స్లో మరోసారి దొంగతనం జరిగింది. సోమాజిగూడలోని తమ షోరూమ్‌లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్ ప్రతినిధి జి. మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న తమ షోరూమ్‌కు ఓ జంట 66 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసిందని ఫిర్యాదులో తెలిపారు. తమ సిబ్బందిని గందరగోళానికి గురిచేసి ఈ దొంగతనం చేశారని వెల్లడించారు. రూ. 24.9 గ్రాముల బంగా గాజులు, 10.7 గ్రాముల బ్రాస్లెట్, 30.4 గ్రాముల గాజుల జత ఎత్తుకుపోయారని వివరించారు. తర్వాత రోజు ఈ విషయం బయటపడటంతో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించామన్నారు. చోరీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతకుముందు కూడా లలితా జ్యువెల్లర్స్లో దొంగతనం జరిగింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం దొగిలించారని ఈ నెల 9న లలితా జ్యువెల్లర్స్ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు నగ స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు ఈ చోరీ చేసినట్టు సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా గుర్తించారు. -
ఫ్యాషన్ జోష్..
-
సోమాజిగూడ హోటల్లో వ్యభిచారం గుట్టు రట్టు
-
ఒకే ఆభరణం అనేక రకాలుగా..
ఒకే ఆభరణాన్ని స్వల్ప మార్పు చేర్పులతో విభిన్న రకాల వేడుకలకు నప్పే విధంగా ధరించే కన్వర్టబుల్ జ్యువెలరీని కీర్తిలాల్స్ రూపొందించింది. సోమాజిగూడలోని సంస్థ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేశారు. -
నర్సింగ్ కళాశాల ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలో నర్సింగ్ కళాశాలను గురువారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బడ్జెట్లో ప్రజారోగ్యానికి ఇతోధిక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కాలేజీలో సందడి చేసిన శిరీష్
సోమాజిగూడ: విద్యార్థుల ఉరకలెత్తే ఉత్సాహంతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. ఆటపాటలతో అదిరిపోయింది. బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ‘ఎస్కేస్ 2016’ కార్యక్రమం ఉర్రూతలూగించింది. వివిధ కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేయగా... సినీ నటులు అల్లు శిరీష్, సుమంత్ ఆశ్విన్‌లు పాల్గొని జోష్ నింపారు. -
డిజైన్స్ షో
సోమాజిగూడ: హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు రూపొందించిన విభిన్న డిజైన్లను ఇనిస్టిట్యూట్ ఎండీ అజితారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. పంజగుట్టలోని ఇనిస్టిట్యూట్ జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన డిజైన్లతో అక్టోబర్ 5న సోమాజిగూడ పార్క్ హోటల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించనున్నట్లు చెప్పారు. -
‘పార్క్’లో ఆకృతి..
సోమాజిగూడ: ‘ఆకృతి ఎలైట్’ఎగ్జిబిషన్ శుక్రవారం సోమాజిగూడ పార్క్ హోటల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వర్ధమాన నటి పూజశ్రీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివారం వరకు ఈ ప్రదర్శన జరగనున్నట్లు నిర్వాహకురాలు శశినెహతా తెలిపారు. -
విలీనము.. విమోచనము.. రెండూ కాదు
పంజగుట్ట: తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ప్రాబల్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే తెలంగాణ విమోచన దినం అని వాదనలు వినిపిస్తున్నారని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ విలీనం కాదు, విమోచన దినం కాదని వారు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాఖ్య కో కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి, కన్వీనర్ ఆరీఫుద్దీన్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావులు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంతో ఏదైనా విబేధాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కాని హైదరాబాద్ చరిత్ర వక్రీకరించకూడదని అన్నారు. టీఆర్ఎస్ ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని లేకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని హితవుపలికారు. ప్రొఫెసర్ కోదండరామ్ విలీనదినమని అంటున్నారని దాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. లైబ్రరీలో ఎన్నో చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ సత్తార్ ముజాహిద్, శ్రీరామ్, ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్‌కు నివాళి
సోమాజిగూడ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. రాష్ట కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలి విపక్ష నత షబ్బీర్ అలీ, ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి దానం, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మానేపల్లి జ్యూయలర్స్
హైదరాబాద్: వజ్రం కలకాలం నిలిచి ఉంటుంది. అతివ అందమైన చిరునవ్వులా. వజ్రాల మెరుపులతో పోటీ పడి తారలు తళుక్కుమంటుంటే ఆ ఆభరణాల ప్రదర్శన నవ కాంతులీనింది. సోమాజిగూడలోని మానేపల్లి జ్యూయలర్స్ షోరూమ్ వజ్రాభరణాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఔత్సాహిక నటి హర్షద పాటిల్, మోడల్స్ సంస్థ రూపొందించిన తాజా ఆభరణాలను ప్రదర్శించారు. శ్రావణమాస వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 25 వరకూ కొనసాగుతుందని సంస్థ నిర్వాహకులు మురళీకృష్ణ, గోపీ కృష్ణ తెలిపారు. -
మాక్స్‌లో కొత్త కలెక్షన్లు
సోమాజిగూడ: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాక్స్ ఫ్యాషన్స్ సోమాజిగూడలోని స్టోర్‌లో బుధవారం కొత్త కలెక్షన్లను ఆవిష్కరించింది. ఇందులో మోడల్స్ విభిన్న వస్త్రాలను ధరించి తళుక్కుమన్నారు. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో సరికొత్త వస్త్ర శ్రేణి అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. -
సందేశం..సంబరం
-
వివాహిత అనుమానాస్పద మృతి
హైదరాబాద్: సోమాజిగూడలో పి. అనూష(27) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అనూష స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. 23 రోజుల క్రితమే అనూషకు ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌తో పెళ్లైంది. అనూష, హర్షిత అనే మహిళతో కలిసి కళానిక కాస్టైల్ అపార్టుమెంటులోని 302 ఫ్లాట్‌లో ఉంటుంది. హర్షిత షిర్డీకి వెళ్లి వచ్చి చూసేసరికి అనూష శవమై పడి ఉంది. -
మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
హైదరాబాద్ : హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్లో మహిళ హత్యకు గురైంది. అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులో 25 ఏళ్ల యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు సాప్ట్వేర్ ఇంజినీర్ అనూషగా గుర్తించారు. ఆమెకు కొద్దిరోజుల క్రితమే వివాహం అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సందడిగా విల్లామేరి ఫెస్ట్
-
బీఎస్ రావు గ్రూపులో పాస్‌పోర్టులు స్వాధీనం
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగును మోసం చేసిన బి.ఎస్.రావు గ్రూపు సంస్థలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన దుర్గా పవన్‌కుమార్ రాజ్భవన రోడ్డులోని అమృతావిల్లా అపార్ట్మెంట్లో బి.ఎస్.రావు గ్రూప్ సంస్థను ఏర్పాటు చేసి, స్విట్జర్లాండ్‌లోని కొన్ని ఫార్మా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన విషయం తెల్సిందే. శుక్రవారం 95 మందిని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి.. తీరా ముఖం చాటేసిన కేసులో నిందితుడు పవన్‌కుమార్, బ్రోకర్ యూసుఫ్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా సంస్థ నుంచి కీలక పత్రాలు, పలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. -
నిండా ముంచేశారు
* స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాలంటూ ఎర * బీఎస్ రావు గ్రూప్ కన్సల్టెన్సీ దగా సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లో ఉద్యోగమన్నారు.. నెలకు లక్షా యాభై వేల రూపాయల జీతం వస్తుందని నిరుద్యోగులను ప్రలోభపెట్టారు.. దీంతో దారిద్య్రాన్ని దూరం చేసుకోవచ్చనుకుని ఇళ్లు, పొలాలు, భార్య ఒంటిపై నగలను అమ్ముకుని, అప్పులు చేసి మరీ డబ్బు తెచ్చి చేతిలో పోసిన అమాయకులను నిండా ముంచేశారు.. వారిని విమానాశ్రయం దాకా రప్పించారు. అప్పటికి అసలు విషయం తెలిసిన బాధితులు గొల్లుమన్నారు. గుంటూరుకు చెందిన దుర్గాపవన్ అనే వ్యక్తి హైదరాబాద్ సోమాజిగూడలోని అమృతా విల్లా అపార్టుమెంట్లో బీఎస్‌రావు గ్రూప్స్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. స్విట్జర్లాండ్‌లోని ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ. లక్షా అరవై వేలు చెల్లిస్తే మూడేళ్ల పాటు అగ్రిమెంట్ కింద స్విట్జర్లాండ్ పంపిస్తామని ప్రచారం చేసుకున్నాడు. ప్రతి నెలా రూ. లక్షా యాభై వేలు జీతం వస్తుంద ని ఆశపెట్టాడు. వరంగల్ జిల్లాకు చెందిన యూసుఫ్‌తో పాటు కొంతమందిని బ్రోకర్లుగాను, ట్రావెల్ ఏజెంట్‌గా మహ్మద్ జావిద్‌ను నియమించుకున్నాడు. హంగూ ఆర్భాటాలతో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఇల్లందు ప్రాంతాలకు చెందిన 94 మంది వీరి ప్రచారాన్ని నమ్మి.. ఆస్తులను అమ్ముకుని మరీ డిసెంబర్, జనవరి నెలల్లో రూ. 76,000, జూన్‌లో మిగతా రూ. 84,000ను చెల్లించారు. వీరిలో వరంగల్‌కు చెందిన 54 మంది యూసుఫ్ స్థానికుడని నమ్మి డబ్బు కట్టారు. వీరందరినీ నమ్మించేందుకు వారి వివాహ ధ్రువపత్రం, పాన్ కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టులను దుర్గాపవన్, యూసుఫ్ తదితరులు తీసుకున్నారు. గత నెల 14న స్విట్జర్లాండ్ పంపిస్తామని చెప్పి అందరినీ ఎయిర్‌పోర్టు వరకు రప్పించారు. కానీ ఇంకా పని ఒప్పందం కుదరలేదని, కొంతకాలం ఆగాలని చెప్పి అందరినీ తిరిగి పంపించేశారు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో గత నెల హైదరాబాద్‌లోని హోటల్ కత్రియాలో సమావేశం ఏర్పాటు చేసి, అందరిని తప్పకుండా పంపిస్తామని చెప్పారు. తర్వాత జూలై 4న స్విట్జర్లాండ్‌కు పంపిస్తామని, అందరూ సిద్ధం కావాలని సమాచారం ఇచ్చారు. అసలు పత్రాలే లేవు ట్రావెల్ కన్సల్టెన్సీ సమాచారం మేరకు డబ్బు కట్టినవారంతా బంధువులతో సహా శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ కన్సల్టెన్సీ ఇచ్చిన పత్రాలు సరిగా లేక అధికారులు తిరస్కరించారు. దీంతో బాధితులు ఆందోళనకు గురై ఏజెంట్లలో ఒకరైన పవన్‌ను విమానాశ్రయానికి పిలిపించారు. కానీ అతను ఇంకా పని ఒప్పందం కుదరలేదని, మరికొన్ని రోజులు ఆగాలని చెప్పాడు. దీంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించారు. పవన్‌ను పట్టుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించి, అక్కడే ఆందోళనకు దిగారు. కన్సల్టెన్సీని నమ్మి మోసపోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు పవన్, యూసుఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కన్సల్టెన్సీ ఉన్న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. దీంతో బాధితులు పంజగుట్ట పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ కూడా ఆందోళనకు దిగారు. తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేఃశారు. కాగా కన్సల్టెన్సీ మోసం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు 14న తమను స్విట్జర్లాండ్ తీసుకెళతానంటూ ఇదే కన్సల్టెన్సీ డబ్బులు వసూలు చేసిందంటూ మరికొందరు పోలీసులను ఆశ్రయించారు. నగలమ్మి డబ్బులిచ్చా.. గత నెల 13న నా దగ్గర 4,500 తీసుకుని యాభై స్విట్జర్లాండ్ ఫ్రాంకులు ఇచ్చి నమ్మించాడు. నా భార్య నగలమ్మి డబ్బులు చెల్లించాను - మహ్మద్ గౌస్ మాకు న్యాయం చేయాలి స్విట్జర్లాండ్‌లో చలి మైనస్ డిగ్రీల్లో ఉంటుందని, అందరూ మంచి కంపెనీకి చెందిన జర్కిన్లు కొనుక్కోవాలని కన్సల్టెన్సీ వాళ్లు చెప్పారు. ఎయిర్‌పోర్టులో కేవలం వుడ్లాండ్ లెదర్ బూట్లను మాత్రమే అనుమతిస్తారని, అందరూ జీన్స్‌ప్యాంట్లు, టీషర్టు, ఉన్ని సాక్సు, టర్కీ టవల్ తెచ్చుకోవాలన్నారు. దాంతో అందరం మరో పది వేల చొప్పున ఖర్చుపెట్టి అవన్నీ కొన్నాం. నా సొంతిల్లు అమ్ముకుని మరీ కన్సల్టెన్సీకి డబ్బు కట్టాను. పోలీసులు మాకు న్యాయం చేయాలి. - షేక్ సాజిద్, వరంగల్ జిల్లా మోసపోయాం ఆటో నడుపుకునే నేను విదేశాలకెళ్లి డబ్బు సంపాదించా లనుకున్నా. మరో 15 మందినీ కన్సల్టెన్సీకి తీసుకొచ్చా. అందరం మోసపోయాం. - సాయిబాబు, బీఎస్ మక్తా -
ఆగని ‘సాఫ్ట్వేర్’ మోసాలు
హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: మొన్న సోమాజిగూడలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో మోసం..తాజాగా నారాయణగూడలో ఓ కన్సల్టెన్సీ వంచన. నిరుద్యోగుల అమాయకత్వాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన భవనం, ఫర్నీచర్, కంప్యూటర్లు ఏర్పాటు చేసి, మంచి వేతనాలిప్పిస్తామంటూ డిపాజిట్ల పేరుతో రూ.కోట్లకు టోపి పెడుతున్నారు. చివరకు బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నారాయణగూడ ఎస్సై డేనియేల్ కథనం ప్రకారం..సతీష్ అనే వ్యక్తి హిమాయత్‌నగర్ 18వ వీధి వద్ద ఉన్న ఓ బిల్డింగ్‌లో ‘హెచ్ఆర్ ఈ-సాల్వ్ సొల్యూషన్స్’ పేరుతో కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. టీసీఎస్ లాంటి పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలు రకాలు ప్రచారం చేసుకున్నాడు. ఇతనికి గోపాల్ అనే వ్యక్తి సహాయంగా ఉండేవాడు. సంస్థ ప్రచారాన్ని నిజమని నమ్మిన పలువురు నిరుద్యోగులు ఆశ్రయించగా.. వారి వద్ద నానాహంగామా చేసి ‘మీ బయోడేటాలను సదరు కంపెనీలకు పంపుతున్నాము, మీకు ఉద్యోగం ఖాయం, రెండు నెలల్లో భారీ వేతనం అందుకోబోతున్నారని’ నమ్మించేవారు. వారి ముందే ఆయా సాఫ్ట్వేర్ కంపెనీలకు మెయిల్స్ కూడా పంపేవారు. వీటిని నమ్మిన పలువు రు లక్షా 20వేల నుంచి లక్షన్నర వరకు హెచ్ఆర్ ఈ-సాల్వ్ యాజమాన్యానికి చెల్లించారు. సంస్థ మా టలు నిజమని నమ్మిన నిరుద్యోగులు వారు చెప్పిన తేదీల్లో ఆయా కంపెనీలకు వెళ్లగా ‘ఈ-సాల్వ్’ సంస్థకు మాకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో మోసం బయటపడింది. కొద్దిరోజులుగా బాధితుల ఒత్తిడి పెరగడంతో సంస్థ రాత్రికి రాత్రి బిచాణా ఎత్తివేసింది. బాధితులకు సుమారు రూ.50లక్షల వరకు సంస్థ కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఫజియుద్దీన్తోపాటు పలువురి ఫిర్యాదుమేరకు పోలీసులు కే సు నమోదు చేసి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కటకటాల్లోకి ‘సాఫ్ట్’ మోసగాళ్లు శ్రీనగర్‌కాలనీ: సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చి, పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌కుమార్ వివరాల ప్రకారం..తమిళనాడుకు చెందిన సంతాన కృష్ణ చాలాకాలం క్రితం నగరానికి వచ్చి సోమాజిగూడలోని ఓ భారీ భవనంలో డిస్ట్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో నగరానికి చెందిన ఉదయ్‌భాస్కర్‌ను హెచ్ఆర్ మేనేజర్‌గా నియమించుకొని ఇద్దరు కలిసి ఉన్నత చదువులు చదవి ఉద్యోగవేటలో ఉన్న నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. తమ సంస్థలో శిక్షణ తీసుకుంటే పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని..ఒకవేళ రాకపోయినా తమ వద్దే ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు తీసుకున్నారు. మూడునెలల వరకు స్టైఫండ్ చెల్లించిన కృష్ణ నాల్గోనెల నుంచి ముఖం చాటేయడంతో పలువురు ఒత్తిడి చేశారు. పథకం ప్రకారం ఈనెల 24న రాత్రికిరాత్రే సంస్థలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ తీసుకొని ఉడాయించారు. నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టి సంతాన కృష్ణ, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
చదువుతో పాటు క్రీడలు నేర్పించాలి: సైనా
సోమాజిగూడ, న్యూస్‌లైన్: విద్యాసంస్థలు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సూచించింది. సోమాజిగూడలోని కత్రియా హోటల్లో స్కూల్ రేటింగ్ కంపెనీ గ్రేమాటర్స్ ఆధ్వర్యంలో ‘బాటిల్స్ ఆఫ్ ద బెస్ట్ విజన్-2020’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా హైదరాబాదీ స్టార్ మాట్లాడుతూ... సంపూర్ణ మానసిక, శారీరక వికాసానికి తోడ్పడే క్రీడలను విద్యార్థులకు తప్పనిసరిగా నేర్పించాలని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే విధంగా శిక్షణనిస్తున్న స్కూళ్లను ఎంపిక చేయగా అందులో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ విజేతగా నిలిచింది. ఆ స్కూల్‌కు సైనా ట్రోఫీని అందజేసింది. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో ప్రదీప్ శర్మ, పలు పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్యాట్‌వాక్‌తో అలరించిన విద్యార్థినులు
-
హైదరాబాద్ సోమాజీగూడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ సోమాజీగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న భవనంలో మంగలు ఎగిసిపడుతున్నాయి. ఒక పక్క వర్షం పడుతున్నా అపార్ట్మెంట్లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియలేదు.