లలితా జ్యువెల్లర్స్‌లో మరో చోరీ | Theft In Lalitha Jewellery Outlet In Somajiguda | Sakshi
Sakshi News home page

లలితా జ్యువెల్లర్స్‌లో మరో చోరీ

Published Fri, Dec 15 2017 7:11 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Theft In Lalitha Jewellery Outlet In Somajiguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నగల దుకాణం లలితా జ్యువెల్లర్స్‌లో మరోసారి దొంగతనం జరిగింది. సోమాజిగూడలోని తమ షోరూమ్‌లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్‌ ప్రతినిధి జి. మధుసూదన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న తమ షోరూమ్‌కు ఓ జంట 66 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసిందని ఫిర్యాదులో తెలిపారు. తమ సిబ్బందిని గందరగోళానికి గురిచేసి ఈ దొంగతనం చేశారని వెల్లడించారు. రూ. 24.9 గ్రాముల బంగా గాజులు, 10.7 గ్రాముల బ్రాస్‌లెట్‌, 30.4 గ్రాముల గాజుల జత ఎత్తుకుపోయారని వివరించారు. తర్వాత రోజు ఈ విషయం బయటపడటంతో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించామన్నారు. చోరీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంతకుముందు కూడా లలితా జ్యువెల్లర్స్‌లో దొంగతనం జరిగింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం దొగిలించారని ఈ నెల 9న లలితా జ్యువెల్లర్స్‌ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు నగ స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు ఈ చోరీ చేసినట్టు సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement