Lalitha Jewellery
-
తిరుమల శ్రీవారికి కోటి 50 లక్షల విలువ చేసే బంగారం
-
అదే ఆమె గొప్పతనం.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసల వర్షం
ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్‌గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
లలితా జ్యుయెలరీ దోపిడీ కేసు; అప్డేట్
సాక్షి, బనశంకరి (బెంగళూరు): తమిళనాడులో సంచలనం సృష్టించిన తిరుచ్చి లలితా జ్యుయెలరీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అంతరాష్ట్ర దోపిడీదారుడిని బెంగళూరు బొమ్మనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే 12 కేజీల బంగారు, ప్లాటినం నగలు, వజ్రాభరణాలతో పాటు టవేరా కారును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ మంగళవారం తెలిపారు. ఈ సొత్తును హోంమంత్రి బసవరాజ బొమ్మైతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు తిరుచనాపల్లి తిరువంబూర్‌కు చెందిన మురుగన్(45) అలియాస్ బాలమురుగన్, శివకుమార్, శివ తదితర పేర్లతో తిరుగుతూ.. వివిధ రాష్ట్రాల్లో తన అనుచరులతో కలిసి భారీ దోపిడీలకు పాల్పడేవాడు. తిరుచ్చి లలితా జ్యుయెలరీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలో దోచుకున్న బంగారు ఆభరణాలను తిరుచ్చి నది పక్కన అడవిలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. ఇటీవల బొమ్మనహళ్లిలో చోటుచేసుకున్న చోరీ కేసులో తీవ్రంగా గాలించిన పోలీసులు మంగళవారం మురుగన్‌ను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా దొంగతనాల చిట్టా విప్పాడు. అతడిపై బెంగళూరులో బాణసవాడి, మడివాళ, హెచ్ఎస్ఆర్ లేఔట్, అమృతహళ్లి, నెలమంగల, అనేకల్‌లో చోరీ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనేక బ్యాంకుల్లో అతడు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. కాగా మురుగన్‌ను నాలుగు రోజుల కిందటే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు సొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. -
‘లలితా’ నగలు స్వాధీనం
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు. -
రూ.10 కోట్ల నగలు, నటితో పరార్
చెన్నై,టీ.నగర్: తిరుచ్చి లలితా జ్యువెలరీలో నగల చోరీ కేసు మరో మలుపు తిరిగింది. నగలు చోరీ చేసిన దొంగల ముఠా నేత రూ.10 కోట్ల విలువైన నగలు, నటితో శ్రీలంకకు పరారైనట్లు సమాచారం అందింది. వివరాలు.. తిరుచ్చి సత్రం బస్టాండులోని ప్రముఖ నగల దుకాణం లలితా జ్యువెలరీలో ఈనెల 2వ తేదీన రూ.13 కోట్ల విలువైన నగలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనికి సంబంధించి తిరువారూరు మడపురానికి చెందిన మణికంఠన్ నాలుగు కిలోల బంగారు నగలతో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో సురేష్, అతని మామ పేరుమోసిన దొంగని, తిరువారూరు మురుగన్‌తో కలిసి రూ.13 కోట్ల నగలను దోచుకున్నట్లు మణికంఠన్ ఒప్పుకున్నాడు. ఇలా ఉండగా తిరువారూర్ మురుగన్ రూ.10 కోట్ల నగలతో శ్రీలంకకు పరారైనట్లు తెలిసింది. నగలతోపాటు నటిని వెంటబెట్టుకుని వెళ్లినట్లు విచారణలో తేలింది. ఇతనికి చెన్నై ఈసీఆర్‌లో లగ్జరీ బంగళా, ఇతర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మురుగన్ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు, నగల దుకాణాలు, ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో చేతివాటాన్ని ప్రదర్శించాడు. కాగా మురుగన్ ఎయిడ్స్ రోగి అని వెల్లడైంది. ఐదుగురిని అరెస్ట్ చేస్తాం:కమిషనర్ అమల్‌రాజ్ తిరుచ్చి లలితా జ్యువెలరీ దోపిడీ నిందితులు ఐదుగురిని త్వరలో అరెస్టు చేస్తామని విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ వెల్లడించారు. -
వీరికి మోహం... వారికి దాహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగారమంటే తమిళనాడు ప్రజల్లోన తరగని వ్యామోహమే ఉత్తరాది దొంగల దోపిడీ దాహాన్ని తీరుస్తోందని రిటైర్డు పోలీసు అధికారి ఒకరు చెబుతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన దోపిడీ దొంగలు తమిళనాడునే ప్రత్యేకంగా ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే.. బ్రిటీష్ తెల్లదొరలు భారత్‌ను బానిస దేశంగా పరిగణించింది ఇక్కడున్న అత్యంత విలువైన వనరులను ఇంగ్లాండు దేశానికి కొల్లగొట్టుకుపోవడానికే. అలాగే ఉత్తరాది దొంగలు సైతం దక్షిణాది సంపదను కొల్లగొట్టి తమ రాష్ట్రాలకు తరలించేందుకు తమిళనాడును ఎన్నుకున్నారు. ఈ తరలింపులో బంగారం ప్రధానపాత్ర పోషిస్తోంది. మొత్తం భారతదేశంలోనే పెద్ద ఎత్తున బంగారు అభరణాల అమ్మకాలు సాగేది తమిళనాడులోనే. ఆర్థికంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు పెళ్లి తదితర శుభ కార్యాలకే కాదు, అన్నిరకాల సమావేశాలకు సైతం పెద్ద ఎత్తున బంగారు నగలను అలంకరించుకుని రావడం రాష్ట్ర మహిళలకు అలవాటు. అందుకే చెన్నై మహానగరంలో చైన్ స్నాచింగ్‌లు చోటుచేసుకోని రోజు ఉండదు. మహిళల మధ్య పోటీలా బహిరంగంగా సాగుతున్న బంగారు నగల ప్రదర్శన ఇతరుల మాటెలా ఉన్నా ఉత్తరాది దొంగలను మాత్రం ఎంతో ఆకర్షిస్తోంది. అంతేగాక బంగారు నగలను సేకరించడం కూడా తమిళనాడు మహిళలకు వంశపారంపర్యంగా హాబీగా వస్తోంది. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు, అధికారులు కిలోల లెక్కన బంగారును కొనుగోలు చేసి లాకర్లలో దాస్తుంటారు. పేదలు సైతం యథాశక్తి బంగారు కొనుగోలు చేస్తారు. అదేమని అడిగితే కష్టకాలంలోకుదువపెట్టుకునేందుకు ఉపయోగపడుతుందని కొంటున్నామని బదులిస్తారు. పెళ్లి సమయంలో వరదక్షిణగా కిలోల లెక్కన బంగారు నగలు చెల్లిస్తుంటారు. వరదక్షిణ ఇవ్వడం, పుచ్చుకోవడం చట్టరీత్యా నేరమైనా యథేచ్చగా సాగిపోతోంది. బంగారు ధర ఎంతగా పెరిగినా జ్యువెలరీ షాపుల్లో రద్దీకి మాత్రం కొదవ ఉండదు. దాదాపుగా ప్రతిరోజూ కిటకిటలాడి పోతుంటాయి. ఇలా అనేక కోణాల్లో బంగారు నగలకు తమిళనాడు ప్రసిద్ధికావడంతో ఉత్తరాది దొంగలముఠాకు రాష్ట్రం తరగని బంగారు గనిగా మారింది. దోపిడీ దొంగలను మాత్రమే కాదు, ఆదాయపు పన్నుశాఖ అధికారులను సైతం తమిళనాడు ఆకర్షించింది. దేశం మొత్తంపై ఐటీ పరంగా తమిళనాడులో చోటుచేసుకున్న ఆకస్మిక తనిఖీలు, మెరుపు దాడులు మరెక్కడా జరగవు. ఐటీ దాడుల్లో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, రాజకీయనాయకులు ఎందరో పట్టుబడ్డారు.. పట్టుబడుతున్నారు. ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న సంపదలో అధికశాతం బంగారు ఉండడం గమనార్హం. తమిళనాడు ప్రజలకు బంగారు నగలపై తీరని మోహం ఉత్తరాది దొంగల దాహాన్ని తీరుస్తోందని ఆ రిటైర్డు పోలీసు అధికారి చెప్పారు. తమిళనాడు ప్రజల మోహం, ఉత్తరాది దొంగల దాహం ఎప్పుడు తీరుతుందో కాలమే నిర్ణయించాలని ఆయన వ్యాఖ్యానించారు. స్వాధీనం చేసుకున్న నగలు, మణికంఠన్, మురుగన్, సురేష్ ‘లలిత’ చోరుడు దొరికాడు: తిరుచ్చిరాపల్లిలోని లలితా జ్యువెలరీలో రూ.13 కోట్ల విలువైన బంగారు నగల దోపిడీకి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. తిరువారూరులో వాహనతనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒకడు పట్టుబడగా, మరొకడు పారిపోయాడు. తిరుచ్చిరాపల్లి బస్‌స్టేషన్ సమీపంలోని లలితా జ్యువెలరీలో రెండురోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి పాఠకులకు విదితమే. జ్యువెలరీలో మొత్తం 190 మంది పనిచేస్తుండగా వీరిలో పది మంది ఉత్తరాదికి చెందిన వారు కావడంతో ఆ కోణంలో తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. పుదుక్కోట్టైలోని ఒక లాడ్జీలో ఉన్న ఐదుగురు ఉత్తరాది యువకులను పోలీసులు విచారించగా వారంతా వివిధ దోపిడీ కేసుల్లోని దొంగల ముఠాకు చెందిన సభ్యులని తేలింది. ఇదిలా ఉండగా, తిరువారూరు జిల్లావ్యాప్తంగా తీవ్రస్థాయిలో వాహనతనిఖీలు జరుగుతుండగా గురువారం రాత్రి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు నిలపగా, బైక్‌ను అక్కడే పడేసి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వీరిలో తిరువారూరు జిల్లా మాడపురానికి చెందిన మణికంఠన్ (32) పట్టుబడగా అదే జిల్లాకు చెందిన సురేష్ (28) అనే మరో యువకుడు పారిపోయాడు. విచారణలో లలిత జ్యువెలరీలో దోపిడీకి పాల్పడిన వారిలో మణికంఠన్ ప్రధాన నిందితుడని తేలింది. ముఠా నాయకుడు తిరువారూరుకు చెందిన మురుగన్ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దుండగులు వచ్చిన బైక్ నుంచి లలిత జ్యువెలరీకి చెందిన కొన్ని బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణికంఠన్ ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పట్టిచ్చిన మిరప్పొడి: లలిత జ్యువెలరీలో ఉత్తరాది దొంగలే దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. దుండగులు పనిముగించుకుని వెళ్లే ముందు పోలీసు జాగిలాన్ని తప్పుదోవ పట్టించేందుకు ముఠానాయకుడు మురుగన్ సలహాతో మిరప్పొడి చల్లారు. అయితే ఉత్తరాది దొంగలకు మిరప్పొడి వినియోగించే అలవాటు లేదని పోలీసుల విచారణలో తేలడంతో తమిళనాడువారి పనే అయి ఉంటుందనే కోణంలో విచారణ దిశను మార్చుకున్నారు. దీంతో దొంగలెవరో గుర్తించడం సాధ్యమైంది. -
లేడీస్ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు...
డబ్బులు ఊరికే రావు అన్న మాటకు పేటెంట్ లలితా జ్యుయెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. కిరణ్ కుమారే! మనకి డబ్బు ఊరికే రాదన్న విషయం గ్రహించిన వ్యక్తి .. మన కష్టాన్నే కాదు..డబ్బు విలువను కూడా గ్రహించినట్టే! విలువలు చదువుకుంటే రావు... అనుభవాలే విలువలకు పాఠాలు! వజ్రం విలువ తెలిసినవాడు మనిషి విలువను తెలుసుకుంటే ఆ మనిషే ఒక వజ్రం అవుతాడు! తన జీవితంలోని కష్టసుఖాలను తరుగుపెట్టి సాక్షికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... బిజినెస్ చాలా ఈజీ.. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా నెల జీతం దగ్గరే ప్లాన్ చేసుకుంటోంది యూత్. ప్రతివాళ్లూ పది నుంచి అయిదు గంటల ఉద్యోగాలనే సౌకర్యంగా ఫీలవుతున్నారు. దానికే మైండ్‌ను సెట్ చేసుకుంటున్నారు. కూలి పనికి చదువెందుకు చెప్పండి? అందుకే యూత్ ఎంట్రప్రెన్యూర్షిప్వైపు రావాలి. రిస్క్ ఉంటుంది. తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రిస్క్ వద్దనుకుంటే ఇరవైవేల జీతానికే రాజీ పడి.. లైఫ్ పట్ల కంప్లయింట్స్ పెట్టుకోకూడదు. లైఫ్‌లో చాలెంజ్ ఉండాలి అనుకుంటే రిస్క్ తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలి. లక్ష రూపాయల పెట్టుబడితో అయినా సరే వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. నిజానికి బిజినెస్ చాలా ఈజీ. నాకు ఆరుగురు అక్కయ్యలు, ఒక్క అన్న.. మొత్తం ఎనిమిదిమందిమి. ప్రతి పూటా కడుపు నిండా భోజనం మాకు చాలెంజే! ఇంట్లో అందరికీ మంచి గుడ్డలు లేక అందరం కలిసి ఒకేసారి బయటకు వెళ్లలేకపోయేవాళ్లం. గుడ్డల దాకా ఎందుకు అందరికీ సరిపడా భోజనం కూడా ఉండేది కాదు. అది మాకు తెలియనివ్వకుండా మేనేజ్ చేసేది మా అమ్మ. అయినా గుర్తుపట్టి ఆకల్లేదు అంటూ ఆ బాధను దిగమింగుకునేవాళ్లం. చెప్పాలంటే ఇలాంటివి బోలెడు. అదో స్ట్రగుల్. నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది.. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ ‘‘ ఎలాగోలా ఈ రోజు గట్టెక్కింది. రేపు ఎలా గడిచిపోయింది?’’ అని ఆలోచిస్తూనే పడుకునేది. అందుకే లేమిని ఎలా అనుభవించామో గుర్తుపెట్టుకుంటే కలిమికి బానిసలం కాము. సౌకర్యాలు మనల్ని నడిపించకూడదు. వాటి అవసరమెంతో గ్రహించే విచక్షణ మనకుండాలి అంటాను. చదువు.. గురువులు బడికి వెళ్లి నేను చదువుకుంది లేదు. చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న పరిస్థితులే నాకు గురువులు. నేనేం సాధించినా జీవిత పాఠాల సారంతోనే. ఎంత చదువుకున్నా, ఎంత మంచిగా ఉన్నా.. ఎన్ని గొప్ప పనులు చేసినా సరే.. మన దగ్గర డబ్బులుంటేనే గుర్తింపు ఉంటుంది. జీవిత భాగస్వామి నా భార్యా వాళ్లది మా కన్నా కాస్త కలిగిన కుటుంబం. అయినా కష్టం విలువ తెలిసిన మనిషి. వృథాగా ఖర్చు పెట్టదు. ఇల్లు, ముగ్గురు పిల్లలు, వాళ్ల చదువుల బాధ్యతంతా ఆమెదే. ఈ మధ్య నుంచే బిజినెస్‌లో కూడా హెల్ప్ చేస్తోంది. వ్యాపారానికి సంబంధించి నా గురించి అన్నీ తెలిసిన ఒక నమ్మకమైన మనిషి తోడుగా ఉండడం చాలా అవసరం. లైఫ్ పార్టనర్‌ను మించిన రిలయబుల్ ఫ్రెండ్ ఎవరుంటారు? ఎవరికైనా?. డైమండ్స్ జ్యుయెలరీ వింగ్‌ను ఆమెకు అప్పజెప్పాను. ఓ వైపు డైమండ్ జ్యుయెలరీ డిజైన్స్, ప్రైజ్ చూసుకుంటూనే నెమ్మదిగా పర్చేజ్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ గురించీ తెలుసుకుని ప్రస్తుతం వాటినీ కమాండ్ చేస్తోంది. భార్య హేమా కిరణ్‌కుమార్, కూతుళ్లు భక్తి కిరణ్, భవ్య కిరణ్, కొడుకు హీత్ కిరణ్‌లతో లలితా జ్యుయెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. కిరణ్‌కుమార్ వాళ్లేం చెప్పినా మన మంచికే నా భార్య సలహాలను తప్పకుండా పాటిస్తా. నా కన్నా ఆమెకే ముందు చూపు ఎక్కువ. ఆ మాటకొస్తే ఆడవాళ్లందరికీ ముందు చూపు ఉంటుంది. మగవాళ్ల కన్నా లోతుగా ఆలోచిస్తారు. మగవాళ్లు ఏ ఆలోచన లేకుండానే ఓ మాట అనేస్తారు. కాని ఆడవాళ్లు అలా కాదు. వాళ్లలో బ్యూటీ అదే. ఉదాహరణకు.. నా స్టాఫ్ ఎవరైనా వచ్చి ‘‘అన్నా .. ఒక ప్రాబ్లం వచ్చింది. నాకో లక్ష రూపాయిలు కావాలి’’ అని అడిగితే ‘‘సరే.. ఇస్తాలే’’ అనేస్తా. అదే మా ఇంట్లో పనమ్మాయి మా ఆవిడను ఒక పదివేలు అడిగిందనుకోండి. ‘‘ఏమైంది? పోయిన్నెలే తీసుకున్నావ్ కదా? మళ్లీ ఎందుకు అవసరమొచ్చింది? బాబుకు బాగాలేదా?’’ అంటూ మా ఆవిడ ఆమెను ఓ పది ప్రశ్నలు అడుగుతుంది. బాగాలేదు అని పనమ్మాయి జవాబిస్తే.. డ్రైవర్‌ను పురమాయిస్తుంది ‘‘వెళ్లి వాళ్ల బాబును చూసిరా’’ అంటూ. అంటే నిజంగానే ఆ పదివేలు తనకు అంత అర్జెంటా? లేక తాగుడుకో, ఇంక దేనికో భర్త సతాయిస్తే అడుగుతోందా అన్న విషయం తేల్చుకోవడానికి. సబబే అనిపిస్తే వెంటనే పదివేలు సర్దుతుంది. అంతెందుకు ‘‘నా పర్స్‌లో డబ్బులు అయిపోయాయి.. పెట్టు’’ అని నేను చెబితే కూడా ‘‘మొన్ననే 30 వేలు పెట్టాను. రెండు రోజుల్లోనే అయిపోయాయా? లెక్క చెప్పండి?’’ అంటుంది. అలా లేడీస్ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు. నిజానికి అంత ఈజీగా డబ్బూ ఖర్చుపెట్టరు. కాబట్టి ఆడవాళ్లు ఏదైనా చెబుతుంటే శ్రద్ధగా వినాలి. ఆ ఆడవాళ్లు మీకేం తెలుసు? అని కొట్టిపారేయొద్దు. వాళ్లేం చెప్పినా 99 శాతం మన మంచికే. మీ మేలు కోరుకొనే ఒకే ఒక్క మనిషి భార్యే. ఒకవేళ భార్యలో మీకు లోపాలు కనిపించాయంటే అది కచ్చితంగా మీ తప్పే. మీలో నిజాయితీ, బాధ్యత లోపించిందన్నమాటే. భర్త.. భార్యను గౌరవిస్తే.. భార్యా.. భర్తను గౌరవిస్తుంది.. ప్రేమిస్తుంది. ఫ్యామిలీ టైమ్ ఏ కొంచెం టైమ్ దొరికినా కుటుంబంతో గడుపుతా. ఇంట్లో ఉన్నా ఆలోచనలన్నీ బిజినెస్ చుట్టే తిరుగుతుంటాయి. మాట్లాడుతూనే మైండ్‌లో పది ప్లాన్స్ తయారైపోతాయి. కాని బయటకు కనపడనివ్వను . ఊర్లో ఉంటే కచ్చితంగా రాత్రి భోజనం అందరం కలిసే చేస్తాం. హోటల్స్‌లో డిన్నర్స్ చాలా రేర్. ఏ మాత్రం వీలున్నా ఫ్యామిలీతో షాపింగ్ కూడా చేస్తా. ఒకవేళ కుదరకపోతే మా ఆవిడ తనకు నచ్చినవన్నీ ఫొటోస్ తీసి నాకు వాట్సప్ చేస్తుంది. సెలెక్ట్ చేయమని. ‘‘మీకు నచ్చినవి తీసుకోండి’’ అంటే వినదు. ఎలాగైనా నన్ను ఇన్వాల్వ్ చేయాలని (నవ్వుతూ). సమాజంలో స్త్రీల మీద పెరుగుతున్న దాడులు.. దేన్నయినా సహనంగా భరించే రోజులకు ఫుల్స్టాప్ పెట్టాలి. ఆడవాళ్లూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. తమ జోలికి వచ్చిన మగవాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. రానున్న రోజులు మరింత గడ్డుకాలంగా కనబడ్తున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండాల్సిందే. తోబుట్టువులు ఊహ తెలిశాక ఓ మూడు నాలుగేళ్లు ఎంజాయ్ చేసుంటానేమో పండుగలను! నాకు పన్నెండు, పదమూడేళ్లు వచ్చేసరికే ఇంట్లో పేదరికం అర్థమైపోయింది. అప్పటి నుంచీ పండుగలన్నిటికీ దూరం. దృష్టంతా డబ్బు సంపాదనమీదే. కాని రాఖీ పండుగ నాకు మంచి చైల్డ్ మెమరీ. మా అక్కయ్యలు రాఖీ కడితే.. ప్రతి అక్కయ్యకు రూపాయి పావలా ఇచ్చేవాడిని. అక్కయ్యలు బొట్టు పెట్టి.. రాఖీ కడుతుంటే ఆ ప్రేమ స్పర్శ నాకో భరోసానిచ్చేది. వాళ్లకు పెళ్లిళ్లై, పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు వచ్చాక ఎవరి కుటుంబాలతో వాళ్లు బిజీ అయ్యారు. అందుకే ఇప్పుడు రాఖీకి ఆ ప్రేమ పోస్ట్‌లో వస్తూంటుంది (నవ్వుతూ) మా అక్కయ్యలకు, నాకు మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. మా పెద్దక్కయ్యకు పెళ్లయి పాప పుట్టాక నేను పుట్టాను. అందుకే మా అక్కయ్యలందరిలో నేను అమ్మ ప్రేమనే ఆస్వాదించా. మా మూడో అక్కయ్యతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ. ఆమే నాకున్న రెండు జతల బట్టలను శుభ్రంగా ఉతికి.. ఇస్త్రీ చేసి పెట్టేది. చిన్నప్పుడు నాకు జుట్టు బాగా ఒత్తుగా ఉండేది. అప్పట్లో పఫ్ తీసుకోవడం ప్యాషన్. అలా పఫ్ తీసి దువ్వి.. తనకు నచ్చినట్టుగా నన్ను తయారు చేసేది. చాలా మిస్ అవుతాను ఆ రోజుల్ని. అప్పుడున్న ప్రేమాప్యాయతలు వేరు. ఫ్రెండ్స్.. పార్టీలు.. అలాంటి వాతావరణంలో పెరగలేదు. కాబట్టి ఇప్పుడూ అవి అలవాటు కాలేదు. చాలా చాలా నార్మల్ లైఫ్. నాకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు. పార్టీలు, గెట్ టుగెదర్లు, ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడాలూ ఉండవ్. ఆ రోజు ఎలా బతికానో.. ఈ రోజూ అలాగే ఉన్నాను.. ఉన్నాం! ఆడపిల్ల.. మగ పిల్లాడు అనే భేదం.. ఎందుకు ఉండాలి? తల్లిదండ్రులకు బాగా లేదంటే ఎంతమంది మగపిల్లలు పరిగెత్తుకొస్తున్నారు? అదే కూతురైతే? పెళ్లయి అత్తారింట్లో ఉన్నా భర్త, అత్తమామలకు నచ్చజెప్పుకొని తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. కళ్లలో పెట్టుకొని చూసుకుంటుంది. ఇదంతా ప్రేమతో చేస్తుంది.. ప్రతిఫలం ఆశించకుండా! కూతురు లేని ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీయే కాదు. నన్ను అడిగితే కూతురు చాలా ముఖ్యం.. కొడుకు సెకండ్ ముఖ్యం అంటాను. రిగ్రెట్స్.. నేనో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినా.. కొత్త కారు కొనుక్కున్నా మా అమ్మానాన్న గుర్తొస్తారు. వాళ్లు లేకుండా ఇదంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నానే అని చాలా రిగ్రెట్స్ ఫీలవుతా. కష్టాలు మాత్రమే అనుభవించి పోయారు. కనీసం కడుపు నిండా తిండిక్కూడా నోచుకోలేదు. కాని ఈ రోజు నాకున్నదంతా వాళ్ల ఆశీర్వాదమే. వాళ్ల బ్లెసింగ్స్తోనే ఈ స్థాయికొచ్చాను. ముఖ్యంగా మా అమ్మ ఆశీర్వాదం. ఎనిమిది మంది బిడ్డలు కాదు.. వేయి మంది బిడ్డలున్నా అందరికీ సమానంగా ప్రేమను పంచడం ఆమెకే సాధ్యం. ప్రతిరోజూ మా అమ్మానాన్న (షకాలి బాయి, మూల్‌చంద్ జీ) ఫొటోకు దీపం పెట్టి దండం పెడ్తాను. గంటలు గంటలు పూజలు, భజనలైతే చేయను కాని మనస్ఫూర్తిగా స్మరించుకుంటాను. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నింటికీ దూరం. అసలు నాకు వాటి గురించి తెలియను కూడా తెలియదు. నా దగ్గరున్న కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. మనుషులతో నేరుగా మాట్లాడ్డమే ఇష్టం. డబ్బులు ఊరికే రావు.. బంగారానికి బ్రాండ్ నేమ్ నాకు దేవుడు నా కస్టమర్. వాళ్లిచ్చిన డబ్బులతోనే నా తిండి, నా బట్టలు, కారు.. ఈ వ్యాపారమైనా. అలాంటి కస్టమర్‌కు డబ్బులు ఊరికే రావు కదా! ఈ నిజం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటిదాకా దీన్నిలా ఎవరూ అడ్రస్ చేయలేదు. గోల్డ్ ఇండస్ట్రీ.. ఆ మాటకొస్తే ఏ ఇండస్ట్రీ గురించైనా సామాన్యులకేం తెలుసు? లేబుల్ వేసి.. ఇదే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అంటే దాన్నే నమ్మి కొనుక్కుంటారు. నేను అలాంటి గిమ్మిక్కులు చేయకుండా డబ్బు కోసం పడే కష్టం విలువ తెలిసిన వాడిగా ప్రొడక్ట్ క్వాలిటీ పట్ల కస్టమర్‌కు అవగాహన కల్పిస్తున్నాను. అతని కష్టానికి సరితూగే క్వాలిటీ ప్రొడక్ట్‌ను చేతిలో పెడ్తున్నాను. నేనేం చెబుతానో.. అదే చేస్తాను. నా మాటలే ఈరోజు బ్రాండ్ నేమ్‌గా అయ్యాయి అంటే నన్ను నమ్ముతున్నట్టేగా. ఆ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు. ఫ్యూచర్లో లిస్టింగ్‌కి కూడా వెళ్తాను. లలితా జ్యుయెలరీ అంటే మనందరి జ్యుయెలరీగా అనుకునేలా చేస్తాను. ఎంప్లాయ్స్ విషయంలో కూడా అంతే కన్సర్న్తో ఉంటాను. నా దగ్గర మొత్తం 33 వేలకు పైనే ఎంప్లాయ్స్ ఉన్నారు. వాళ్లందరినీ నా కుటుంబంగానే ట్రీట్చేస్తా. హార్డ్ వర్క్ అండ్ టీమ్ వర్క్‌తోనే విక్టరీ అని నమ్ముతా. దాన్నే పాటిస్తా. నా ఉద్యోగులకూ అదే చెప్తా.-సంభాషణ: సరస్వతి రమ -
లలితా జ్యువెలరీ దుకాణాల్లో సోదాలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని లలితా జ్యువెలరీ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలోని లలితా జ్యువెలరీ దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. పరీక్షల కోసం కొంతమేర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం నాణ్యత, తూకం, నెలవారీ పథకాలు, ప్రైజ్‌మనీ చిట్స్ అంశాలపై ఆరా తీశారు. తూనికలు, కొలతల శాఖ కమిషనర్ దామోదర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. -
విజయవాడలో లలితా జ్యూవెల్లరీ షోరూం ప్రారంభం
-
విజయవాడలో ఈనెల 21న లలితా జ్యూవెల్లరీ షోరూం ప్రారంభం
-
సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు!
ఈ మాట వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదూ. కాకపోతే సెల్ఫీలకు బదులు అక్కడ డబ్బులు అని ఉంటుంది. ‘అవును మరి డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు’.. ఈ మాటని టీవీ యాడ్స్‌లో పదేపదే చెప్పి, తన వేషదారణతో ఫేమస్ అయ్యారు లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్. అయితే గతకొంతకాలం నుంచి ఈ యాడ్ టీవీల్లో పెద్దగా కనిపించటం లేదు. అయినా సరే ఈయన చెప్పిన డైలాగ్‌ను మాత్రం జనం మరిచిపోలేదు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్.. ఈయన్ను ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు ఓ సెల్ఫీ దిగి ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు! లక్ ఉండాలి. హహ అంటూ.. ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను .. ఓ సెల్ఫీ అడిగాను’ అంటూ కిరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. Selfies evvariki urike raavu! Luck undali ;) Haha! Met Lalitha Jewelry MD, Mr Kiran Kumar on the flight. Had to ask for a selfie! pic.twitter.com/NjBoDnVR6s — Allu Sirish (@AlluSirish) July 3, 2018 -
మొదటిసారి సఫలం.. రెండోసారి విఫలం
సాక్షి, పంజగుట్ట: వారు ఉన్నత విద్యావంతులు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులు తాళలేక సులువుగా డబ్బు సంపాదించాలని దొంగతనాలను ఎంచుకున్నారు. అత్యంత రద్దీగా ఉండే లలితా జ్వువెలరీని తమకు అనువైన స్థానంగా ఎంచుకున్నారు. మొదటిసారి దొంగతనం చేయడంలో సఫలమయ్యారు. రెండోసారి తమ ప్రయత్నం ఫలించక తిరిగి వెళుతుండగా అదే ఆధారంతో పోలీసులకు పట్టుబడ్డారు. మంగళవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. క్రిష్ణాజిల్లా, నందిగామకు చెందిన షేక్ కరీముల్లా (27) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చి సింధి కాలనీలోని బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన వాణి క్రాంతి మెడిసిన్‌లో పీజీ, డిప్లమా పూర్తిచేసింది. కొన్నిరోజులు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో పని చేసింది. సింధికాలనీలోని ఓ హాస్టల్ ఉంటోంది. సోషల్ మీడియాలో పరిచయం.. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడటంతో స్నేహితులుగా మారారు. ఇద్దరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో, సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల లలితా జ్వువెలరీ ప్రచారంలోకి రావడం, నిత్యం రద్దీగా ఉండడంతో దొంగతనానికి అనువుగా ఉంటుందని దానిని ఎంచుకున్నారు. గత నెల 11న ఇద్దరూ కలిసి షాపునకు వచ్చి మొదటి అంతస్తులో బంగారు గాజులు కొనేందుకు వచ్చినట్లు నటిస్తూ సేల్స్‌మెన్ దృష్టి మరల్చి నాలుగు గాజులు, ఒక బ్రాస్లెట్ కొట్టేశారు. మరో మారు వచ్చి.. ఆ తర్వాత ఇద్దరు బురఖా ధరించిన యువతులు అదే షాపులో ఆరు లక్షల విలువచేసే 20 తులాల బంగారు ఆభరణం చోరీ చేసి దాని స్థానంలో రోల్డుగోల్డ్ ఆభరణం ఉంచారు. దీనిని గుర్తించిన షాపు నిర్వాహకులు అనుమానంతో ఆడిటింగ్ నిర్వహించగా, వాణి, కరీముల్లాల చోరీ వెలుగులోకి వచ్చింది. దీంతో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా వారు వెళ్లిన మార్గం కనిపెట్టలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత మల్లీ దొంగతనం చేసేందుకు అదే షాపునకు రాగా వారిని గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సొత్తును నందిగామలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి 1.32 లక్షలు రుణం తీసుకున్నట్లు అంగీకరించడంతో పోలీసుల బృందం నందిగామ వెళ్లి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బురఖా దొంగలను పట్టుకుంటాం. 20 తులాల బంగారు ఆభరణం దొంగతనం చేసిన బురఖా దొంగలను అతిత్వరలో పట్టుకుంటామని, ఇప్పటికే సాంకేతిక ఆధారాలతో పురోగతి సాధించినట్లు డీసీపీ తెలిపారు. -
లలితా జ్యువెలర్స్ చోరీ గుట్టు రట్టు
-
లలితా జ్యువెలర్స్ చోరీ కేసులో లవర్స్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పంజగుట్ట పరిధిలోని సోమాజిగూడ సర్కిల్లో ఉన్న లలితా జ్యువెలర్స్ సంస్థలో గత సోమవారం చోటు చేసుకున్న ‘రెండో చోరీ’ కేసును పంజగుట్ట పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రేమజంటను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు జ్యువెలర్స్‌లో తస్కరించిన సొత్తును తమ స్వస్థలానికి తీసుకువెళ్ళి అక్కడున్న ఓ ఫైనాన్స్ సంస్థలో కుదువ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ బంగారం రికవరీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణి బతుకుతెరువు కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో నగరానికి వలసవచ్చారు. సికింద్రాబాద్ సింథికాలనీలోని బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్‌లో నివసిస్తున్న వీరిద్దరూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రేమజంట తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే వీరి దృష్టి సోమాజిగూడ చౌరస్తాలో ఉన్న లలితా జ్యువెలర్స్‌పై పడింది. గత సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో వీరిద్దరూ జ్యువెలర్స్‌కు వచ్చారు. బంగారు ఆభరణాల కోసం ఆరా తీస్తూ దుకాణం మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. అక్కడున్న రద్దీని తమకు అనువుగా మార్చుకున్న ఈ వీరు వివిధ రకాలైన ఆభరణాలు చూపించమంటూ సేల్స్‌మెన్ దృష్టిని మళ్ళించింది. అదును చూసుకుని అక్కడి కౌంటర్లో ఉన్న రెండు జతల బంగారు గాజులు (55.3 గ్రాములు), ఓ బ్రాస్లెట్ (10.7 గ్రాములు) ఎత్తుకుపోయారు. ఆ రోజు దుకాణం మూసే సమయంలో స్టాక్ సరిచూడగా తేడా కనిపించింది. దీంతో మంగళవారం పూర్తిస్థాయి ఆడిగింగ్ నిర్వహించిన యాజమాన్యం 66 గ్రాముల బరువుతో ఉన్న ఐదు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా బుధవారం సంస్థకు చెందిన జి.మధుసూదన్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. నిందితుల్ని గుర్తించిన పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో చోరీ సొత్తును కరీముల్లా నందిగామలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో రూ.1.2 లక్షలకు తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది. దీంతో ఆ సొత్తు రికవరీ చేయడానికి పంజగుట్ట పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కోఠిలో ‘ఆగిన’ మొదటి కేసు... ఈ నేరం జరగడానికి ముందే ఈ నెల 3న లలితా జ్యువెలర్స్‌లో ఓ దొంగతనం జరిగింది. బురఖా ధరించిన వచ్చిన ఇద్దరు మహిళలు రూ.6 లక్షల విలువైన 20 తులాల బంగారు నెక్లెస్‌ను ఎత్తుకెళ్ళారు. సేల్స్‌మెన్ దృష్టి మళ్ళించి బంగారు నెక్లెస్ స్థానంలో రోల్డ్‌గోల్డ్‌ది ఉంచారు. దీన్ని బట్టి ఆ నిందితులు అంతకు ముందే షోరూమ్‌కు వచ్చి ఉంటారని, అప్పడే ఫొటో తీసుకుని వెళ్ళి రోల్డ్‌గోల్డ్‌ది తయారు చేయించి ఉంటారని పోలీసులు అనుమానించారు. నిందితులు ప్రయాణించిన ఆటో ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఆ నిందితురాళ్ళు దుకాణానికి వచ్చిన ఆటోను సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆ రోజు బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు కోఠిలో ఉన్న ఆంధ్రాబ్యాంకు కూడలివద్ద తన ఆటో ఎక్కినట్లు వెల్లడించాడు. దీంతో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లు సేకరించిన పరిశీలించారు. వీటిలో ఎలాంటి ఆధారం దొరకకపోవడంతో ఆ కేసు దర్యాప్తు అక్కడితో ఆగిపోయింది. చోరీ దొంగతనం అనంతరం బుర్ఖా ధరించిన మహిళలు ఎక్కిన ఆటో వివరాలు తెలిస్తే ఫలితం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఆటో వెళ్ళిన మార్గంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పాటు వీరి ఎక్కిన ప్రాంతంలో లేకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. లలితా జ్యువెలర్స్ చోరీ కేసులో ప్రేమజంట అరెస్ట్ -
లలితా జ్యువెల్లర్స్లో మరో చోరీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నగల దుకాణం లలితా జ్యువెల్లర్స్లో మరోసారి దొంగతనం జరిగింది. సోమాజిగూడలోని తమ షోరూమ్‌లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్ ప్రతినిధి జి. మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న తమ షోరూమ్‌కు ఓ జంట 66 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసిందని ఫిర్యాదులో తెలిపారు. తమ సిబ్బందిని గందరగోళానికి గురిచేసి ఈ దొంగతనం చేశారని వెల్లడించారు. రూ. 24.9 గ్రాముల బంగా గాజులు, 10.7 గ్రాముల బ్రాస్లెట్, 30.4 గ్రాముల గాజుల జత ఎత్తుకుపోయారని వివరించారు. తర్వాత రోజు ఈ విషయం బయటపడటంతో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించామన్నారు. చోరీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతకుముందు కూడా లలితా జ్యువెల్లర్స్లో దొంగతనం జరిగింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం దొగిలించారని ఈ నెల 9న లలితా జ్యువెల్లర్స్ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు నగ స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు ఈ చోరీ చేసినట్టు సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా గుర్తించారు.