
ఈ మాట వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదూ. కాకపోతే సెల్ఫీలకు బదులు అక్కడ డబ్బులు అని ఉంటుంది. ‘అవును మరి డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు’.. ఈ మాటని టీవీ యాడ్స్‌లో పదేపదే చెప్పి, తన వేషదారణతో ఫేమస్ అయ్యారు లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్.
అయితే గతకొంతకాలం నుంచి ఈ యాడ్ టీవీల్లో పెద్దగా కనిపించటం లేదు. అయినా సరే ఈయన చెప్పిన డైలాగ్‌ను మాత్రం జనం మరిచిపోలేదు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్.. ఈయన్ను ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు ఓ సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు! లక్ ఉండాలి. హహ అంటూ.. ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను .. ఓ సెల్ఫీ అడిగాను’ అంటూ కిరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.
Selfies evvariki urike raavu! Luck undali ;) Haha! Met Lalitha Jewelry MD, Mr Kiran Kumar on the flight. Had to ask for a selfie! pic.twitter.com/NjBoDnVR6s
— Allu Sirish (@AlluSirish) July 3, 2018
Comments
Please login to add a commentAdd a comment