అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీపై ఐకాన్ స్టార్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి.. ఓటీటీలోనూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పుష్ప-2 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నందుకు అల్లు శిరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మీ సంస్కృతికి.. అంతగా పరిచయం లేని చాలా భిన్నమైన ఇలాంటి చిత్రానికి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. క్లైమాక్స్ సీన్‌పై ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ స్పందించడం అద్భుతమని పోస్ట్ చేశారు.
సుకుమారా- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప- 2 ది రూల్ జనవరి 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్రలో మెప్పించారు. టాలీవుడ్ నుంచి జగపతి బాబు, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు.
I am glad the Pushpa 2 is receiving insane love from Western audience as well. Esp for a film like this which is vastly different from their culture or something they're not too familiar with.. @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial https://t.co/KprBKRPluw
— Allu Sirish (@AlluSirish) February 4, 2025
Comments
Please login to add a commentAdd a comment