
హనుమాన్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా(Preity Zinta) హైదరాబాద్‌లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో ఉన్న ఈ దేవాలయంలోని ఆంజనేయస్వామి స్వయంభువుడని ప్రతీతి ఉంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి మంగళ,శని వారాల్లో అనేకమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. ఇక్కడ హనుమజ్జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో ప్రీతి జింటా అక్కడి స్వామి వారిని దర్శించుకోవడం మంచి శుభపరిణామం అని అభిమానులు చెబుతున్నారు.
నేడు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో సత్తా చాటాలని వీరాంజనేయ స్వామిని ప్రీతి జింట దర్శించుకుంది. పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నేడు సన్ రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తే మూడో స్థానంలో నిలుస్తోంది.