అందుకే నా సినిమాలు లేట్‌ అవుతున్నాయి: హీరో అల్లు శిరీష్‌ | Hero Allu Sirish Talk About Buddy Movie | Sakshi
Sakshi News home page

‘బడ్డీ’ రీమేక్‌ కాదు.. ఆ ఒక్క పాయింట్‌ మాత్రమే తీసుకున్నాం: అల్లు శిరీష్‌

Published Thu, Aug 1 2024 6:58 PM | Last Updated on Thu, Aug 1 2024 8:10 PM

Hero Allu Sirish Talk About Buddy Movie

‘బడ్డీ’ పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ అని కామెంట్స్‌ వచ్చాయి. ఇదిస్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్ గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే రాస్తున్నారు. అలాంటి వాళ్లను మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది "బడ్డీ" స్ట్రైట్ ఫిలిం అని. ఈ మూవీ క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’అన్నారు హీరో అల్లు శిరీష్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్‌ 2న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అల్లు శిరీష్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘బడ్డీ’ మూవీని లాస్ట్ ఇయర్ మార్చి లో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్ లోనే రిలీజ్ కు తీసుకురావాలని అనుకున్నాం. నా మూవీస్ కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్ గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్ ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్ గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గకుండా సీజీ వచ్చింది.

డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్ తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళంలో వచ్చింది, అలాగే ఇంగ్లీష్ లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది, స్టోరీ విన్నాక మల్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను. టెడ్డీ బేర్ కు ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్ ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్త కథ.

"బడ్డీ" కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా...ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం "బడ్డీ" కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్ గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్ గా ఉంటుంది.


ఈ చిత్రంలో  లవ్ స్టోరీ ఉంటుంది కానీ చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. కథకు ఎంత కావాలో అంతే ఉంచాడు దర్శకుడు శామ్. లవ్ స్టోరీ ఎక్కువ ఉంటే కథ డీవీయేట్ అవుతుందని ఆయన భావించాడు.  "బడ్డీ"  సినిమా రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు రన్ టైమ్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ లెంగ్త్ ఉంటే బాగుండదు

హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్, బీజీఎం అదిరిపోతుంది. మేము "బడ్డీ" చూసినప్పుడు బీజీఎం సూపర్బ్ గా ఉందనిపించింది. స్పెషల్ షోస్ వేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిప్ హాప్ థమిళ చేసిన తని ఓరువన్, ధృవ లాంటి మూవీస్ పాటలు నాకు ఇష్టం.

ప్రొడక్షన్ పరంగా మూవీ చాలా రిచ్ గా ఉంటుంది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. ఒక పాత విమానం కొని దాన్ని మూవీ కోసం ఆర్ట్ వర్క్ చేసి అందులో షూట్ చేశాం. క్లైమాక్స్ ఫైట్ కూడా అందులోనే ఉంటుంది. సినిమాకు కావాల్సింది ఇస్తాను కానీ తక్కువ డేస్ లో షూటింగ్ చేయండని ప్రొడ్యూసర్ చెప్పేవారు. రెండు షిఫ్టుల్లో సినిమాను కంప్లీట్ చేశాం.

ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాతే మరొకటి. అందుకే నా మూవీస్ లేట్ అవుతున్నాయి. సాధారణంగా చిన్నా, పెద్దా ఏ సినిమా అయినా అనుకున్న టైమ్ కు చేయలేం. ఖచ్చితంగా ఎంతో కొంత ఆలస్యమవుతూనే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement