
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని లలితా జ్యువెలరీ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలోని లలితా జ్యువెలరీ దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. పరీక్షల కోసం కొంతమేర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం నాణ్యత, తూకం, నెలవారీ పథకాలు, ప్రైజ్‌మనీ చిట్స్ అంశాలపై ఆరా తీశారు. తూనికలు, కొలతల శాఖ కమిషనర్ దామోదర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment