
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment