Bengaluru court
-
కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. హస్తం పార్టీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సాంగ్స్ ప్లే చేశారంటూ మ్యూజిక్ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి కన్నడ చిత్రం కేజీఎఫ్-2లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్టీ మ్యూజిక్ మేనేజర్ ఎం నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియర్ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్ ట్విటర్ ఖాతాతో పాటు.. భారత్ జోడో యాత్ర ప్రచార ట్విటర్ హ్యాండిల్‌ను సైతం తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు! -
పాకిస్తాన్‌కు జై కొట్టిన అమూల్యకు బెయిల్
బెంగళూరు: "పాకిస్తాన్ జిందాబాద్" అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేసిన యువతి అమూల్య లియోనాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు జైలు జీవితం తర్వాత ఆమె బెయిల్‌పై విడుదల కానుంది. కాగా గురువారం నాటి విచారణలో బెంగళూరు కోర్టు ఆమె బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేస్తే ఆమె పారిపోవడంతో పాటు మరోసారి ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడింది. (ఆమె నోట పాక్ పాట) ఫిబ్రవరి 20న బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొంది. ఇందులో ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ఈన్ ఓవైజీ కూడా పాల్గొనగా.. అతని సమక్షంలోనే 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదించింది. దీంతో అమూల్య వ్యాఖ్యలపై నిరసనగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాల కింద బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. (ఆ విద్యార్ధిని బెయిల్ పిటిషన్ కొట్టివేత..) -
నిత్యానందపై అరెస్ట్ వారంట్
యశవంతపుర (బెంగళూరు): అత్యాచారం, మహిళ కిడ్నాప్ కేసుల్లో నిందితుడైన వివాదాస్పద స్వామి నిత్యానందకు రామనగర కోర్టు అరెస్ట్ వారంట్ జారీచేసింది. నిత్యానంద ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అతని లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రామనగర కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. నిత్యానందను అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రామనగర పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. నిత్యానంద ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నిత్యానంద అహ్మదాబాద్‌లోని ఆశ్రమం నుంచి విదేశాలకు పరారైనట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. కొన్నినెలలుగా నిత్యానంద బెంగళూరు శివార్లలోని బిడది ఆశ్రమానికి ముఖం చాటేశాడు. అతడు బెంగళూరులో ఉండి ప్రవచనాలు చేస్తున్నట్లు ఆయన శిష్యులు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. బెంగళూరులో లేని వ్యక్తి ఎలా ప్రవచనాలు చేస్తాడని పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి: నిత్యానందకు నోటీసులపై వింత జవాబు) -
‘లలితా’ నగలు స్వాధీనం
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు. -
రజనీకాంత్ స్పందిస్తారా?
బెంగళూరు: తమ ఫేవరేట్ హీరో సినిమా విడుదలైనప్పుడు అభిమానులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. తమకు నచ్చిన రీతిలో అభిమానం ప్రదర్శిస్తుంటారు. తమ హీరో కటౌట్లకు పూల దండలు వేయడం, డప్పులతో ఊరేగింపుగా సినిమాకు రావడం చేస్తుంటారు. కొంతమంది అయితే తమ అభిమాన కథానాయకుడి చిత్రపటాలపై పాలాభిషేకాలు కురిపిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే రజనీ ఫ్యాన్స్ చేసే హడావుడి తారాస్థాయికి చేరుతుంది. ఆయన పోస్టర్లకు పెద్దఎత్తున క్షీరాభిషేకం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టులో ఇన్ జంక్షన్ సూట్ ఫైల్ అయింది. తన సినిమాలు విడుదల సందర్భంగా పాలు వృధా చేయకుండా అభిమానులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేసేలా ఆదేశించాలని కోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. దీనిపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.