రజనీకాంత్ స్పందిస్తారా? | Injunction suit filed in Bengaluru against Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ స్పందిస్తారా?

Published Wed, Mar 30 2016 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

రజనీకాంత్ స్పందిస్తారా?

రజనీకాంత్ స్పందిస్తారా?

బెంగళూరు: తమ ఫేవరేట్ హీరో సినిమా విడుదలైనప్పుడు అభిమానులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. తమకు నచ్చిన రీతిలో అభిమానం ప్రదర్శిస్తుంటారు. తమ హీరో కటౌట్లకు పూల దండలు వేయడం, డప్పులతో ఊరేగింపుగా సినిమాకు రావడం చేస్తుంటారు. కొంతమంది అయితే తమ అభిమాన కథానాయకుడి చిత్రపటాలపై పాలాభిషేకాలు కురిపిస్తున్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే రజనీ ఫ్యాన్స్ చేసే హడావుడి తారాస్థాయికి చేరుతుంది. ఆయన పోస్టర్లకు పెద్దఎత్తున క్షీరాభిషేకం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టులో ఇన్ జంక్షన్ సూట్ ఫైల్ అయింది. తన సినిమాలు విడుదల సందర్భంగా పాలు వృధా చేయకుండా అభిమానులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేసేలా ఆదేశించాలని కోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. దీనిపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement