కేజీఎఫ్‌2 ఎఫెక్ట్‌.. కాంగ్రెస్‌ ట్విటర్‌ అకౌంట్‌ బ్లాక్‌! | KGF 2 Music Case Court Order Block Congress Twitter Account | Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌2 ఎఫెక్ట్‌.. కాంగ్రెస్‌ ట్విటర్‌ అకౌంట్‌ బ్లాక్‌!

Published Mon, Nov 7 2022 8:31 PM | Last Updated on Mon, Nov 7 2022 8:31 PM

KGF 2 Music Case Court Order Block Congress Twitter Account - Sakshi

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ ఇచ్చింది బెంగళూరు కోర్టు. హస్తం పార్టీ ట్విటర్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్‌ జోడో యాత్రలో కేజీఎఫ్‌-2 సాంగ్స్‌ ప్లే చేశారంటూ మ్యూజిక్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

రాహుల్‌ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్‌ జోడో యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించి కన్నడ చిత్రం కేజీఎఫ్‌-2లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్‌టీ మ్యూజిక్‌ మేనేజర్‌ ఎం నవీన్‌ కుమార్‌ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌ గాంధీ సహా ముగ్గురు సీనియర్‌ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్‌ ట్విటర్‌ ఖాతాతో పాటు.. భారత్‌ జోడో యాత్ర ప్రచార ట్విటర్‌ హ్యాండిల్‌ను సైతం తాత్కాలికంగా బ్లాక్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బిగ్‌ ట్విస్ట్‌.. అప్రూవర్‌గా దినేష్‌ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement