రాహుల్‌ గాంధీకి ఝలక్‌ | Twitter Temporarily Suspended Rahul Gandhi Account | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు ట్విటర్‌ ఝలక్‌.. ఆ ఫొటోతో తాత్కాలికంగా బ్లాక్‌!

Published Sun, Aug 8 2021 7:29 AM | Last Updated on Sun, Aug 8 2021 7:31 AM

Twitter Temporarily Suspended Rahul Gandhi Account - Sakshi

కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(51)కి మైక్రోబ్లాగింగ్‌సైట్‌ ట్విటర్‌ ఝలక్‌ ఇచ్చింది. కొద్ది గంటలు(దాదాపు ఒకరోజు!) ఆయన ట్విటర్‌ అకౌంట్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ట్విటర్‌ పేజీ విషయాన్ని తెలియజేసింది. 

ఢిల్లీ మైనర్‌(9) హత్యాచార ఘటనకు సంబంధించి బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌.. బాలిక తల్లిదండ్రులతో ఉన్న ఫొటోని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ చర్యతో బాధితుల ఐడెంటిటీని రివీల్‌ చేశాడని, జువైనల్‌ చట్టాన్ని ఉల్లంఘించాడని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(NCPCR) గుస్సా అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, ట్విటర్‌ ఇండియాకు నోటీసులు కూడా జారీ చేసింది. 

ఈ తరుణంలో ఆయన ట్విటర్‌ అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్‌ చేసిన ట్విటర్‌.. ఆపై కాసేపు స్టేటస్‌ అప్‌డేట్‌ను కూడా లాక్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఆ ఫొటో ట్వీట్‌ను డిలీట్‌ చేయగా.. అకౌంట్‌ మళ్లీ యాక్టివేట్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement