ట్విట్టర్లోకి అడుగుపెట్టిన రాహుల్!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తోటి నాయకులంతా ట్విట్టర్ను ఏలేస్తున్న ఈ కాలంలో.. ఇన్నాళ్ల తర్వాత ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు.
@OfficeOfRG అనే ఐడీతో ట్విట్టర్ హ్యాండిల్ ప్రారంభించారు. ఆయన కేవలం మూడంటే మూడే అకౌంట్లను ఫాలో అవుతున్నారు. అవి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ. అయితే.. ఇందులో వస్తున్న ట్వీట్లను చూస్తుంటే మాత్రం ఇది రాహుల్ గాంధీ స్వయంగా నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలా కాకుండా, ఆయన తరఫున వేరే ఎవరో నిర్వహిస్తున్నట్లే కనిపిస్తోంది. మే 12వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారంటూ ఓ ప్రకటనను మొదటి ట్వీట్గా ఇచ్చారు. రాహుల్ అధికారిక కార్యక్రమాలు, రాబోయే కార్యక్రమాల గురించి ఇందులో ఉంటుందని కూడా చెప్పారు. కాగా, గురువారం రాత్రి సమయానికి సుమారు 43 వేల మంది రాహుల్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు.
On 12th May Rahul Gandhi will begin a 15km padyatra in Telangana's Adilabad Dist- covering 5 villages,starting from Wadial Village
— Office of RG (@OfficeOfRG) May 7, 2015