temporarily suspended
-
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
రుద్రప్రయాగ: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తడంతో సోనప్రయాగ్ దగ్గర యాత్రను నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కేదార్‌నాథ్‌కు ప్రయాణాల్ని ఆపేయాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఆదివారం రాష్ట్ర విపత్తు నిర్వహణకు చెందిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. -
మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ చైన్లలో ఒకటైన మెక్‌డొనాల్డ్స్ సంచలననిర్ణయం తీసుకుంది. అమెరికా లోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఉద్యోగాలపై వేటు వేయనుంది. తాజాగా మరో రౌండ్ తొలగింపులకి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం నివేదించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై స్పష్టత లేదు. సోమవారం నుండి బుధవారం వరకు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గత వారమే మెక్ డోనాల్డ్స్ అమెరికా ఉద్యోగులకు మెయిల్ పంపింది. ఈ వారంలో షెడ్యూల్ అయిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా కంపెనీ ఉద్యోగులను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 5, బుధవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. త్వరలోనే ఉద్యోగులను తీసివేయనున్నట్టు కూడా మెక్ డోనాల్డ్స్ ప్రకటించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. కాగా ప్రపంచ ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌తో సహా అనేక టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. -
హైదరాబాద్: పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలకొస్తే.. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి లింగంపల్లి-ఫలక్‌నుమా ఆర్సీ పురం-ఫలక్‌నుమా ఫలక్‌నుమా-ఆర్సీ పురం ఫలక్‌నుమా-హైదరాబాద్‌ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెండురోజుల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే. Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2 — South Central Railway (@SCRailwayIndia) January 11, 2023 -
స్పైస్‌జెట్ ఎయిర్వేస్కు డీజీసీఏ షాక్
భారత్‌లో విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్సైస్ జెట్‌కు ఝలక్ ఇచ్చింది. స్పైస్ జెట్ కార్గొ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది. మొత్తం 30 రోజుల పాటు లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది డీజీసీఏ. లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్‌ను అనుమతించరు. దేశీయ, విదేశీ విమానాలను ఇందుకు అనుమతించబోమని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వార్షిక ఏడాదిలో రూ.30 కోట్ల లాభాన్ని కార్గొ రవాణా ద్వారా సాధించింది స్పైస్ జెట్ సంస్థ. మరోవైపు డీజీసీఏకు స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ఓ రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ఆ షిప్పర్ణు బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు స్పైస్ జెట్ తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం. చదవండి: క్రిప్టోపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు -
Afghanistan: తాలిబన్లకు మరో షాక్!
బెర్లిన్:అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు జర్మనీ షాకిచ్చింది. అఫ్గన్‌కు డెవలప్మెంట్ సాయాన్ని తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ డెవలప్మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ స్థానిక మీడియాకు వివరించారు. దేశానికి అభివృద్ధి సహకారాన్ని ప్రస్తుతానికి నిలిపివేశామని రినిష్ పోస్ట్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే పని కొనసాగుతుందన్నారు. అంతకుముందు అఫ్గన్ సంక్షోభంపై స్పందించిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్మీర్ కాబూల్ విమానాశ్రయంలో వేలాదిమంది ప్రజలు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిగ్గుచేటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానవ విషాదానికి అందరమూ బాధ్యులమని వ్యాఖ్యానించారు. అలాగే తమ పౌరులతోపాటు, వారికి అండగా నిలిచిన అఫ్గాన్ ప్రజల క్షేమం కోసం తాము చేయ గలిగిందంతా చేస్తామని హామీ ఇచ్చారు. కాగా సంవత్సరానికి 430 మిలియన్ యూరోలు (506 మిలియన్ డాలర్లు) అప్గానిస్తాన్‌కు అందించేందుకు జర్మనీ గతంలో అంగీకరించింది. తద్వారా అతిపెద్ద దాతలలో ఒకటిగా నిలిచింది. ఈ సాయాన్ని స్థానిక పోలీసు బలగాల శిక్షణకు, న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అలాగే మహిళల హక్కుల రక్షణ, అవినీతిపై పోరుకు ఉద్దేశించబడింది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్ తాలిబన్ల పూర్తి నియంత్రణలోకి వచ్చి, షరియా చట్టాన్ని ప్రవేశపెట్టి, దానిని ఖలీఫాత్గా మార్చినట్లయితే ఒక్క సెంటు కూడా అందించ బోమని జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ గతవారం స్పష్టం చేశారు. చదవండి : Aircraft crash: ఆఖరి క్షణాల షాకింగ్ వీడియో Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి! -
రాహుల్ గాంధీకి ఝలక్
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(51)కి మైక్రోబ్లాగింగ్సైట్ ట్విటర్ ఝలక్ ఇచ్చింది. కొద్ది గంటలు(దాదాపు ఒకరోజు!) ఆయన ట్విటర్ అకౌంట్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ట్విటర్ పేజీ విషయాన్ని తెలియజేసింది. ఢిల్లీ మైనర్(9) హత్యాచార ఘటనకు సంబంధించి బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్.. బాలిక తల్లిదండ్రులతో ఉన్న ఫొటోని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ చర్యతో బాధితుల ఐడెంటిటీని రివీల్ చేశాడని, జువైనల్ చట్టాన్ని ఉల్లంఘించాడని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) గుస్సా అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, ట్విటర్ ఇండియాకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ తరుణంలో ఆయన ట్విటర్ అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ట్విటర్.. ఆపై కాసేపు స్టేటస్ అప్డేట్ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఆ ఫొటో ట్వీట్‌ను డిలీట్ చేయగా.. అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యింది. Shri @RahulGandhi’s Twitter account has been temporarily suspended & due process is being followed for its restoration. Until then, he will stay connected with you all through his other SM platforms & continue to raise his voice for our people & fight for their cause. Jai Hind! — Congress (@INCIndia) August 7, 2021 -
కరోనా ఎఫెక్ట్: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం
వెల్లింగ్టన్: భారత్ కోవిడ్–19 హాట్ స్పాట్‌గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్ భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్‌లో ఉన్న న్యూజిలాండ్ పౌరులు సహా ఎవరూ ఏప్రిల్ 11 నుంచి రెండు వారాలు న్యూజిలాండ్‌కు రావద్దంటూ ఆంక్షలు విధించింది. 11 నుంచి 28 వరకు భారత్ నుంచి ఎవరినీ తమ దేశంలోకి అనుమతించబోమని న్యూజిలాండ్ ప్రధాని జకీండా ప్రకటించారు. -
టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
వాషింగ్టన్ : చైనా సోషల్ మీడియా యాప్స్ టిక్‌టాక్, వీచాట్ డౌన్లోడ్ల నిషేధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వీచాట్, టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేయకుండా నిరోధించే ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని కోర్టు న్యాయమూర్తి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11:59 గంటలకు అమలులోకి వస్తుందని తెలిపారు. తాజా ఉత్తర్వులపై టిక్‌టాక్ సంతోషం వ్యక్తం చేసింది. (వీచాట్ బ్యాన్ : ట్రంప్ సర్కారుకు షాక్) యాపిల్, గూగుల్ సోర్లలో నిషేధం అమల్లోకి రాకుండా నిరోధిస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ వెల్లడించారు. అయితే నవంబర్ 12 నుండి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను నిరోధించడానికి నికోలస్ నిరాకరించారు. మరోవైపు ఈ విషయంలో ఒకవైపు చర్చలు జరుగుతుండగా, రాత్రికి రాత్రికి టిక్‌టాక్ డౌన్లోడ్లపై నిషేధం ఎలా విధిస్తారంటూ ఆదివారం నాటి విచారణలో టిక్‌టాక్ తరపు న్యాయవాది జాన్ ఈ హాల్ వాదించారు. (టిక్‌టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం) భద్రత, గోప్యత ఆందోళన నేపథ్యంలో అమెరికా టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను ట్రంప్ నిషేధం విధించింది. ఇందులో భాగంగా ట్రంప్ నిర్ణయంపై వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశాయి. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పరిధులు దాటి టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారని ఆరోపించాయి. భద్రత, గోప్యత విషయంలో పౌరుల ప్రయోజనాలను కాపాడుతున్నామన్న తమ ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని వాదిస్తున్నాయి. కాగా చైనా యాప్స్ నిషేధానికి సంబంధించి ట్రంప్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా కోర్టులు ఆదేశాలివ్వడం ఇది రెండవసారి. గతవారం వీచాట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై కాలిఫోర్నియా కోర్టు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. -
శరత్‌కుమార్, రాధారవి సస్పెన్షన్
చెన్నై: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నుంచి ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్‌లను సస్పెండ్ చేసినట్లు సంఘ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లే సంఘ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందులో భాగంగా తాము నిర్వహించిన శోధనల్లో గత సంఘం నిర్వాహకం చేసిన పలు అవకతవకలు, అవినీతి వెలుగులోకి వచ్చాయని, వీటి గురించి పలు మార్లు కార్యవర్గ సమావేవంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు నడిగర్ సంఘం పేర్కొంది. అందులో భాగంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని, సంఘ విధి విధానాల పరంగా జరిగిన అవకతవకలపై విచారణలో నిజానిజాలు బయటపడతాయని తెలిపింది. అంత వరకూ మాజీ సంఘం నిర్వాహకులు శరత్‌కుమార్, రాధారవి, వాగా చంద్రశేఖర్‌ల సంఘ సభ్యత్వంను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలపింది. -
పాపికొండల బోట్ యాత్రకు బ్రేక్
రాజమండ్రి(తూర్పుగోదావరి): పాపికొండల పర్యటనకు వెళ్లే లగ్జరీ బోట్లను నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం నుంచి దృఢత్వ పరీక్షల నిమిత్తం నిలిపివేశారు. ముందుగా ఈ విషయం తెలియక రిజర్వేషన్ చేయించుకున్న వివిధ ప్రాంతాల పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. లెసైన్సులు రెన్యువల్ చేసేందుకు బోట్లను తనిఖీ చేయగా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లు తమ సిబ్బంది గుర్తించారని దీంతో వాటిని నిలిపివేశామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని సరి చేయటానికి నాలుగు రోజుల వరకు సమయం పడుతుందని అంటున్నారు. బోటు యజమానులు వాటిని త్వరగా పూర్తి చేస్తే వెంటనే రెన్యువల్ చేస్తామని వారు పేర్కొంటున్నారు. దీంతో మరో నాలుగు రోజులపాటు పాపికొండల లగ్జరీ బోట్ యాత్రకు అంతరాయం తప్పదని సమాచారం.