
వెల్లింగ్టన్: భారత్ కోవిడ్–19 హాట్ స్పాట్‌గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్ భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్‌లో ఉన్న న్యూజిలాండ్ పౌరులు సహా ఎవరూ ఏప్రిల్ 11 నుంచి రెండు వారాలు న్యూజిలాండ్‌కు రావద్దంటూ ఆంక్షలు విధించింది. 11 నుంచి 28 వరకు భారత్ నుంచి ఎవరినీ తమ దేశంలోకి అనుమతించబోమని న్యూజిలాండ్ ప్రధాని జకీండా ప్రకటించారు.