DGCA Temporarily Suspends Spicejet Licence To Carry Dangerous Goods - Sakshi
Sakshi News home page

SpiceJet: షిప్పర్​ తప్పిదం! నెలపాటు కార్గో లైసెన్స్ సస్పెండ్

Published Sat, Oct 16 2021 12:58 PM | Last Updated on Sat, Oct 16 2021 2:15 PM

DGCA temporarily suspends SpiceJet licence to carry dangerous goods - Sakshi

భారత్​లో విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్సైస్ జెట్‌కు ఝలక్ ఇచ్చింది. స్పైస్​ జెట్​ కార్గొ లైసెన్స్​ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది.
 

మొత్తం 30 రోజుల పాటు లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది డీజీసీఏ. లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్​ను అనుమతించరు. దేశీయ, విదేశీ విమానాలను ఇందుకు అనుమతించబోమని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వార్షిక ఏడాదిలో రూ.30 కోట్ల లాభాన్ని కార్గొ రవాణా ద్వారా సాధించింది స్పైస్​ జెట్​ సంస్థ.
 
మరోవైపు డీజీసీఏకు స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ఓ రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ఆ షిప్పర్​ణు బ్లాక్​ లిస్ట్​లో చేర్చినట్లు స్పైస్​ జెట్​ తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం.

చదవండి: క్రిప్టోపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement