రూపాయి టికెట్ స్కీమ్ ఆపేయండి | DGCA asks SpiceJet to immediately stop selling Re 1 tickets | Sakshi
Sakshi News home page

రూపాయి టికెట్ స్కీమ్ ఆపేయండి

Published Wed, Apr 2 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

రూపాయి టికెట్ స్కీమ్ ఆపేయండి

రూపాయి టికెట్ స్కీమ్ ఆపేయండి

 న్యూఢిల్లీ: రూపాయికే విమాన టికెట్‌నిచ్చే ఆఫర్‌ను తక్షణం నిలిపేయాలని చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు విమానయాన నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆఫర్ అనుచితమైనదని. మార్కెట్లో అధిపత్యం చెలాయించడానికే ఇలాంటి ఆఫర్‌ను ఇస్తున్నారని పేర్కొంది. చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అతి తక్కువ ధర, రూ. 1 బేస్ చార్జీకే విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నామని మంగళవారం ప్రకటించింది. కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించిన గంటల్లోనే డీజీసీఏ నిలిపేయాలని తీవ్ర పదజాలంతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.

 వివరణ ఇచ్చాం
 తమకు డీజీసీఏ నోటీసు అందిందని, దానికి తమ స్పందనను తెలియజేశామని స్పైస్‌జెట్ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ను ఉపసంహరించినదీ, లేనిదీ కంపెనీ వెల్లడించలేదు.  ఇంతకు ముందటి ఆఫర్లలాగే ఈ ఆఫర్ కూడా పరిమితమని, ఇప్పటికే కొన్ని వేల సీట్లను ఈ ధరకు విక్రయించామని పేర్కొంది. ఈ ఆఫర్ అనుచితమైనదన్న డీజీసీఏ వాదనను కంపెనీ తిరస్కరించింది. డిమాండ్ పెంచడానికే ఈ ఆఫర్‌ను ఇచ్చామని, అంతేకాని మార్కెట్లో అధిపత్యం చెలాయించడానకి కాదని వివరణ ఇచ్చింది.

 రూ. 1 టికెట్ స్కీమ్
 రూ. 1 బేస్ ఫేర్‌కే టికెట్ అందించడమే కాకుండా రూ.799, రూ.1,499 చార్జీలకే విమాన టికెట్లనందించే రెండు ప్రత్యేకమైన స్కీమ్‌లను స్పైస్‌జెట్ కంపెనీ మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లు పరిమిత కాాలం బుకింగ్‌లకే వర్తిస్తాయని పేర్కొంది. అయితే ఈ చార్జీలకు పన్నులు, ఎయిర్‌పోర్ట్ ఫీజులు అదనమని పేర్కొంది. ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది మార్చి 28 వరకూ ఉద్దేశించిన ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ రూ.1 బేస్ చార్జీలపై ఇంధన సర్‌చార్జీ కూడా ఉండబోదని, అయితే సమ్మర్ షెడ్యూల్‌లో తాము ప్రారంభించే కొత్త రూట్లలలో చార్జీలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. మంగళవారం నుంచి గురువారం  (ఏప్రిల్ 1 నుంచి 3 వ తేదీ) వరకూ బుకింగ్‌లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. కాగా భారీ ట్రాఫిక్ కారణంగా కంపెనీ వెబ్‌సైట్ క్రాష్ అయిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement